Saturday, 19 February 2022

పొడపాటి చిన్మయీశ్వర్ జయంతి సందర్భంగా జనవిజ్ఞాన వేదిక, అద్దంకి డివిజన్ ఆధ్వర్యంలో సివిల్స్ స్టూడెంట్స్ వెల్ఫేర్ ఫండ్ ఆవిష్కరణ





కట్టా రామకోటేశ్వర రావు డిగ్రీ కళాశాల , అద్దంకి , తేది :  19.2.22

ఈరోజు జనవిజ్ఞానవేదిక అద్దంకి డివిజన్ ఆధ్వర్యంలో కట్టా రామకోటేశ్వరరావు డిగ్రీ కళాశాల నందు సివిల్స్ మరియు గ్రూప్ వన్ నకు సిద్ధమయ్యే విద్యార్థిని విద్యార్థులకు CIVILS STUDENTS WELFARE FUND కై నూతన ఆవిష్కరణ గావించ బడినది. బాబు పొడపాటి చిన్మ ఈశ్వర్ జన్మదిన సందర్భంగా .. స్టూడెంట్స్ నిధికి ఐదువేల రూపాయలు జనవిజ్ఞాన వేదిక అద్దంకి డివిజన్ అధ్యక్షుడు అయిన B. చంద్రశేఖరరావు నకు అందజేయడం అయినది. భవిష్యత్తులో మన పిల్లలు మన ఇంట్లో జరిగే శుభ సందర్భాల్లో ఈ స్టూడెంట్స్  నిధి కొరకై శక్తి మేరకు మనందరం చేయూతనిస్తూ తెలివైన పేద విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తూ, మన జన విజ్ఞాన వేదికను స్టూడెంట్స్ లో, ప్రజల హృదయాలలో పదిల  పరుచుకొందాం... తద్వారా విద్యార్థిని విద్యార్థులలో ప్రశ్నించే తత్వం తో పాటు,  విజ్ఞాన శాస్త్రాన్ని, శాస్తీయ దృక్పధాన్ని అభివృద్ధి చేసుకుందాం..

..............................

మన్నం త్రిమూర్తులు.

గౌరవ అధ్యక్షులు

జన విజ్ఞాన వేదిక అద్దంకి డివిజన్..... .









Thursday, 17 February 2022

బ్రూనో సజీవ దహనం... అతిపెద్ద మానవ తప్పిదం


నేడు సత్యాన్వేషణ దినం

ఫిబ్రవరి 17, 1600 సంవత్సరం. ఇటలీలోని రోమ్‌ నగరం, కాంపోడి ఫియోరి కూడలి అక్కడికి ఖగోళ సిద్ధాంత కర్త, గణిత శాస్త్రజ్ఞుడు అయిన గియార్డనో బ్రూనోను రెక్కలు విరిచికట్టి నాలుక తీగతో చుట్టి తీసుకొచ్చారు. నాలుకకు చుట్టిన తీగ విప్పేసి, చివరిసారి అడిగారు. ''తప్పులన్నీ ఒప్పుకో! ప్రాణభిక్ష పెడతాం!'' అన్నారు రోమన్‌ మత న్యాయస్థానం పెద్దలు. బ్రూనో తల అడ్డంగా తిప్పాడు. తను ఏ తప్పు చేయలేదని నిర్భయంగా చెప్పాడు. ఏ మాత్రం తొణకలేదు. శిక్ష అనుభవించడానికి సిద్ధం అన్నట్టుగా నిలబడ్డాడు.

'నేను చెప్పిన నిజాలు తరతరాలుగా మీ లాంటి మూర్ఖుల్ని తొలుస్తూనే ఉంటాయి' అన్న మనో నిబ్బరం ఆయనది. మత న్యాయస్థానం అధికారులు, రాజ్యాధినేతలు అందరూ ఆత్రంగా ఎదురు చూశారు. ఆ చివరి క్షణంలో నైనా దాసోహమంటాడేమోనని ఆశపడ్డారు. కానీ వారి ఆశ నిరాశే అయ్యింది. సత్యస్థాపన కోసం తను ఎలాంటి శిక్షకైనా సిద్ధమేనన్నట్టు, వారివైపు బ్రూనో జాలిగా చూశాడు. 'ఏమిటీ విచిత్రం? గాలీ, వెలుతురూ లేని చీకటి గదిలో ఏడేండ్లు బంధించినా, రోజూ చిత్రహింసలు పెట్టినా, క్రమం తప్పకుండా మానసికంగా వేధించినా బ్రూనోలో ఏమాత్రం మార్పు రాలేదేమి అని మతాధికారులు ఆశ్చర్యపోయారు. వారి పైశాచికత్వానికి వారే భయపడ్డారు. అయితే ఆ పైశాచిక ప్రవృత్తిని బ్రూనోకు అంటగట్టారు. ఇతను మనిషి కాదు, సైతానుగా మారిపోయాడు. సైతాను రక్తం భూమిమీద పడితే అరిష్టం సంభవిస్తుంది.. అని తీర్మానించుకున్నారు. మూఢత్వంలోంచి క్రూరత్వంలోకి జారిపోయారు. 

అప్పటివరకు మత విశ్వాసకులు భూమి కేంద్రకమని, దాని చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడని విశ్వసించేవారు. అది తప్పని సూర్యుని చుట్టే భూమి తిరుగుతోందని బ్రూనో చెప్పాడు. ఈ విషయం అంతకుమందు నికొలస్‌ కోపర్నికస్‌ (1473-1543) చెప్పిందే. దాన్ని బ్రూనో బలపరిచాడు. అంతేకాదు, ఈ భూమి లాంటి ''భూములు'' (గ్రహాలు) ఇంకా ఉన్నాయన్నాడు. ఈ విశ్వానికి ఆదీ, అంతం ఉన్నాయని మత విశ్వసకులు బోధిస్తూ ఉంటే, అలాంటి వేమీ లేవన్నాడు బ్రూనో. మొత్తానికి సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రచారం చేయడం క్రైస్తవ సన్యాసి అయి ఉండి.. క్రీస్తుకు, బైబిల్‌కు వ్యతిరేకంగా ప్రశ్నలు గుప్పించడం, విమర్శించడం నాటి రోమన్‌ మత న్యాయస్థానం వారికి ఆగ్రహం తెప్పించింది. మానవీయ విలువల్ని మంటగలుపుతూ ఆనాటి మత పెద్దలు బ్రూనోకు శిక్ష విధించారు. మనిషి, మనిషిని - మనిషిగా గుర్తించక పోవడం అతి దారుణంగా చరిత్రలో నమోదయ్యింది.

శాస్త్రవేత్త, తత్త్వవేత్త, కవి అయిన గియార్డనో బ్రూనో కాంపోడి ఫియోరి కూడలిలో నిలబెట్టారు. అది పేద క్రైస్తవ సన్యాసులు నివసించే ప్రాంతం. మతానికి వ్యతిరేకంగా ఎవరేమి మాట్లాడినా వారికి ఇలాంటి గతే పడుతుందని బ్రూనోకు బహిరంగంగా శిక్ష విధించారు. మొదట ఆయన బట్టలూడదీశారు. తర్వాత నగంగా తలక్రిందులుగా వేలాడదీశారు. సజీవంగా నిప్పంటించారు. అక్కడ ఉన్న జనం కన్నీటి పర్యంతమయ్యారు. శాసకుల దురాగతం చూసి భయకంపితులయ్యారు. పొరపాటున వేలి చివర కాలితేనే భరించుకోలేము కదా? 

మరి సజీవంగా కాలిపోవడానికైనా వెనుకాడని బ్రూనో గుండె ధైర్యాన్ని ఎలా అంచనా వేయగలం? కేవలం అభిప్రాయ బేధాలుండడం వల్ల ఒక మనిషిని నిలువునా కాల్చేసిన దురాగతం ఆనాడు అక్కడ జరిగింది. ఒక అబద్దం నిజాన్ని కాల్చేసింది. మతం, విజ్ఞాన శాస్త్రానికి మంటబెట్టింది. మూఢత్వం జిజ్ఞాసను చంపేసింది. గెలిచామనుకున్న మత పెద్దలు ఆరోజు అక్కడ తాత్కాలికంగా సంతోషించి ఉండొచ్చు. కాని మానవ చరిత్రలో వారు దోషులుగా, మూర్ఖులుగా, దుర్మార్గులుగా శాశ్వతంగా మిగిలిపోయారు. 

ఇంతకూ మత న్యాయస్థానం గియార్డనో బ్రూనోపై మోపిన అభియోగాలేమిటీ? ఏఏ కారణాల వల్ల ఆయనకు శిక్ష విధించారు?

1. కేథలిక్కుల నమ్మకాలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు, పుస్తకాలు రాసినందుకు. 

2. జీసస్‌ క్రీస్తును దేవుడిగా కీర్తించడాన్ని నిరసించినందుకు, 

3. ఆనాటి మత బోధకుల విశ్వాసాల్ని.. ట్రినిటీ (ఈశ్వర త్రిగుణత్వవాదం)ని బలంగా దెబ్బతీసినందుకు. 

4. జీసస్‌ తల్లి మేరీ కన్యాత్వాన్ని ప్రశ్నించినందుకు, అంటే.. కన్య అయిన మేరీ క్రీస్తుకు జన్మనెలా ఇచ్చిందీ.. అని అడిగినందుకు.. 

5. పునర్జననం ఉండదని అన్నందుకు. 

6. మానవుడి ఆత్మ వేరే శరీరంలో ప్రవేశించలేదని అన్నందుకు. 

7. మత బోధకులు మాయలు, మంత్రాలతో జనాన్ని మభ్యపెడుతూ తప్పుదోవ పట్టిస్తున్నారని తీవ్రంగా నిరసించినందుకు.

ఇప్పటికీ బ్రూనో ప్రశ్నలు ప్రశ్నలుగానే ఉండిపోయా యన్నది మనం గుర్తించుకోవాలి. క్రీ.శ. 1593-1600 మధ్య కాలంలో ఏడేండ్లు చెరసాలలో బంధించి, బ్రూనోను శిక్షించడానికి అన్ని రకాల కారణాల్ని వెతికింది నాటి మత న్యాయస్థానం. అతను పుస్తకాలలో రాసిన విషయాల ఆధారంగా, ఆయన మాట్లాడుతున్నప్పుడు విన్నవారు ఇచ్చిన సాక్ష్యాల ఆధారంగా కేసును బలోపేతం చేశారు. అబద్దపు కేసుల్ని గెలిపించాలంటే చట్టాలు, న్యాయస్థానాలు ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది. 

బ్రూనోకు వ్యతిరేకంగా సమకూర్చుకున్న పత్రాలు ఓసారి నోనా టవర్‌లో గల్లంతయ్యాయి. నాటి ప్రభువుల అడుగులకు మడుగులొత్తే వారు కొందరు మరికొన్ని సాక్ష్యాలు తెచ్చి సమర్పించారు. అంటే మూఢుల పట్టుదలను తక్కువగా అంచనా వేయగూడదని మనమిక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంది. తన తప్పిదాలను ఒప్పుకుని, క్షమాభిక్ష అర్థించవల్సిందిగా నాటి రోమన్‌ మత న్యాయస్థానం బ్రూనో మీద ఎంతగానో ఒత్తిడి తెచ్చింది. 

అయినా స్థిర చిత్తుడైన బ్రూనో లొంగలేదు. వారి అన్ని ప్రయత్నాలు విఫలమైనాయని గ్రహించి ఎనమిదవ పోప్‌ క్లిమెంట్‌ మరణశిక్ష విధించాడు. ఆ రోజు జనవరి 20, 1600 సంవత్సరం. ఈ ఉత్తర్వు ఫిబ్రవరి 17 నాడు అమలులోకొచ్చింది.

పత్రికలు, మీడియా లేని రోజుల్లో విషయాలు ఉన్నదున్నట్టుగా ఎలా బయటకొచ్చాయీ? అనే సందేహం ఎవరికైనా వస్తుంది. బ్రూనో ఆలోచనా విధానంతో ఏకీభవించే వారు సామన్య జనంలో ఉంటారు కదా? వారు చూసింది చూసినట్టుగా ప్రపంచానికి తెలియజేశారు. ముఖ్యంగా బ్రెస్‌ లౌ ప్రాంతానికి చెందిన గాస్పర్‌ స్కూప్‌ అనే అతను అక్కడ జరిగిన సంఘటనల్ని నమోదు చేశాడు. అందులో మానవాళి సగర్వంగా తలెత్తి చెప్పుకోగల విషయం ఒకటుంది. నాటి మత న్యాయాధీశులకు వణుకు పుట్టించే మాట గియార్డనో బ్రూనో అన్నాడని.. గాస్పర్‌ స్కూప్‌ రాశాడు.

''మీరుపలికే ఆ వాక్యం (మరణశాసనం) నా కన్నా అది మిమ్ముల్నే ఎక్కువ భయకంపితుల్ని చేస్తుంది'' అని నిర్భయంగా, ధైర్యంగా ప్రకటించి తన ఆత్మ విశ్వాసాన్ని ప్రకటించుకున్నాడు బ్రూనో. గియార్డనో (1548-17 ఫిబ్రవరి 1600) ఫిలిప్పో బ్రూనోగా ఇటలీ, నాప్లస్‌ రాజ్యం, నోలాలో పుట్టాడు. కవిగా, తత్త్వవేత్తగా, గణిత శాస్త్రాజ్ఞుడిగా పేరు సంపాదించుకున్నా, ఖగోళ సిద్ధాంత కర్తగా ప్రపంచ ప్రఖ్యాతుడయ్యాడు. ఆధునిక వైజ్ఞానిక పరికరాలు లేని రోజుల్లో, టెలిస్కోపులు, అబ్జర్వేటరీలు లేని రోజుల్లో కొన్ని వైజ్ఞానిక విషయాలు కచ్చితంగా చెప్పగలిగాడంటే.. ఆయన ఎంతటి మేధావో మనం అంచనా వేసుకోవాలి. చుక్కలు చాలా దూరంలో ఉన్న సూర్యుళ్ళు అని మొదట చెప్పిన వాడాయన. తరువాత కాలంలో ఆయన చెప్పిన అంశాల్ని ఆధునిక పరిశోధనలు ధృవీకరించాయి. స్వయం ప్రకాశితాలై ఉండి, వేడినిచ్చే కొన్ని 'సూర్యుళ్ళు' నిశ్చలంగా ఉన్నాయని, వాటి చుట్టు తిరిగేవాటినే 
''భూములం'టున్నామని, అవి వెలుగునూ, వేడిని సూర్యుల నుండి స్వీకరిస్తున్నాయని బ్రూనో ప్రకటించాడు. 

అసలు మొదటిసారి నక్షత్రాలను సూర్యుళ్ళుగా గుర్తించింది బ్రూనోయేనని ఆస్ట్రో ఫిసిస్ట్‌ - స్టీవెన్‌ సోటర్‌ ధృవీకరించారు.
అమోఘమైన ధారణాశక్తి, గొప్ప రచనా కౌశలం గియనార్డో బ్రూనో సొత్తు. ధృఢ చిత్తుడిగా ఉండడం, సత్యశోధన కోసం, సత్య స్థాపన కోసం ఎలాంటి కఠిన పరిస్థితులనైనా ఎదుర్కోగలగడం.. ఏ తరం వారికైనా ఆయన ఆదర్శం. ఖాళీ మెదళ్ళతో కేవలం ప్రచార ఆర్భాటాలతో, అబద్దాలతో, నిజాయితీ అనే పదం ఒకటుందని కూడా తెలుసుకోకుండా బతుకుతున్న వాళ్ళను చూస్తే జాలేస్తుంది.

 సత్యం ఏదో తెలిసి కూడా దాన్ని ప్రకటించడానికి జడుసుకునే పిరికి వాళ్ళు మన సమాజం నిండా ఉన్నారు. శాస్త్ర వైజ్ఞానిక రంగంలో కూడా ఉన్నారు. అలాంటి వారు రోజూ బ్రూనో వ్యక్తిత్వాన్ని గుర్తు చేసుకుని, తమలో కొద్ది కొద్దిగా మార్పు తెచ్చుకోగలిగితే సమాజాన్ని బాగుచేసిన వారవుతారు. చుట్టూ ఉన్నవారికి ఆదర్శప్రాయులు కావడం తర్వాత, ముందు వారు తమను తాము మోసం చేసుకోకుండా బతికితే చాలు.

వైజ్ఞానికంగా ప్రపంచం ఏమీ సాధించని రోజుల్లోనే బ్రూనోలాంటి వాళ్ళు గట్టిగా నిలబడి మూఢ నమ్మకాల్ని నిరసించారు. ప్రాణత్యాగానికి సిద్ధమయ్యారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు మతపెద్దలు పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తూ అబద్దాలని నిజాలుగా భ్రమింప జేస్తున్నారు. జనాన్ని మూఢత్వంలో ముంచి ఉంచుతున్నారు. బ్రూనో వారసుల అవసరం ఈనాడు కూడా ఉంది. ఇప్పటికీ భూమినే కేంద్రకంగా తీసుకుని, లెక్కలు కడుతున్న అజ్ఞాన పండితుల్ని జనం తిరస్కరించాల్సిన సమయం ఆసన్నమైంది. మనమిప్పుడు ఆస్ట్రాలజీ కాదు, ఆస్ట్రానమి తెలుసుకోవాలి!

ఫిబ్రవరి 17వ తేదీ ప్రపంచ ఆలోచనా సరళిని మార్చిన బ్రూనోను గుర్తుచేయడంతో పాటు, అలాంటి మరో మహానుభావుడు ఛార్లెస్‌ డార్విన్‌ను కూడా గుర్తు చేస్తుంది. ఇదే రోజు 1836లో డార్విన్‌ హెచ్చెమ్మెస్‌ బీగిల్‌ అనే ఓడ మీద టాస్మోనియా నుండి బయలుదేరాడు. బ్రూనో జ్ఞాపకార్థం పదిహేడు ఫిబ్రవరిని 'సత్యాన్వేషణ దినం'గా పరిగణిస్తున్నాం!

- డాక్టర్‌ దేవరాజు మహారాజు 
వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త, 
బయాలజీ ప్రొఫెసర్‌.

Loyola HighSchool, మార్కాపురం నందు ఉదయం, Govt.HighSchool ఎర్రగొండ పాలెం నందు మధ్యాహ్నం నిర్వహించబడిన సత్యాన్వేషణ దినోత్సవం కార్యక్రమం లో పాల్గొన్న JVV, ప్రకాశం సోషల్ మీడియా సబ్ కన్వీనర్ శేఖర్

🗣#బ్రూనో #Bruno #jvvap #jvvandhra ☀➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
సూర్యకేంద్ర సిధ్ధాంతాన్ని సమర్దించి, ప్రభోదించినందుకు అగ్నికి ఆహుతైన ఇటాలియన్ తత్వవేత్త.."జోర్డానో బ్రూనో " వర్దంతి సందర్భంగా..
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🔽ఒక ఇటాలియన్ తత్వవేత్త.  బైబిల్ కి విరుద్ధమైన సూర్యకేంద్ర సిధ్ధాంతాన్ని ప్రభోదించినందుకు క్రైస్తవ మత పెద్దలు ఇతన్ని సజీవ దహణం చేశారు. 

🔽ఇతను కూడా క్రైస్తవ సన్యాసే కానీ ఇతను క్రైస్తవ పెద్దలు ఆమోదించిన భూకేంద్ర సిధ్ధాంతాన్ని నమ్మలేదు. ఇతను ప్రతి నక్షత్రం చుట్టూ గ్రహాలు తిరుగుతాయని, ఈ భూమి లాంటి భూములు విశ్వంలో ఇంకెన్నో ఉంటాయని నమ్మేవాడు.

🔽1548లో ఇటలీలో జన్మించిన గ్యియర్డెనో బ్రూనో, కోపర్నికస్‌ సూర్య కేంద్రక సిద్ధాంతానికి   [తొలిసారిగా ధృవ పరిచినవాడు నికోలాస్ కోపర్నికస్(1473–1543)] ఆకర్షితుడైనాడు. 1572లో మతగురువుగా అభిషిక్తుడైన ప్పటికీ, సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని ప్రచారం చేయడం మొదలు పెట్టాడు. దీనిపై మరింత పరిశీలనలను, పరిశోధనలను చేసి మరిన్ని అదనపు అంశాలను చేర్చి అనంత విశ్వ సిద్ధాంతంను ప్రతిపాదించాడు. బ్రూనో ప్రతిపాదనలు మత విశ్వాసాలకు విరుద్ధమై నవి కదా! మత బోధకులకు కోపం తెప్పించిన అంశం భూమికి, సూర్యునికి అంతం, ఆరంభం ఉంటాయన్నది.

🔽బ్రూనోపై 131 అభియోగాలను మోపి 1591లో కేసును నమోదు చేశారు. 1593లో బ్రూనోను గాలి, వెలుతురు చొరబడని ఒక కారా గృహంలో బంధించి ఎన్నో హింసలకు గురిచేశారు. ఈ కారాగారంలో బ్రూనో సుమారు ఏడు సంవత్సరాలకుపైగా నరకయాతన అనుభవించాడు. ప్రతిరోజూ మత గురువుల నుంచి బ్రూనోకు వర్తమానం వచ్చేది. దాని సారాంశం బ్రూనో తన ప్రతిపాదనలు తప్పని ఒప్పుకోవడం, సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ఖండించడం, తాను ప్రచారం చేసిన అంశాలు తప్పని బహిరంగం గా ఒప్పుకోవడం. అయితే ప్రతి రోజూ బ్రూనో ఈ ప్రతిపాదనలు తిరస్కరించేవాడు.చివరకు బ్రూనోను  మతద్రోహిగా, సైతానుగా, రెచ్చగొట్టే ఉపన్యాసకుడుగా, మతానికి పరమ శత్రువు గా ప్రకటించి, ఒక్క రక్తంబొట్టు నష్టపోకుండా అగ్నికి ఆహుతి చెయ్యాలన్న మరణశిక్షకు ఆదేశాలు జారీ చేశారు. 

🔽ఆరోజు 1600 ఫిబ్రవరి 17. మత పెద్దల ఆదేశాల మేరకు ఇనుప సంకెళ్ళతో బ్రూనోను బంధించి, పెడరెక్కలు విరిచికట్టి, తాను నమ్మిన సత్యాన్ని ప్రజలకు చెప్పనీయకుండా ఉండటానికి వీలుగా నాలుకను ఇనుపతీగ లతో చుట్టి, నోటికి అడ్డంగా గుడ్డను కట్టి రోమ్‌నగర వీధుల గుండా ఊరేగిస్తూ మత విశ్వాసాలకు వ్యతిరేకంగా ఏ పని చేసినా వారికి ఈ శిక్ష తప్పదంటూ నినదిస్తూ ఊరేగించారు.

🔽బ్రూనో ఆశయాల వల్ల ప్రభావితమైన ప్రజలు వీధిలో బారులుతీరి కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యారు. బ్రూనోను ఊరేగిస్తూ పేద మతసన్యాసులు నివసిస్తున్న భవన సముదాయం మధ్యలో వథ్యశిలగా పిలిచే నిలువెత్తు స్తంభానికి బంధించి అతని నోట కట్టిన గుడ్డను, ఇనుప తీగను తొలగించి తన తప్పును ఒప్పుకున్నా క్షమించి బతకనిస్తా మన్నారు. 

🔽బ్రూనో నా మరణశిక్ష నాకన్నా మిమ్ములను ఎక్కువ యాతన పెడుతున్నది. దీనికి కారణం నేను పలికే నిజాలు. నేను నమ్మిన సిద్ధాంతం కచ్చితమైనది. సత్యమైనది. నేను ఏ తప్పూ చేయలేదు అని తేల్చి చెప్పాడు.*

 🔽బ్రూనో కాళ్ళ వద్ద ఆముదంలో ముంచిన గుడ్డలను వేసి నిప్పంటించారు. బ్రూనో పాదాలకు మంటలంటుకొని కొద్దికొద్దిగా ఎగిసిపడుతూ శరీర భాగాలను దహించి వేస్తున్నా, తన కనుబొమ్మలు, వెంట్రుకలు కాలుతూ సజీవదహనం అయిపోతూ కూడా సత్యం ఎల్లప్పటికీ శాశ్వతమైనది. విశ్వం గూర్చి సత్యాన్ని త్వరలోనే ప్రజలు తెలుసుకుంటారు అని నినదిస్తూ మరణించా డు. 

🔽30 సంవత్సరాల తర్వాత పలువురు మేధావులు దీన్ని తప్పిదంగా గుర్తించి బ్రూనో స్మారకార్థం ఒక స్థూపాన్ని అక్కడ నిర్మించారు. తర్వాతి కాలంలో సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని పలు సవరణలతో ప్రపంచం మొత్తం ఆమోదించింది.

🔽బ్రూనో బలిదానానికి గుర్తుగా వైజ్ఞానిక లోకం, విద్యార్థి వర్గాలు, ప్రజా సైన్సు ఉద్యమ కార్య కర్తలు ఫిబ్రవరి 17న సత్యాన్వేషణ దినోత్సవంగా పరిగణిస్తాయి.*

🔽తమకు తెలియని కాలంలో మానవ సమాజం కొన్ని నమ్మకాలను, విశ్వాసాలను తయారు చేసుకోవచ్చు. కాలక్రమంలో పరిశీలనల వల్ల, ప్రయోగాల వల్ల ఆ నమ్మకాల, విశ్వాసాల డొల్లతనం బయటపడవచ్చు. రుజువైన సత్యాన్ని మతం పేరుతో, సంప్రదాయం పేరు తో తిరస్కరించే శక్తులు అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ ఉంటాయి. వీరిని ఎదుర్కొని సత్యాన్ని ముందుకు తీసుకెళ్లిన ప్పుడే సమాజం అభివృద్ధి వైపు ప్రయాణిస్తుంది.

జననం1548-మరణం:17-02-1600
                    🌻🌻🌻🍒🕊🌻🌻🌻

Tuesday, 15 February 2022

i am a troll :: Swati chaturvedi

సోషల్‌ మీడియా విష నాగులు 

 
ఆవిడో ప్రముఖ జర్నలిస్టు. సోషల్‌ మీడియా పేరిట బీజేపీ విషనాగులు కట్టుకున్న పుట్టలను బద్దలు కొట్టిన యోధ! వాస్తవాల్లో విషాన్ని నింపి వక్రీకరించి.. నిజాలను సమాధి చేసి.. అసత్యాలను సమాజంపైకి వెదజల్లిన తీరును కండ్లకు కట్టిన సాహసి! దేశభక్తి ముసుగులో అత్యంత నీచమైన ప్రచారాలకు తెగించినవారి పశ్చాత్తాపాలను అక్షరీకరించిన తెగువ ఆమెది!
 
స్వాతి చతుర్వేది!! ఐ యామ్‌ ఏ ట్రోల్‌.. బీజేపీ, ఆరెస్సెస్‌ అంతర్జాల అంతఃపుర రహస్యాలను ఛేదించి.. శోధించి.. ఆమె రూపొందించిన పుస్తకం! అది పుస్తకం మాత్రమే కాదు.. వాట్సాప్‌, ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో కాషాయ మూకలు చేసే కనికట్టును, విద్వేష ప్రచారాల వెనుక గుట్టును విప్పి చెప్పిన రచన.

సమాజ హితాన్ని కాంక్షించి రచనలు చేసిన స్వాతి చతుర్వేది.. బీజేపీ, ఆరెస్సెస్‌కు కంటగింపుగా మారారు. ఫలితం.. ఒక మహిళ అని కూడా చూడకుండా అత్యంత దుర్మార్గంగా ఆమెపై ట్రోలింగ్‌ సాగింది! మొదట విస్మరించారు.. కొంతకాలం భరించారు. ఇక భరించలేని పరిస్థితిలో దాని అంతు చూసేందుకే ఆమె సిద్ధమయ్యారు. ఆ క్రమంలో రాసినదే ఈ పుస్తకం. ఆదివారం నాటి మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా ప్రస్తావించిన నేపథ్యంలో ఆ పుస్తకంలోని కొన్ని ముఖ్యాంశాలను పాఠకులకు పరిచయం చేసే ప్రయత్నం

స్వాతి చతుర్వేది ప్రముఖ పాత్రికేయురాలు. పలు వార్తా పత్రికలకు, టీవీ చానెల్స్‌కు పనిచేశారు. స్టేట్స్‌మన్‌, ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌, హిందుస్థాన్‌ టైమ్స్‌, ది ట్రిబ్యూన్‌, ఎన్‌డీటీవీ, ది వైర్‌, గల్ఫ్‌ న్యూస్‌, డక్కన్‌ హెరాల్డ్‌ వంటి పత్రికలలో ఆమె పాత్రికేయురాలిగా పేరు తెచ్చుకున్నారు. స్వాతి చతుర్వేదికి 2018లో రిపోర్టర్స్‌ వితౌట్‌ బార్డర్స్‌ నుంచి ‘ప్రైజ్‌ ఫర్‌ కరేజ్‌’ అవార్డు లభించింది. ‘డాడీస్‌ గర్ల్‌’ అనేది ఆమె రాసిన మొదటి పుస్తకం. రెండవ పుస్తకం- ‘ఐ ఆమ్‌ ఎ ట్రాల్‌ః ఇన్‌సైడ్‌ ది సీక్రెట్‌ వరల్డ్‌ ఆఫ్‌ ది బీజేపీ స్‌ డిజిటల్‌ ఆర్మీ’. బీజేపీకి చెందిన ఆకతాయిలు మహిళలను ఆన్‌లైన్‌లో వేధిస్తున్న నేపథ్యంలో ఈ పుస్తకం బహుళ ప్రాచుర్యం పొందింది.
 

బీజేపీ సోషల్‌ మీడియా తమకు గిట్టని అనేక మంది ప్రముఖులను కించపరుస్తూ అబద్ధపు, విద్వేష ప్రచారం సాగిస్తుంటుంది. ఆ ప్రముఖులకు వ్యక్తిగతంగా అవమానకర మెసేజ్‌లు పంపుతూ మానసికంగా వేధిస్తుంది. ఇందులో మహిళలపైనైతే మరింత అవమానకరంగా దుష్ప్రచారం సాగిస్తుంది. ప్రఖ్యాత పాత్రికేయురాలు స్వాతి చతుర్వేదిపై కూడా బీజేపీ పెద్దల కన్ను పడింది. దీంతో ఆమెను ఆన్‌లైన్‌లో వెంటాడమని తమ సోషల్‌మీడియాకు ఆదేశాలు ఇచ్చారు. పొద్దున లేస్తూనే, తనపై అసభ్య వ్యాఖ్యలను చూసుకోవడం ఆమెకు బాధగా ఉండేది. ఆ మెసేజ్‌లు తనకు ఎవరైనా రాజకీయ నాయకుడికి సంబంధాన్ని అంటగడుతూ లేదా శృంగారం గురించి కల్పిత గాథలు వివరిస్తూ అత్యంత అసభ్యంగా ఉండేవి. కొన్ని నెలల పాటు వాటిని భరించిన స్వాతి చతుర్వేది బీజేపీ సోషల్‌ మీడియా పనితీరు, చేస్తున్న నిర్వాకంపై రెండేండ్లపాటు పరిశోధన జరిపారు. అందులో పనిచేస్తున్న వారితో కూడా మాట్లాడి ‘ఐయామ్‌ ఎ ట్రోల్‌’ పుస్తకాన్ని 2016లో రాశారు. అందులో కొన్ని ప్రధాన భాగాలను సంక్షిప్తంగా అందిస్తున్నాం.

దేశం కనీవినీ ఎరుగని స్థాయిలో బీజేపీ సృష్టించిన భయంకర, ఉన్మాద, విద్వేష, అబద్ధాల యంత్రాంగం

ఎన్నడూ చూడనంత అధమస్థాయి ప్రచారం

నేనొక పరిశోధనాత్మక విలేకరిని. భావప్రకటనా స్వేచ్ఛయే నాకింత కూడు పెడుతుంది. కొన్ని సంవత్సరాలుగా భారత ప్రభుత్వం ‘అధికారిక రహస్యాల చట్టం’ కింద ఇతర విలేకరుల మీద మోపినట్లే నామీద కూడా అనేక కేసులు బనాయించింది. నా ప్రచురిత కథనాల బలంతో, ఆత్మవిశ్వాసంతో నేను ఆ కేసులన్నీ ఎదుర్కొన్నా. అట్లాంటి నేనే స్వయంగా దక్షిణ ఢిల్లీలోని వసంత్‌ విహార్‌ పోలీస్‌ స్టేషన్‌లో @లుటిన్‌సిన్‌సైడర్‌ పేరిట నడుపుతున్న అనామక ట్విట్టర్‌ ఖాతాదారు మీద కేసు పెట్టా. 40 వేల మంది ఇతని ట్విట్టర్‌ ఖాతాను అనుసరిస్తున్నారు. గత ఆరు నెలలుగా ఈ ఖాతాదారు పథకం ప్రకారం నా మీద విష ప్రచారం చేస్తున్నాడు. ఒక రాజకీయవేత్తతో నాకు అక్రమ శారీరక సంబంధం అంటగట్టాడు.

తెల్లారి లేచి చూస్తే చాలు నా ట్విట్టర్‌ ఖాతాలో, వందలాది అసభ్యకరమైన నోటిఫికేషన్లు కనిపిస్తాయి. ‘రాత్రికి నా రేటు గురించి’, ‘రాత్రి పూట రతి రహస్యాల’ గురించి అత్యంత అసభ్యకరమైన రీతిలో నన్నొక కామ పిశాచిలా చిత్రీకరిస్తూ సందేశాలు పెడుతున్నారు. 21 ఏండ్ల నా వృత్తి గౌరవాన్ని చిదిమేసి సోషల్‌ మీడియాలో నన్నొక బజారు ఆడదానిగా చిత్రీకరించటానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఇంటర్నెట్‌ దాడులకు ప్రత్యేక లక్షణం, లక్ష్యం ఉంటాయి. విలేకరిగా నా సుదీర్ఘ వృత్తిగత జీవితంలో నేనెన్నడూ ఎరుగనంత అధమస్థాయి అసభ్య, విద్వేష ప్రచారాన్ని చవిచూశాను. తెల్లవారుఝాముని అందరూ ఆస్వాదిస్తారు. కానీ, నేను మాత్రం వికారపు ఉదయాలను చూడాల్సి వచ్చింది. @లుటిన్‌సిన్‌సైడర్‌ పేరు పెట్టుకున్న ఖాతాదారు ఒక్కడే కాదు నామీద దాడులకు తెగబడింది. నిర్భయని బలాత్కారం చేసినట్లు నిన్నూ రేప్‌ చేస్తామని, ఏకే-47తో కాల్చివేస్తామని బెదిరింపులు వచ్చేవి. కశ్మీర్‌లో సైన్యం వాడుతున్న పెల్లెట్‌గన్‌ల కారణంగా శాశ్వత అంధులుగా మారుతున్న అమాయక పౌరుల గురించి కథనాలు రాసినందుకు నాపై ఇలా విరుచుకుపడ్డారు. ఆరు నెలలు ఓపికపట్టాను. ఇక నా వల్ల కాలేదు. పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను.

నేను పెట్టిన కేసుకు జాతీయంగా, అంతర్జాతీయంగా ఊహించనంతటి స్పందన వచ్చింది. ట్విట్టర్‌ సదరు ఖాతాను సస్పెండ్‌ చేసింది. అయినాగానీ ఆ నిందితుడిని ఈరోజు వరకూ పోలీసులు అరెస్టు చేయలేదు. కారణంగా.. అతడికి ప్రభుత్వ పెద్దల దన్ను ఉండటమే.

 

వీళ్లంతా ఇంటర్నెట్‌ గూండాలు
‘ఈ ఇంటర్నెట్‌ పోకిరీలు అసభ్యకరమైన చిత్రాలు, అభ్యంతరకరమైన నికృష్ట రాతలతో తెగబడుతుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే వీళ్లంతా ఇంటర్నెట్‌ గూండాలు. బీజేపీ మీదగానీ, మోదీ ప్రభుత్వం మీదగానీ, దేశభక్తికి సంబంధించిగానీ ఎవరన్నా సహేతుకమైన విమర్శ చేశారా ఇహ వారి ‘పని’ పట్టడమే ఈ ఇంటర్నెట్‌ గూండాల పని. ట్విట్టర్‌లో వీరంతా ఏ హిందూ దేవుడు/దేవత బొమ్మనో ముఖచిత్రంగా కలిగి ఉంటారు. లేదా, ఎక్కువమంది తమ ఖాతాను అనుసరించేలా ప్రేరేపించటానికి అందమైన యువతుల బొమ్మలు ముఖచిత్రాలుగా పెడుతుంటారు. ఈ గూండాలకు ఊరూ పేరూ ఉండవు. బీజేపీకి చెందిన అత్యున్నతస్థాయి వ్యక్తులు ఆఖరికి ప్రధాని నరేంద్రమోదీ కూడా వీరికి అనుచరులుగా (ఫాలోవర్లుగా) కొనసాగుతున్నారు.

***
ఇంటర్నెట్‌లో చెలామణి అవుతున్న ఈ విద్వేషభాష వాస్తవ ప్రపంచంలోకి కూడా దూసుకువచ్చేసింది. విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి, మాజీ సైన్యాధ్యక్షుడు వీకే సింగ్‌ తనను ప్రశ్నించిన జర్నలిస్టులను ‘సిక్యులర్‌ ప్రెస్టిట్యూట్‌’ (సెక్యూలర్‌ జర్నలిస్టులను వ్యభిచారులు అనే అర్థం వచ్చే విధంగా వాడిన పదం) అనే మాట వాడాడు. ఆ వెంటనే బీజేపీ మంత్రులు, ఇంటర్నెట్‌ పోకిరీలు దీనిని అందిపుచ్చుకున్నారు. బీజేపీ ఉపాధ్యక్షుడు దయాశంకర్‌సింగ్‌.. మాయావతిని ఉద్దేశించి ‘వ్యభిచారి కన్నా హీనం’ అన్న మాట ఉపయోగించాడు.

** *
2016లో హోలీ రోజున ఢిల్లీలో డాక్టర్‌ పంకజ్‌ నారంగ్‌ హత్యోదంతాన్ని తీసుకోండి. డాక్టర్‌ నారంగ్‌ను ముస్లింలు హత్య చేశారని, మీడియా ఈ వాస్తవాన్ని దాచి పెడుతున్నదని రాహుల్‌రాజ్‌ పేరుగల వ్యక్తి (ఇతడికి ట్విట్టర్‌లో 77,900 మంది ఫాలోయర్లున్నారు) ట్వీట్‌ చేశాడు.

ఈ ప్రచారం మూలంగా మత విద్వేషాలు తలెత్తేలోపే ఢిల్లీ పోలీసులు వెంటనే డాక్టర్‌ నారంగ్‌ హత్య గురించి జరుగుతున్నది అబద్ధపు ప్రచారమని స్పష్టంగా వివరణ ఇవ్వడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కానీ, ఈ విద్వేషప్రచారాన్ని ప్రారంభించిన వ్యక్తి మీద ఎలాంటి కేసు పోలీసులు పెట్టలేదు.

శోభా డే మీద దిగజారుడు వ్యాఖ్యలు
బీజేపీ నాయకుడు, కేంద్రమంత్రి గోపీనాథ్‌ ముండే హఠాన్మరణం గురించి 2014 జూన్‌ 3న ప్రముఖ రచయిత్రి శోభాడే సంతాపసూచకంగా ఇలా ట్వీట్‌ చేశారు.. ‘దిగ్భ్రాంతికరమైన వార్త- ముండే మరణవార్త ఎంతటి విషాదం. ఆయన ఆత్మకు శాంతి కలుగుగాక. కుటుంబానికి చెడ్డ రోజులు వచ్చాయి. నా ప్రగాఢ సంతాపం’ (గోపీనాథ్‌ ముండే మరణం వెనుక కుట్ర ఉందన్న ఊహాగానాలు అప్పట్లో చెలరేగాయి). దీంట్లో ఏమైనా అభ్యంతరకరమైనది ఉందా? కానీ, రాహుల్‌రాజ్‌ ఇలా స్పందించాడు. ‘హాయ్‌ శోభా ఢే. నీ బాధ నాకు అర్థమైంది. చాలా రోజులుగా పడక సుఖానికి దూరంగా ఉన్నట్లున్నావ్‌. మరీ అంతగా వెంపర్లాడకు’. ఇట్లాంటి అసభ్య రాతగాడి ట్విట్టర్‌ ఖాతాని మన ప్రధాని మోదీ కొన్నేళ్లుగా ఫాలో అవుతున్నారు.

ఇలాంటి వాళ్లని ఫాలో అవుతున్న ప్రధాని మోదీ
నరేంద్రమోదీ ట్విట్టర్‌ ఖాతాకు 21.6 లక్షల మంది ఫాలోయర్లున్నారు. ఆయన 1375 ఖాతాలకు ఫాలోయర్‌గా ఉన్నారు. సమాచారహక్కు చట్టాన్ని అనుసరించి సేకరించిన వివరాల ప్రకారం.. @నరేంద్రమోదీ, @ప్రైమ్‌మినిష్టర్స్‌ఆఫీస్‌ (పీఎంఓ) ఖాతాలను ఆయనే స్వయంగా నిర్వహిస్తుంటారు. అటువంటప్పుడు, ఇంటర్నెట్‌లో అత్యంత నికృష్ట పోకిరీలుగా చెలామణి అవుతున్న వారిని మోదీ ఎందుకు ఫాలో అవుతున్నట్లు? మోదీ ఫాలో అయ్యే 26 ట్విట్టర్‌ ఖాతాలు.. ఇతర రాజకీయపార్టీల నేతలు, పత్రికా విలేకరులు ప్రత్యేకించి మహిళలు, మైనార్టీలు, దళితుల మీద నిత్యం తిట్ల దండకాలు అందుకోవటం, లైంగికంగా అత్యంత అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయటం, హత్య చేస్తానని బెదిరించటం చేస్తూ ఉంటాయి. ఈ గూండాలు తమని తాము గర్వించే హిందువుగానో, దేశభక్తుడిగానో, నమోభక్తుడిగానో చెప్పుకుంటారు. వందేమాతరం, భారత్‌ మాతాకీ జై అన్న నినాదాలను జోడించుకుంటారు. ప్రధాని మోదీ తమ ఖాతాను అనుసరిస్తున్నారని గొప్పగా చెప్పుకోవటానికి మోదీ బొమ్మని తమ ఖాతాలకు ముఖచిత్రంగా వాడుతుంటారు. ‘మోదీ మహాశయా! ఇదేం అన్యాయం. ఇట్లాంటి పోకిరీల ఖాతాలను మీరెందుకు అనుసరిస్తున్నారు?’ అని ప్రశ్నిస్తే మోదీగారు మౌనవ్రతం పాటిస్తారు.

ఈ పుస్తకం అచ్చులో వచ్చే సమయానికి ఇలాంటి ఇంటర్నెట్‌ గూండాల మీద పోలీసు కేసులు నమోదైనా, వారి ట్విట్టర్‌ ఎకౌంట్లు ఒకసారి రద్దయినా కూడా వారి ఖాతాల నుంచి మోదీ దూరంగా జరగలేదు. అంతేకాదు, తాను అనుసరిస్తున్న 150 ట్విట్టర్‌ ఖాతాదారులందరినీ పోగేసి 2015 జూలై 1న ప్రధాని అధికారిక నివాసంలో ‘డిజిటల్‌ సంపర్క్‌’ పేరిట ఇష్టాగోష్టి సమావేశం నిర్వహించారు మోదీ.

సాఫ్ట్‌వేర్‌ కంపెనీలా పని విధానం
ఢిల్లీలోని అశోకారోడ్‌లో ఉన్న కేంద్ర బీజేపీ ఐటీ విభాగాన్ని చూస్తే ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీ మాదిరి అనిపిస్తుంది. దీనికి నేషనల్‌ డిజిటల్‌ ఆపరేషన్‌ సెంటర్‌ అని పేరు. అక్కడ గుంపులు గుంపులుగా టెక్కీలుగా పిలువబడే ఉద్యోగులు కనబడుతూ ఉంటారు. వీరంతా చిన్న చిన్న ఇంజినీరింగ్‌ కాలేజీలు డిగ్రీలు పూర్తి చేసుకొని వచ్చిన నవ యువతీ, యువకులు. ఎక్కువమంది అబ్బాయిలే.

ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు ఆఫీసుకు వచ్చి పని చేసినట్లే పని చేసుకుపోతారు. వీరిలో ఓ 30 మందికిపైగా యువతీ యువకులతో నేను మాట్లాడాను. తమ పేరు బయటికి రానీయకూడదనే షరతు మీద నాతో చాలా విషయాలు చెప్పారు. ఏ రోజుకి ఆ రోజున సోషల్‌ మీడియాలో హాష్‌ట్యాగ్‌ల ద్వారా ఏ అంశాన్ని ట్రెండ్‌ చేయాలో నిర్ణయిస్తారట. మో దీకి వ్యతిరేకంగా నోరు విప్పిన ప్రముఖులలో ఎవరో ఒకరినిగానీ, జర్నలిస్టులనుగానీ ఎంపిక చేసుకొని బూతుల దాడి మొదలుపెడతారట.

ఇంత నికృష్టమైన అబద్ధాలు, బూతులు ఎలా రాయగలరు అని అడిగితే.. ‘చూడండి! మాకు ఇది ఆకుకి సున్నం రాసినంత ఈజీ. మామూలు జనానికి మేం పథకం ప్రకారం దాడి చేస్తున్నాం అని తెలియదు. దాంతో దిగ్భ్రాంతికి గురవుతారు. మీలాంటి జర్నలిస్టులకు ఒక అంచనా ఉంటుంది కాబట్టి వెంటనే బ్లాక్‌ చేస్తారు. అది కూడా మాకు పైచేయి కిందే లెక్క.

థాయ్‌లాండ్‌ కనెక్షన్‌
ఆమ్‌ఆద్మీపార్టీ సోషల్‌మీడియా అధిపతి అంకిత్‌లాల్‌ బీజేపీ సోషల్‌మీడియా విభాగానికి నకలు తయారుచేసి ఆ విభాగం పనితీరును గుర్తించారు. ఇంటర్నెట్‌ ఎనలిటికల్‌ టూల్స్‌ ఉపయోగించి ఒక పరిశోధన ప్రతిని నాకు అందించారు. ఇది కరెక్టేనని ఇంగ్లండ్‌కు చెందిన ఇండిపెండెంట్‌ టెక్నికల్‌ ఎక్స్‌పర్ట్‌ సిద్ధార్థ భాస్కర్‌ తేల్చిచెప్పారు.

అంకిత్‌లాల్‌ అధ్యయనం ప్రకారం.. థాయ్‌లాండ్‌లో ఉన్న ట్విట్టర్‌ ఖాతాలు రోజువారీగా మోదీ హాష్‌ట్యాగ్‌తో ఉన్న బీజేపీ సందేశాలను పోస్ట్‌ చేస్తున్నాయి. ఈ థాయ్‌లాండ్‌ హాష్‌ట్యాగ్‌లను మోదీ, స్మృతి ఇరానీ, రాజ్‌నాథ్‌సింగ్‌ కూడా వాడారు. దీనివెనుక 2 మతలబులున్నాయి.

1. బీజేపీ సోషల్‌ మీడియా కేంద్రాలు ఏ ప్రాంతం నుంచి పని చేస్తున్నాయి, ఎవరై ఉంటారు అన్న విషయాలు తెలియకుండా ఉండటానికి వర్చువల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌లను వాడుతుంటారు. వీటిద్వారా ఢిల్లీలో ఉన్న వ్యక్తులు ఎక్కడో లండన్‌లో ఉన్న వినియోగదారులకు మాత్రమే లభ్యమయ్యే సమాచారాన్ని రహస్యంగా చేజిక్కించుకోవచ్చు. అలాగే ఈ నెట్‌వర్క్‌ల సాయంతో దొంగ ట్విట్టర్‌ ఖాతాల ద్వారా రాజకీయ ప్రత్యర్థుల మీద దాడి చేయవచ్చు. ఒకే సమాచారాన్ని వందల ఖాతాల నుంచి వ్యాప్తి చేయవచ్చు.
2. పై కారణం కాదు అనుకుంటే.. థాయ్‌లాండ్‌లో ఉన్న ఏ మార్కెటింగ్‌ ఏజెన్సీ ద్వారానో బీజేపీ ఇంటర్నెట్‌ ప్రచారానికి పూనుకోవచ్చు. అరవింద్‌ కేజ్రీవాల్‌ మీద కేజ్రీవాల్‌ఫండ్స్‌, ఉడ్తాపంజాబ్‌ వంటి హాష్‌ట్యాగ్‌ల ద్వారా దాడి జరిగినప్పుడు.. హీట్‌మ్యాప్స్‌ ద్వారా ఆ దాడి ఆచూకీ గుర్తించి వివరాలు తెలుసుకోగలిగారు అంకిత్‌లాల్‌.

రాంమాధవ్‌ నేతృత్వం
సోషల్‌మీడియాను ఎలా వాడుకోవాలో బీజేపీకి అసలైన శిక్షణను ఇచ్చింది తమిళనాడుకు చెందిన ఆర్‌ఎస్‌ఎస్‌ స్వయంసేవకులు. వీరికి నాయకత్వం వహించింది ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌ పట్టా పొంది ఆ తర్వాత పూర్తిస్థాయి ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా మారిన వ్యక్తి రాం మాధవ్‌. మొదట్లో ఈ టెక్నాలజీని అందిపుచ్చుకోవటానికి ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖలు మొండికేశాయి. కానీ, దీంతో ఎన్నో ప్రయోజనాలున్నాయని ఆయన నచ్చచెప్పారు. బీజేపీ సోషల్‌ మీడియా కార్యకలాపాలన్నీ ఇప్పుడు బెంగళూరు నుంచి కొనసాగుతున్నాయి. 1947లో, 1948లో (మహాత్మాగాంధీ హత్య కారణంగా..), 1975లో, 1977లో, 1992లో ఆర్‌ఎస్‌ఎస్‌ నిషేధానికి గురైంది. అభద్రత, చట్టపరమైన శిక్షలకు భయపడిన కారణంగా ఆర్‌ఎస్‌ఎస్‌ తన సంస్థాగత నిర్మాణాన్ని రహస్యంగా శాఖల ప్రాతిపదికన ఏర్పర్చుకుంది. కాబట్టి, సోషల్‌మీడియాలో కూడా ఇదే పనివిధానాన్ని బాగా ఆరితేరినతనంతో అమలు చేస్తున్నది.

పుకార్లే పనివిధానం
టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌, హిందుస్థాన్‌ టైమ్స్‌ వంటి పత్రికలలో 40 ఏండ్లపాటు పని చేసిన ప్రముఖ పత్రికా సంపాదకుడు, మాజీ ఎంపీ హెచ్‌ కే దువా ఇలా చెప్పారు.. ‘ఆర్‌ఎస్‌ఎస్‌ ఎలాంటి పరిస్థితులకైనా ఇట్టే అలవాటు పడిపోతుంది. పుకార్ల ప్రచారమే దానికి పెట్టనికోట. అందులో వారు ప్రావీణ్యం సాధించేవారు. ప్రచార మాధ్యమంలో మార్పు ఉండొచ్చేమోగానీ పుకార్ల ప్రచారాన్ని మాత్రం ఆర్‌ఎస్‌ఎస్‌ మానలేదు’

 

 

మహిళలే టార్గెట్‌

వీరంతా జర్నలిజంను వృత్తిగా ఎంచుకున్న ఆధునిక మహిళలు. తమ రంగంలో ఉన్నత స్థానాలకు ఎదిగి ప్రశంసలు పొందుతున్నవారు. టీవీలలో వీరిని చూసి స్ఫూర్తి పొందిన బాలికలు దేశంలో ఎందరో ఉన్నారు. వీరిలో సిద్ధాంతరీత్యా బీజేపీని వ్యతిరేక అభిప్రాయాలు వ్యక్తం చేసినవారు, కేంద్ర మంత్రి కుమారుడి కుంభకోణాన్ని బయట పెట్టిన వారూ ఉన్నారు. ఇంకేం… బీజేపీ పెద్దల ఆగ్రహానికి గురయ్యారు. వెంటాడి వేధించడం కాదు, వీరిని మానసిక క్షోభకు గురి చేసేందుకు బీజేపీ మూక కొత్త పద్ధతి ఎంచుకుంది. విదేశాలలో ఉద్యోగమో, కార్యక్రమమో అంటూ నమ్మించి మోసం చేస్తున్నది. ఈ కుట్రలకు మోసపోయిన కొందరు మహిళల వివరాలు…

నిధి రజ్దాన్‌

నిధి రజ్దాన్‌ ప్రముఖ టీవీ న్యూస్‌ యాంకర్‌. తన కెరీర్‌లో ఉచ్ఛ స్థితికి చేరుకున్నారు. హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఆమెకు అధ్యాపకురాలిగా ఉద్యోగం లభించినట్టు సమాచారం అందడంతో ఎగిరి గంతేశారు. ఈ విషయాన్ని గర్వంగా అందరికీ చెప్పుకున్నారు. ఉన్న ఉద్యోగాన్ని మానేసి పోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంకా అమెరికాకు వెళ్ళడానికి ముందే తనకు చేరుతున్న సమాచారమంతా బోగస్‌ అని తేలింది.

రోహిణీ సింగ్‌

ఒక కేంద్ర మంత్రి కుమారుడి కుంభకోణాన్ని 2017 బయట పెట్టడం రోహిణీ సింగ్‌ ఘనత. అయితే ఇందుకు ఆమె వేధింపులకు గురి కావాల్సి వచ్చింది. 2019 ఆగస్టులో ఆమెకు ట్విటర్‌ ద్వారా తౌసీఫ్‌ అహ్మద్‌ అనే వ్యక్తి నుంచి మెసేజ్‌ వచ్చింది. తమది కూడా లక్నో అని పరిచయం చేసుకుని మాట కలిపాడు. ప్రస్తుతం హార్వర్డ్‌ కెనెడీ స్కూల్‌లో మాస్టర్స్‌ చేస్తున్నానని చెప్పుకున్నాడు. తాము ఉన్నత స్థాయి మీడియా కాన్ఫరెన్స్‌ జరుపుతున్నామని అతిథిగా రావాలని ఆహ్వానించాడు. ఖర్చలన్నీ హార్వర్డ్‌ పెట్టుకుంటుందని తెలిపాడు. ఇదొక గొప్ప అవకాశమని ఆమెకు ఆనందం వేసింది. తౌసీఫ్‌ ఆమెను పాస్‌పోర్ట్‌ ఇతర వివరాలు అడిగాడు. ఆ తరువాత అలెక్స్‌ హర్ష్‌మన్‌ అనే వ్యక్తి తన సహ విద్యార్థి అంటూ పరిచయం చేశాడు. అయితే తనకు అందిన ఆహ్వానం అలెక్స్‌ హర్ష్‌మన్‌ జిమెయిల్‌ నుంచి ఉందే తప్ప హార్వర్డ్‌ అధికారిక ఇమెయిల్‌ కాదు. దీంతో ఆమెకు అనుమానం వచ్చింది. వీరి ఇరువురి ఫోన్‌ నంబర్లు అమెరికావి కాదు. దీంతో ఇదంతా మోసమని ఆమె పసిగట్టారు.

జైనబ్‌ సికిందర్‌

ప్రముఖ పాత్రికేయురాలైన జైనబ్‌ సికిందర్‌ అల్ప సంఖ్యాకవర్గాలపై సాగుతున్న వివక్షపై వార్తలు రాస్తుంటారు. మోదీ పాలనపై విమర్శలు చేశారు. ఈమెకు కూడా 2019లో తౌసీఫ్‌ అహ్మద్‌ పేర ఒక ట్విట్టర్‌ మెసేజ్‌ వచ్చింది. హార్వర్డ్‌లో హై పవర్డ్‌ మీడియా కాన్ఫరెన్స్‌ ఉంది రావాలంటూ ఆహ్వానం అందింది. హార్వర్డ్‌ పేర మహిళలకు మోసాలు సాగుతున్న విషయం తెలువనందు వల్ల నిజమే అనుకున్నారామె. బోస్టన్‌లో ఉంటున్నానని చెప్పుకుంటున్న తౌసీఫ్‌ ఫోన్‌ నెంబర్‌ దుబాయికి చెందినది. అయినా తనకు ఆహ్వానం అందిన ఆనందంలో ఆమె పట్టించుకోలేదు. తౌసీఫ్‌ ఆ తరువాత అలెక్స్‌ను పరిచయం చేశారు. పర్యటన ఏర్పాట్లు చెబుతూ ఆమెకు హోటల్‌ గదిని కూడా బుక్‌ చేశామని, అది బాగా ఉందని వారు చెప్పారు. అయితే తనకు ఆహ్వానం హార్వర్డ్‌ నుంచి అధికారికంగా కావాలని ఆమె అడగడంతో వారు చాటింగ్‌ మానేసారు.

మరో పాత్రికేయురాలు

మరో పాత్రికేయురాలు కూడా 2019లో తాను మోసపోయినట్టు టైమ్స్‌కు వెల్లడించారు. కానీ ఆమె వ్యక్తిగత కారణాల వల్ల తన పేరు బయట పెట్టడానికి ఇష్టపడటం లేదు. తనతో అమెరికా నుంచి మాట్లాడుతున్నామని చెప్పుకుంటున్న వారి ఫోన్‌ నంబర్‌ యూఏఈ కి చెందినది కావడంతో ఆమె అప్రమత్తమయ్యారు. ఆమె వారితో మాట్లాడటం మానేసినా, వారు వదిలిపెట్టలేదు. వారు అప్పటికే హార్వర్డ్‌ ఉద్యోగుల సంతకాలు కాపీ చేశారు. విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ నుంచి అధికారిక లెటర్‌హెడ్‌ను కాపీ చేశారు. కానీ ఈ పాత్రికేయురాలు మోసాన్ని గ్రహించారు. ఈలోగా వారు మరో ట్విటర్‌ ఖాతాతో సీమా సింగ్‌ అనే మహిళను రంగంలోకి దింపారు. నీవు అందంగా ఉన్నావు, ఇద్దరం కలిసి స్నానం చేద్దామంటూ అసభ్య మెసేజ్‌లను ఆమె పంపింది. తాను బైసెక్సువల్‌నని ఫ్రాంక్‌ఫర్ట్‌లోని ఫలానా బ్యాంక్‌ ఉద్యోగిననీ తెలిపింది. కానీ విచారణ జరిపితే ఆ బ్యాంకులో ఈ పేరు గల ఉద్యోగులు ఎవరూ లేరని వెల్లడైంది.

 

సాధవి ఖోస్లా.. నిలువెత్తు విరక్తి

బీజేపీ సోషల్‌ మీడియా సెల్‌ సాగిస్తున్న వికృత, విద్వేష ప్రచారాన్ని అర్థం చేసుకోవాలంటే, అందులో పనిచేసిన సాధవి ఖోస్లా అనుభవం తెలుసుకోవాలి. పంజాబ్‌ విశ్వవిద్యాలయంలో మేనేజ్‌మెంట్‌ కోర్సు చదివిన సాధవి ఆరేండ్లు అమెరికాలో ఉన్న తరువాత భారత్‌కు తిరిగి వచ్చారు. ఢిల్లీలో సొంత కంపెనీ నడుపుకొంటున్నారు. అమెరికాలో ఉన్న సంబంధాల దృష్ట్యా ఆమెకు భారీ వ్యాపారం సాగేది.

ఖోస్లా సోషల్‌ మీడియా నడుపుతున్న తీరును ప్రశంసిస్తూ 2013లో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ నుంచి ఫోన్‌ రావడంతో ఆమె సంతోషానికి హద్దులు లేవు. ఆమె అమెరికాలో ఉన్నప్పుడు భారీగా బీజేపీకి చెందిన మెసేజ్‌లు వచ్చేవి. రాజీవ్‌ గాంధీకి వ్యతిరేకంగా కుట్ర చేసింది సోనియానేనని, ప్రియాంకకు మతిభ్రమించిందనీ, రాహుల్‌ హిందువేతర యువతిని వివాహమాడి తన పిల్లలను రహస్యంగా దాచి పెట్టాడని ఇలా అడ్డమైన అబద్ధాలను అల్లి పంపించేవారు. మోదీ దేశాన్ని ఉద్ధరించే నాయకుడంటూ అందులో ఉండేది. వాటితో ప్రభావితురాలైన సాధవి బీజేపీ సోషల్‌ మీడియా సెల్‌లో అవకాశం రావడంతో వెంటనే అందులో దూకేశారు. అదొక భారీ యంత్రాంగం మోదీ, అమిత్‌ షాలతో సన్నిహితంగా ఉండే అరవింద్‌ గుప్తా ఈ సోషల్‌ మీడియా సెల్‌కు ఇంచార్జి. ఆయన ఏమి చెప్తే అదే చేయాలి. ఖోస్లా తన మార్కెటింగ్‌ నైపుణ్యాన్నంతా ఉపయోగించి బీజేపీకి ప్రచారం చేసేవారు. రాత్రివేళ భోజనం కూడా చేసేవారు కాదు. అమెరికాలో సొంత బిజినెస్‌ దెబ్బతిన్నది. అయినా దేశానికి సేవ చేస్తున్న అనే భ్రమలో ఉండేది.

బీజేపీ ఎన్నికలలో గెలిచిన తరువాత అచ్చేదిన్‌ వస్తాయని భావించారామె. కానీ బీజేపీ గెలిచిన తరువాత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టక పోగా విద్వేష ప్రచారం పెరిగి పోయింది. పంజాబ్‌లో డ్రగ్స్‌ మొదలైన సమస్యలను ప్రధాని దృష్టికి పంపించినా స్పందన లేకపోవడం ఆమెను నిరాశపరిచింది. మహిళలను అగౌరవ పరిచే బూతులు పంపించాల్సి వచ్చేది. మహిళలకు వారిపై అత్యాచారం చేస్తామనే బెదిరింపులు పంపడానికి ఖోస్లాకు మనసొప్పలేదు. మహిళా జర్నలిస్టు బర్ఖాదత్‌ను అసభ్య రాతలతో ట్రోల్‌ చేయడం నచ్చలేదు. సినీ హీరోలు అమీర్‌ ఖాన్‌, షారూఖ్‌ ఖాన్‌లపై విద్వేష ప్రచారం చేయడం కూడా ఆమెకు ఇష్టం లేదు. కానీ అక్కడ పై వారు ఏది చెప్పినా చేయాల్సిందే.

సాధవి ఖోస్లా ఇంటిలో మూడు తరాల వారు కాంగ్రెస్‌ నాయకులు. తాను చేస్తున్న పని పెద్ద తప్పుగా వారికి తోచేది. తల్లి ఒకసారి ‘ఏమైంది బిడ్డా అచ్చేదిన్‌’ అని అడిగింది. సాధవీ! అమెరికాలో మన బాబును చిన్నప్పుడు చూసుకున్న ఆయా పాకిస్థానీ ముస్లిం అనేది గుర్తున్నదా అని భర్త అడిగినప్పుడు తానెంత మత దురభిమానిగా మారిపోయిందో అర్థమైంది. దీంతో బీజేపీ సోషల్‌ మీడియా సెల్‌ నుంచి బయట పడ్డారామె. స్వాతి చతుర్వేది ఆ రోజుల గురించి అడిగినప్పుడు బోరున ఏడ్చారు.

 

(ఐయామ్‌ ఎ ట్రోల్‌ పుస్తకానికి తెలుగు అనువాదం.
‘నేనొక అంతర్జాల పోకిరిని’- ప్రజాశక్తి ప్రచురణ నుంచి కొన్ని భాగాలు)

Saturday, 12 February 2022

JVV AP Social Media Workshop -2022

 🌐🔮🌏JVV AP Social Media Workshop -2022 February 12,13 @Vijayawada JVV Office (Tentative Schedule)


💠🔷🔶12.02.2022


🔵Inaguration: 10.00 am - 10.30 am

🔵Facebook, Whatsapp 10.30 am - 12.30 pm 

Resource Person : G.Mahesh, S.Rajasekhar


🔵Image Editing(Pixellab) : 12.30 pm - 1.30 pm

Resource Persons : K.Varaprasad, P.Nagendra

🔵Lunch Break :1.30 pm - 2.30pm

🌏 Image Editing 2.30pm to 3.30pm

🌏Tea break 3.30 to4.00pm

🌏 Interactive Session:

Science and Psuedo Science by M.V.S. sarma 4.00 to 5.pm


🔵Instagram : 5.00 pm - 6.00 pm

Resource Person: Guru lal

🔵Telegram, Twitter, Youtube: 6.00 pm - 8.00 pm

Resource Person: K.Srinivas

Dinner: 8.00 pm


💠🔷🔶13.02.2022

🔵OBS Software Training : 9.00 am - 10.30 am

Resource Person: Pavan SMS

🔵Video Editing (You Cut, Kinemaster) : 10.30 am - 1.30 pm

Resource Persons: Sobhan, Durga Prasad

🔵Lunch: 1.30 pm -2.30 pm

2.30 - 3.30

🔵Live Streaming: 3.30 pm - 4.30 pm

Resource Person: K.Srinivas, Ch.Sobhan, G.Mahesh

🔵Feedback & Future Planning: 4.30 pm - 6.00 pm