Sunday, 13 November 2016

నవంబర్ 14 "ప్రపంచ మధుమేహ వ్యాధి దినోత్సవం" సందర్భంగా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు

నవంబర్  14  "ప్రపంచ మధుమేహ  వ్యాధి  దినోత్సవం"సందర్భంగా జన విజ్ఞాన వేదిక  ఆధ్వర్యంలో  ప్రజలకు  రాష్ట్ర వ్యాప్తంగా ఈవ్యాధి పై కరపత్రాలు , సభలు , సదస్సులు , సమావేశాలు జరపడం ద్వారా  అవగాహన కల్పించాలని నిర్ణయించడం జరిగింది . ఎందు కంటే   మధుమేధ వ్యాధి ( షుగర్ జబ్బు )  ప్రపంచ ప్రజల్ని  శారీరక , మానశిక , ఆర్ధికంగా  దెబ్బ తీస్తుంది .  వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉంటే వ్యాధి రాకుండా , వచ్చిన  ఆరోగ్య సమస్యలు నివారించుకోవచ్చు .

Monday, 7 November 2016

Medical Camp by DACHURI RAMIREDDY VIGNANA KENDRAM @ DRRM HIGH SCHOOL, ONGOLE



yester day there was a mega medical camp to treat B.P, Sugar, Peralisis Patients under very less cost which is under 300 Rs per patient by  DACHURI RAMIREDDY VIGNANA KENDRAM @ DRRM HIGH SCHOOL, ONGOLE. This medical camp will be conducted by the trust on every second Sunday for every two months. The camp will function up to 2.30 PM. The next camp will be on 1.1.17 at the same venue.

Tuesday, 11 October 2016

*దేశంలో సగానికి పైగా పేక్ డాక్టర్లే !!

*లక్షలకు లక్షలు డబ్బులు చెల్లించి జబ్బులు నయం అవడానికి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్న రోగులకు ఇదో పెద్ద షాక్.* ఎందుకంటే.. రోగుల కంటే ముందు వైద్య వ్యవస్థకే ట్రీట్ మెంట్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో డాక్టరంటే భరోసా కు కేరాఫ్ అనుకునే సామాన్యుల నమ్మకం కాస్త అనుమానానికి కేరాఫ్ గా మారిపోతుంది.

*అవును.. ప్రపంచ ఆరోగ్య సంస్థ* (who-world health organisation)చెబుతోన్న వివరాలను పరిశీలిస్తే.. అసలు మనకు ట్రీట్ మెంట్ చేస్తున్నది నిజమైన వైద్యుడేనా..? అన్న సందేహం తలెత్తకమానదు. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన నివేదికలో దేశ మెడికల్ వ్యవస్థకు సంబంధించి నివ్వెరపోయే విషయాలు బయటపడ్డాయి.

*సంస్థ చెబుతున్న వివరాల ప్రకారం.. దేశంలో సగం మంది డాక్టర్లు సర్టిఫికెట్ లేకుండానే ట్రీట్ మెంట్లు చేసేస్తున్నారు.*
నివేదిక ప్రకారం.. దేశంలో ఉన్న వైద్యుల్లో 77.2 శాతం మంది అలోపతి వైద్యులు కాగా, 22.8 శాతం మంది హోమియో ఆయుర్వేద యునానీ వైద్యులు.

*అయితే ఆందోళన కలిగిస్తోన్న విషయమేంటంటే.. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం అలోపతి డాక్టర్లలో 57.3 శాతం మంది వైద్యులు మెడికల్ డిగ్రీలే లేకుండా వైద్యం చేసేస్తున్నారట*.
ఇక 31.4 శాతం మంది వైద్యులు సెకండరీ స్కూల్ విద్యతోనే చదువుకు ఫుల్ స్టాప్ పెట్టి డాక్టర్ల అవతారం ఎత్తారట.

*ఇక నర్సుల విషయానికొస్తే..* దేశంలోని 73 జిల్లాల్లో సరైన అర్హతలున్న నర్సులు ఒక్కరు కూడా లేరట. దేశంలో నర్సులుగా చలామణి అవుతోన్న వాళ్లలో 67.1 శాతం మంది విద్యార్హత కేవలం సెకండరీ విద్య మాత్రమే అని తేల్చింది.

*ఈ పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.* దేశంలో అత్యవసరంగా వైద్య సంస్కరణలు చేపట్టాలని హెచ్చరించింది. 2011జనాభాల లెక్కల ప్రకారం దేశ జనాభా 122 కోట్లు అయితే, వైద్య వృత్తిలో ఉన్నవారు కేవలం 25 లక్షలు మాత్రమేనని పేర్కొంది. ఇందులో 39.6 శాతం మంది వైద్యులని, 30.5 శాతం మంది మిడ్ వైఫ్ లని, కేవలం 1.2 శాతం మంది మాత్రమే డెంటిస్టులని తెలిపింది.

*అయితే అర్హతల విషయంలో పురుష వైద్యుల కంటే మహిళా వైద్యులే సరైన అర్హతలు కలిగి ఉన్నట్లుగా*నివేదికలో వెల్లడయింది. దేశంలో కేవలం 37.7 శాతం మంది పురుషులకే సరైన విద్యార్హతలుండగా, మహిళల్లో 67.2 శాతం మంది తగిన అర్హతలు కలిగి ఉన్నట్లుగా పేర్కొంది.

*ఇక ఈశాన్య రాష్ట్రాలతో సహా యూపీ, బిహార్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో వైద్యులు సంఖ్య తక్కువగా ఉన్నట్లు నివేదికలో స్పష్టమైంది.*

D Bhaskar Reddy

Monday, 10 October 2016

మతాలలోని మూఢ నమ్మకాలకు ఒక నిండు ప్రాణం బలయిపోయింది

మనం ఒక్కపొద్దు, రోజంతా ఉపవాసం, జాగారాం, అన్నపానీయాలు మాని ఉపవాస వ్రతం వంటివి వింటూ ఉంటాం. కానీ హైదరాబాదులో జైన మతానికి చెందిన ఓ కుటుంబం 13 ఏళ్ల బాలికతో చేయించిన ఉపవాసం ఆమె ప్రాణాన్ని కబళించింది. నీ ఉపవాసం ఇంటికి మంచిదంటూ 68 రోజుల పాటు 13 ఏళ్ల జైన బాలికతో చేయించిన ఉపవాసం వికటించింది. 
 

ఒక్కో మతానికి ఒక్కో సంప్రదాయం ఉంటుందన్నది మనకు తెలిసిందే. ఈ క్రమంలో జైన మ‌త సంప్ర‌దాయం ప్ర‌కారం ఆరాధ‌న అనే బాలిక 68 రోజులు పాటు తన కుటుంబానికి మంచి జరగాలని ఉపవాస వ్రతం చేసింది. ఈ ఉపవాసం చేస్తుండగానే ఆమె తీవ్రమైన అస్వస్థతకు లోనైంది. ఉపవాసం చేస్తున్న సమయంలో కనీసం పచ్చి మంచినీళ్లు కూడా తాగలేదు. దీనితో ఆమె ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని కొన్ని అవయవాలు పనిచేయడం మానేశాయని సమాచారం. ఆసుపత్రికి తీసుకెళ్లినా ఆమెను వైద్యులు కాపాడలేకపోయారు.

Saturday, 8 October 2016

A WELCOME POST BY JANAVIGNANA VEDIKA SOCIAL MEDIA GROUP OF PRAKASAM DISTRICT

Dear all,

Jana Vignana Vedika is now started to spread scientific attitude to the people through social media.

On behalf of this context i have started this blog to wide spread the information, activities and views of JANAVIGNANA VEDIKA to inculcate new scientific temper among people and to eradicate superstiotions.