Tuesday, 22 March 2022

జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కొనకనమిట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఘనంగా జల దినోత్సవ వేడుకలు

*జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కొనకనమిట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఘనంగా జల దినోత్సవ వేడుకలు*

*ప్రతి పౌరుడు నీటి పొదుపును పాటించి రాబోయే తరాల వారి భవిష్యత్తును కాపాడాలని జన విజ్ఞాన వేదిక ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షులు దాసరి గురుస్వామి తెలిపారు*.

*నేడు మండల కేంద్రమైన కొనకనమిట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ప్రధానోపాధ్యాయులు ఎస్ రామాంజనేయులు అధ్యక్షతన ప్రపంచ జల దినోత్సవం ఘనంగా నిర్వహించడమైనది*. *ముందుగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు బహూకరించడం అయినది*.
*ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో దాసరి గురుస్వామి మాట్లాడుతూ మానవ మనుగడకు నీరు ముఖ్య ఆధారమని, నీరు లేనిదే మానవ మనుగడ సాధ్యం కాదని భూమిపై ఉన్న జీవరాశుల మనుగడ కూడా కష్టమని, భూమిపై ఉన్న ఒక్క శాతం మంచి నీటిని పొదుపుగా ఉపయోగించుకోవాలని సూచించారు. అదేవిధంగా నీటి ప్రాముఖ్యతను అవగాహన కల్పించుటకు ప్రతి సంవత్సరం మార్చి 22వ తేదీన ప్రపంచ జల దినోత్సవం ను అంతర్జాతీయంగా పాటించాలని ఐక్యరాజ్యసమితి మహాసభ 1992లో నిర్దేశించింది. దాని ప్రకారం 1993 నుండి జల దినోత్సవం అమలవుతుందని దాసరి గురుస్వామి తెలిపారు*.

*తదుపరి ప్రధానోపాధ్యాయులు ఎస్ రామాంజనేయులు మాట్లాడుతూ నీటి పొదుపు పై ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించాలని, శీతల పానీయాల కంపెనీలను నిరోధించాలని వీటివలన భూగర్భ జలాలు అంతరించిపోతున్నాయని అన్నారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని ప్రతి ఒక్కరూ ఒక మొక్కను పెంచాలని అడవులను అభివృద్ధి చేసుకోవాలని దీనివలన వర్షము విస్తృతంగా పడి భూగర్భ జలాలు పెరుగుతాయని రామాంజనేయులు సూచించారు*.

*అనంతరం పాఠశాల భౌతికశాస్త్ర ఉపాధ్యాయులు యం వి శ్రీనివాసరావు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులతో నీటి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు టి రామారావు, జట్ల రవికుమార్, బాదం రవికుమార్, యుద్ధం శ్రీనివాసులు షేక్ నాయబ్ రసూల్ పాల్గొన్నారు*.

Sunday, 13 March 2022

పర్యావరణాన్ని పరిరక్షిద్దాం :: శ్రీ విద్య కోచింగ్ సెంటర్ నందు నిర్వహించిన మార్కాపురం పట్టణ జనవిజ్ఞాన వేదిక నాయకులు

పర్యావరణాన్ని పరిరక్షిద్దాం   కార్యక్రమాన్ని స్థానిక శ్రీ విద్య కోచింగ్ సెంటర్ నందు మార్కాపురం పట్టణ జనవిజ్ఞాన వేదిక నాయకులు నిర్వహించడం జరిగింది. JVV నాయకులకు అభినందనలు.

Tuesday, 8 March 2022

దాచూరి రామిరెడ్డి విజ్ఞాన కేంద్రం విజయవంతం :: 1200 మంది రోగులకు ఉచిత OP, ఉచిత కన్సల్ టేషన్ మరియు 400 రూపాయలకే 4 నెలల మందులు

విజయవంతంగా ముగిసిన దాచురి రామిరెడ్డి విజ్ఞాన కేంద్రం వారి రెగ్యులర్ మెడికల్ క్యాంపు
సుధీర్ఘ విరామం తరువాత తిరిగి ఈరోజు 7/11/2021 ఆదివారం మెడికల్ క్యాంపు ప్రారంభం అయింది.
వైద్యం ఖరీదు అయిన ప్రస్తుత పరిస్థితుల్లో     బీపీ, షుగర్, పక్షవాతం రోగులకు 4 సంవత్సరాలుగా దాచురి రామిరెడ్డి విజ్ఞాన కేంద్రం పేరుతో మెడికల్ క్యాంపు నిర్వహిస్తూ 4.నెలలకు 400.రూపాయలకే మందులు అందిస్తున్న సంగతి తెలిసిందే..
కరోనా కారణంగా రోగులు ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశంతో క్రమం తప్పకుండా మందులు అందిస్తున్నారు..
దాచురి రామిరెడ్డి విజ్ఞాన కేంద్రం మెడికల్ కన్వీనర్ మాదాల వెంకట్రావు,
  డాక్టర్ గోపాలం శివన్నారాయణ మరియు ప్రముఖ డాక్టర్లు సహకారంతో కార్యక్రమం జరుగుతుంది..
 అంకితభావంతో పనిచేస్తున్న కార్యకర్తలు,నిర్వాహకులు కృషి కారణంగా ఈరోజు జరిగిన క్యాంపు కు 1200 మంది పేసేంట్లు హాజరు ఐనారు.
ఈరోజు జరిగిన మెడికల్ క్యాంపు నందు
డా, చాపల వంశీకృష్ణ, డా, బి.శరత్,
డా, కె.శివప్రసాద్ రాజు, డా, యం.కృష్ణారెడ్డి, డా, యం.రవితేజ, డా, జాన్ రిచర్డ్స్, బి.హరిబాబు మరియు ఆర్.యం.పి.వైద్యులు వైద్య సేవలు అందించారు, వారందరికీ మరియు క్యాంపు నందు పని చేసిన  కార్యకర్తలందరికి విజ్ఞాన కేంద్రం కన్వీనర్ మాదాల వెంకట్రావు ధన్యవాదాలు తెలియచేసారు..