Tuesday, 28 December 2021

సూక్ష్మజీవుల పరిశోధనల దిట్ట "లూయీ పాశ్చర్‌" జయంతి Dec 27



#నిజజీవిత సమస్యల సుడిగుండాలలో చిక్కుకున్నప్పుడు మానవ మేధస్సులో ఆ సమస్యలకు తగిన పరిష్కారం కనుగొనేందుకు వీలైన ఆలోచనలు, ఆవిష్కరణలు ఉద్భవిస్తుంటాయి. ఆ ఆవిష్కరణలు కొంతమంది మహామహుల విశేష కృషి వల్ల వెలుగులోకి వచ్చి అదే సమస్యలతో బాధపడుతున్న ఎంతోమంది జీవితాలలో ఆ గ్రహణం వీడి వెలుగులు నింపడానికి దోహదపడుతుంది. అటువంటి సమస్యల పరిష్కారానికి సరికొత్త నిర్దేశాలను నిర్వచించడానికి తమ జీవితాన్ని అంకితం చేశిన 'ఆదర్శమూర్తి, ఆంత్రాక్స్, రబీస్ తదితర వ్యాధులకు మందులను కనిపెట్టడంలో మూలపురుషుడై అవిరళ కృషి సల్పిన సూక్ష్మజీవ శాస్త్రవేత్త లూయీ పాశ్చర్.
వ్యాధులకు కారణం సూక్ష్మక్రిములని కనుగొని రోగ నివారణకు పాశ్చర్ బాటలు వేశారు. టీకాల ఆవిష్కారానికి ఇతడు ఆద్యుడు. మొదటిసారిగా రేబీస్ వ్యాధి కోసం టీకాను తయారుచేశాడు.

చాలా మందికి ఇతడు పాలు ద్వారా వ్యాపించే వ్యాధులను అరికట్టే పద్ధతిని ప్రవేశపెట్టిన వ్యక్తిగా సుపరిచితులు. ఈ పద్ధతిని నేడు #పాశ్చరైజేషన్ అంటారు.
ఫ్రాన్స్‌ రాజు మూడవ నెపోలియన్‌ కోరికపై ద్రాక్షసారాయి చెడి పోవడానికి కారణాలు, నివారణ చర్యలు కని పట్టారు.కేవలం 55 సెంటీగ్రేడు ఉష్ణం వరకు పదార్థాలను వేడిచేసి, వెంటనే చల్లారిస్తే మధ్యం చెడిపోదని ప్రయోగ పూర్వకంగా కని పెట్టరు. దీనినే పాశ్చరైజోషన్‌ అంటారు.

1822, డిసెంబర్ 27న ఫ్రాన్స్ దేశంలోని డోల్ ప్రాంతంలో జన్మించిన లూయీ పాశ్చర్ తన చిన్నతనంలో డ్రాయింగ్ మరియు పెయింటింగ్ మీద ఎక్కువ ఆసక్తి కనపరిచేవారు. కానీ శాస్త్రీయ సంబంధిత అంశాల గురించి, వాటి విశ్లేషణల గురించిన సందేహాలను నివృతి చేసుకునేందుకు ఎంతో కుతూహలం చూపేవారు. అసలు అందరూ తాగే వైన్ ద్రాక్ష పళ్ళనుండి ఎట్లా తయారుచేస్తారు? పాలు తోడుకొని పెరుగు ఎట్లవుతుంది? ఇటువంటి ఆలోచనలు తనను ఎప్పుడూ వేధిస్తూనే ఉండేవి. స్వతహాగా గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ విద్యార్ధి అయినను ఎప్పుడూ అతి తక్కువ మార్కులతో పాస్ అవడం జరిగేది. అందుకు కారణం ఆయన ఆలోచనా ప్రవాహ విధానం. అదే ఆ తరువాత Pasteurization (క్రిమిదూరీకరణం, శుద్ధి) అనే గొప్ప ప్రక్రియను కనుగొనడానికి దోహదపడింది. తద్వారా నేడు ప్రపంచంలో అతి పెద్ద పరిశ్రమ అయిన వైన్ ఇండస్ట్రీ లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి.

1849 వ సంవత్సవరం లో #స్ట్రాస్బౌర్గ్ (Strasbourg) విశ్వవిద్యాలయం లో రసాయన శాస్త్ర ప్రొఫెసర్ అయ్యారు. అక్కడ ఆయన సేంద్రీయ సంయోగం (organic synthesis) ద్వారా స్ఫటిక విన్యాసాలకి (crystal structure) సంబంధించి ఎన్నో ముఖ్యమైన ఆవిష్కరణలు చేసారు.

బాక్టీరియా వల్లా మరియు ఇతర సూక్ష్మ జీవుల వల్లా వ్యాధులు ఎలా సంభవిస్తాయి అన్న విషయం 19 వ శతాబ్దంలో ఒక రహస్యం గా ఉండేది. అప్పట్లో చాలా మంది కేవలం గాలి సోకడం వల్ల అంటువ్యాధులు వస్తాయని నమ్మేవారు. గాలిలో రోగకారక క్రిములని మోసుకొచ్చే వస్తువుల వల్ల అంటువ్యాధులు కలుగుతాయని అప్పుడు ఎవరికీ తెలీదు.

పాశ్చర్ కొన్ని #అద్భుత ప్రయోగాలు చేసి సూక్ష్మ జీవులు ఒకదాన్నుండి ఒకటి పుడతాయని, గాల్లోంచి ఊడిపడవని నిరూపించాడు. ఆయన ప్రతిపాదించిన రోగకారక క్రిమి సిద్ధాంతం (Germ theory of disease) వైద్య శాస్త్రంలో ఒక విప్లవాత్మకమైన భావనగా చెప్పుకోవచ్చు. అంతేకాక ఆయన వ్యాధి యొక్క వ్యాప్తిని అరికట్టేందుకు ఆస్పత్రులలో చేతులు కడుక్కోవడం వంటి పరిశుభ్రతా పరమైన పద్ధతులు ప్రవేశపెట్టారు. పాశ్చర్ అత్యంత సునిశితమైన, క్రమబధ్ధమైన ప్రయోగాలు చేసి ఎన్నో ప్రమాదకరమైన సూక్ష్మజీవులను కనుగొన్నారు. ఆ సూక్ష్మజీవులని అరికట్టే వాక్సీన్ లు రూపొందించి మనుషులనే కాక, జంతువులను కూడా ఎన్నో భయంకరమైన వ్యాధుల నుంచి కాపాడారు.

#జీవం నుంచి జీవం :

ఈ ద్రాక్ష చుట్టూ ఉన్న చిన్న సహజ పదార్థాలు(Yeasts) వాటి ఏక కణ శిలీంధ్రాల (single-celled fungi) నుంచి పెరుగుతాయి. ఇటువంటి సూక్ష్మజీవులు, పరిసరాలలో అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు వాటంతట అవే పుట్టుకు వస్తాయని ఒక సిద్ధాంతంగా(spontaneous generation) అప్పట్లో ప్రజలు భావించేవారు. పాశ్చర్ తన ప్రయోగాలను ఉపయోగించి ఈ సూక్ష్మజీవులు వాస్తవానికి ఇతర సూక్ష్మజీవుల నుండి ఉత్పత్తి అవుతాయని, ఊరికే గాలిలోంచి ఊడిపడవని నిరూపించారు.

#ఆరోగ్యకరమైన పాలు:

పాలు అమ్మకానికి వెళ్ళే ముందు, వాటిలో ఉండే హానికరమైన జీవుల సంఖ్య (బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాలు వంటివి) తగ్గించేందుకు, ఒక నిర్ణీత సమయం సేపు, ఒక నిర్దిష్టమైన ఉష్ణోగ్రత వద్ద వేడి చెయ్యాలి. పాశ్చర్ 1860 లో మొదట పులిసిపోయిన వైన్ ని శుధ్ధి చెయ్యడానికి ఈ పద్దతిని ఉపయోగించారు. ఆ తర్వాత నుంచి ఈ పద్దతిని పాశ్చరైజేషన్ ("Pasteurization") అన్నారు.

#మద్యాన్ని పులియబెట్టే పద్ధతిని #మెరుగుపరచడం(Improving fermentation of Alcohol):

ఫ్రాన్స్ లో వైన్ మరియు బీర్ పరిశ్రమలలో ఎన్నో సందర్భాలలో మద్యం అతిగా పులిసిపోవడం వల్ల దాన్ని పారబోయాల్సి వచ్చేది. ఈ దుష్పరిణామాన్ని అడ్డుకోడానికి ఏదైనా చెయ్యమని ఆ పరిశ్రమల వారు పాశ్చర్ ని కోరారు. పాశ్చర్ తన పరిశోధనల ద్వార పులిసిన వైన్ లోను, మంచి వైన్ లోను ఉండే ఈస్ట్ (yeast ) కణాల మధ్య ఆకారంలో తేడా ఉందని కనుక్కునారు. ఆక్సిజన్ రహితంగా కిణ్వన ప్రక్రియ (fermentation process) జరుగుతున్నప్పటికీ, అందులో వున్న ఈస్ట్ (yeast) వల్ల మద్యం ఉత్పత్తి జరుగుతుంది అని కనుక్కున్నారు. సరైన ఈస్ట్ (yeast ) ను ఉపయోగించడం వల్ల, 122F (55C) ఉష్ణోగ్రత వరకు వేడి చేసి అనర్థకరమైన ఇతర సూక్ష్మజీవులను ఆ ద్రవం నుంచి తొలగించడం వల్ల వైన్ పులియకుండా అరికట్టవచ్చని కనుక్కున్నారు.

#పట్టు పరిశ్రమను కాపాడుట:

దక్షిణ-పశ్చిమ ఫ్రాన్స్ పట్టుపరిశ్రమలకి ఆలవాలం. అలంకార ప్రియులైన ఫ్రెంచ్ పౌరుల జీవనంలో ఈ పట్టు ఓ ముఖ్యభాగంగా ఉండేది. ఆ రోజుల్లో ఏదో తెలియని వ్యాధి వల్ల పట్టుకాయలు (silk coccoons) నాశనం అవుతూ ఉండేవి. కనుక 1864 లో ఫ్రెంచ్ ప్రభుత్వం, వ్యాధి వల్ల నాశనం అవుతున్న పట్టుపురుగులని రక్షించమని పాశ్చర్ ని కోరింది. స్థానికులైన పట్టు పురుగు పెంపకదార్లకి ముందు పాశ్చర్ మీద పెద్దగా నమ్మకం కలగలేదు. మైక్రోస్కోప్ పట్టుకుని బయల్దేరి వచ్చిన ఈ పెద్ద మనిషి తమకి ఏం చెయ్యగలడు అనుకున్నారు.

#పట్టుపురుగులని నాశనం చేస్తున్న సూక్ష్మజీవుల మీద పాశ్చర్ పరిశీలనలు మొదలెట్టారు. 2 సంవత్సరాల తర్వాత పాశ్చర్ రెండు రకాలైన పరాన్నజీవులు (parasites) వల్ల infection సంభవించింది అని కనుగొన్నారు. తదనంతరం వాటిని నిర్మూలించే పద్ధతిని కనిపెట్టి పాశ్చర్ పట్టుపరిశ్రమని కాపాడారు.

#అదృశ్య శత్రువులు:

ప్రాణాంతకమైన వ్యాధి ఆంత్రాక్స్ వ్యాధికి కారణం bacillius అనే కడ్డీ ఆకారంలో బాక్టీరియం. జర్మన్ వైద్యుడు రాబర్ట్ కోచ్ (Robert Koch) (1843-1910) ఆంత్రాక్స్ కి కారణమైన సూక్ష్మజీవి ఒకటుందని 1876 లో కనుక్కున్నాడు. పాశ్చర్ తన పరిశోధనలతో ఆ విషయాన్ని నిర్ధారించడమే కాక, ఆంత్రాక్స్ నివారణకి అవసరమైన వాక్సీన్ ని రూపొందించారు.

#రాబిస్ వ్యాధి:

రేబీస్ అనేది వైరస్ ల వల్ల కలిగే ఓ భయంకరమైన వ్యాధి. అది కుక్కల నుండి మనుషులకి సోకుతుంది. ఈ వైరస్ బాక్టీరియాల కన్నా అతి చిన్నదైన వస్తువు. కనుక పాశ్చర్ వాడిన సూక్ష్మదర్శినిలో ఇది కనిపించలేదు. ఆ వైరస్ వ్యాధితో కేంద్ర నాడీ వ్యవస్థ ఫై ప్రభావితం చేస్తుంది. పాశ్చర్ ఆ వ్యాధి సోకిన జంతువుల వెన్నుపాము (spinal cord) నుంచి ద్రవం సంగ్రహించి, వివిధ పద్ధతుల చేత ఆ ద్రవం యొక్క రోగతీవ్రతని క్షీణపరిచి, ఆ ద్రవాన్ని తిరిగి కుక్కల మీదకి ఎక్కించి రేబీస్ కి వాక్సీన్ ని రూపొందించారు.

#మొదటి రాబీస్ వ్యాక్సిన్:

1885,లో జోసెఫ్ మైస్టర్ అనే 9 ఏళ్ల పిల్లవాడికి మొట్టమొదటి సారిగా ఈ రేబీస్ వాక్సీన్ ని ఎక్కించి రోగాన్ని నయం చేశారు.

ఎన్నో ఏళ్ళ పాటు ఎన్నో మహమ్మారి రోగాల మీద ధ్వజం ఎత్తిన తన వ్యాధి నిర్మూలనా ప్రయత్నాలని వ్యవస్థీకరించాలనే ఉద్దేశంతో "పాశ్చర్ ఇన్స్టిట్యూట్" అనే ప్రైవేటు సంస్థకి ప్రారంభోత్సవం చేశారు.
పాశ్చర్ సుక్ష్మజీవశాస్త్రంలో అత్యుత్తమ గౌరవమని పిలిచే లీవెన్ హాక్ బహుమతిని 1895లో పొందారు.
ఆ విధంగా గొప్ప వైద్యుడిగా, శాస్త్రవేత్తగా, #దేశభక్తుడిగా ఫ్రెంచ్ వారి మనసులలో స్థిరనివాసం ఏర్పరచుకున్న పాశ్చర్ 1895 లో సెప్టెంబర్ 28 నాడు పారిస్ లో సెయింట్ క్లౌడ్ సమీపంలో చివరి శ్వాస విడిచారు.
🙏🙏🔬🔬🙏🙏
Collected by
A.Srinivasa Reddy
9912731022
Zphs Munugodu Amaravathi mandal Guntur district.

Monday, 27 December 2021

జనవరి చెకుముకి సంచిక కొరకు, Dec 30 లోపు కథ రాయండి

జన విజ్ఞాన వేదిక ప్రచురణ
*చెకుముకి* - బాలల సైన్స్ మాస పత్రిక వారి " *ఈ బొమ్మకు కథ రాయండి*" శీర్షికలో  పైబొమ్మకు
*2022 జనవరి సంచిక* కథ కొరకు విద్యార్థులకు ఆహ్వానం.

— మీ కథ A 4 సైజులో 1 - 2 పేజీలు మించరాదు.
— తెలుగు & ఆంగ్ల భాషలలో విడివిడిగా రాయచ్చు.
— ఆఖరు తేది డిసెంబరు 30.
chekumuki@gmail.com కు మీ కథను వెంటనే పంపగలరు. 

Friday, 24 December 2021

జన విజ్ఞాన వేదిక రాష్ట్ర స్థాయి చెకుముకి సైన్స్ సంబరాల కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్సీ K.S. లక్ష్మణరావు గారు

జన విజ్ఞాన వేదిక రాష్ట్ర స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు వచ్చే జనవరి 8, 9 తేదీల్లో గుంటూరులోని పాటిబండ్ల సీతారామయ్య హై స్కూల్ లో నిర్వహిస్తున్నట్లుగా ఎమ్మెల్సీ కే.ఎస్. లక్ష్మణరావు గారు తెలిపారు గుంటూరులోని యు.టి.ఎఫ్. కార్యాలయంలో చెకుముకి సైన్స్ సంబరాల కరపత్రాన్ని శనివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మణ రావు గారు మాట్లాడుతూ విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథాన్ని, ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించడానికి గత 30 ఏళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరారు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాజశేఖర్ రాహుల్, మురళీధర్ లు మాట్లాడుతూ ఇప్పటికే పాఠశాల స్థాయిలో నిర్వహించిన పోటీల్లో నాలుగున్నర లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. వారికి జిల్లా స్థాయి పోటీలు నిర్వహించి విజేతలను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్టుగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల నుండి 52 బృందాలు ఈ చెకుముకి సంబరాల్లో పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే సంబరాలలో  క్విజ్, శాస్త్రవేత్తల తో ముఖాముఖి, సైన్స్ ప్రయోగాలు ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు త్రిమూర్తులు రెడ్డి, శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Monday, 13 December 2021

జన విజ్ఞాన వేదిక రాష్ట్ర స్థాయి చెకుముకి సైన్స్ సంబరాల కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్సీ K.S. లక్ష్మణరావు గారు

జన విజ్ఞాన వేదిక రాష్ట్ర స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు వచ్చే *జనవరి 8, 9* తేదీల్లో *గుంటూరులోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్* లో నిర్వహిస్తున్నట్లుగా ఎమ్మెల్సీ కే.ఎస్. లక్ష్మణరావు గారు తెలిపారు గుంటూరులోని యు.టి.ఎఫ్. కార్యాలయంలో *చెకుముకి సైన్స్ సంబరాల కరపత్రాన్ని* శనివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మణ రావు గారు మాట్లాడుతూ విద్యార్థులలో *శాస్త్రీయ దృక్పథాన్ని, ప్రశ్నించే తత్వాన్ని* పెంపొందించడానికి గత 30 ఏళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరారు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాజశేఖర్ రాహుల్, మురళీధర్ లు మాట్లాడుతూ ఇప్పటికే పాఠశాల స్థాయిలో నిర్వహించిన పోటీల్లో *నాలుగున్నర లక్షల మంది విద్యార్థులు* పాల్గొన్నారని తెలిపారు. వారికి జిల్లా స్థాయి పోటీలు నిర్వహించి విజేతలను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్టుగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లోని *13 జిల్లాల నుండి 52 బృందాలు* ఈ చెకుముకి సంబరాల్లో పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే సంబరాలలో  *క్విజ్, శాస్త్రవేత్తల తో ముఖాముఖి, సైన్స్ ప్రయోగాలు* ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు త్రిమూర్తులు రెడ్డి, శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

వేమన పద్యాలను వెలుగులోకితెచ్చిన మహనీయుడు సిపి బ్రౌన్ వర్ధంతి నేడు(నిర్యాణం 12.12.1884) :: ఎం. రాం ప్రదీప్

తెలుగు వారికి ఎనలేని సేవలు అందించినసర్ ఆర్థర్ కాటన్  వంటివారితోబాటు తెలుగువారు అత్యంత  ప్రేమాభిమానాలతో  గుర్తుంచుకోవలసిన మహామనీషి బ్రౌన్ . 800 సంవత్సరాల పైగా ఘన చరిత్ర కలిగిన ఈ  తెలుగు భాష గొప్పతనాన్ని గుర్తించి సామాన్య ప్రజానీకానికి ఇంకా ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత ఒక విదేశీయునికి చెందడం ఆశ్చర్యమే అయినా ఆనందదాయకం కూడా!  

1817, ఆగస్ట్‌ 1 న ఇంగ్లండ్‌ నుంచి భారతదేశానికి ఓడ ఒకటి బయల్దేరింది. దాని పేరు కర్ణాటక్‌. వందలాది ప్రయాణికులున్నారు అందులో. ఆ వందల్లో ఓ అనామకుడు. 19 ఏళ్లవాడు. పేరు.. ఛార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌. భవిష్యత్తులో మరణశయ్యపై ఉన్న తెలుగు సాహిత్యాన్ని.. శాస్త్రీయత అనే గంగతో బతికించే సాహితీ భగీరథుడు. 'కానీ ఆ ఓడ ఎక్కేటప్పుడు అసలు 'తెలుగు' అనే మూడక్షరాల మాట విన్లేదు' అంటాడతను నిజాయతీగా. కానీ అతని జీవితం మొత్తాన్ని ఆ మూడు అక్షరాలే శాసించాయి. అతని మాటల్లో చెప్పాలంటే 'పిచ్చెక్కించాయి'. అతని వూపిరున్నంత వరకు వూడిగం చేయించుకున్నాయి!

తెలుగు సాహిత్యమునకు విశేష సేవ చేసిన ఆంగ్లేయుడు. తొలి తెలుగు శబ్దకోశమును ఈయనే పరిష్కరించి ప్రచురించాడు (నవంబర్ 10, 1798 ). బ్రౌన్ డిక్షనరీని ఇప్పటికి తెలుగులో ప్రామాణికంగా ఉపయోగిస్తారు. 

తెలుగు జాతికి సేవ చేసిన నలుగురు ఆంగ్లేయులలో ఒకరిగా బ్రౌన్ ను పరిగణిస్తారు. మిగతా ముగ్గురి పేర్లు ఆర్థర్ కాటన్, కాలిన్ మెకెంజి, థామస్ మన్రోలు. ఆంధ్ర భాషోద్ధారకుడు అని గౌరవించబడిన మహానుభావుడు. వేమన పద్యాలను సేకరించి, ప్రచురించి, ఆంగ్లంలో అనువదించి ఖండాంతర వ్యాప్తి చేశాడు.

12 డిసెంబర్‌ 1884న అవివాహితుడిగానే తన 87వ యేట లండన్‌లోనే కన్ను మూశారు. కుటుంబం - సంసారం వంటి బంధనాల్లో ఇరుక్కోకుండా స్వేచ్ఛగా తెలుగు భాషా సాహిత్యాలకు, తెలుగు ప్రజలకు తనను తాను అర్పించుకున్న మహనీయుడు ఛార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌!

డాక్టర్‌ జానుమద్ది హనుమచ్ఛాస్త్రి కడపలో బ్రౌన్‌ స్మారక గ్రంథాలయం నెలకొల్పారు. బ్రౌన్‌ జీవితం - సాహిత్య కృషి గురించి పరిశోధించి, విషయాలు తరువాతి తరాలవారికి అందించారు. జానుమద్దిగారితో గతంలో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడం, కొన్ని సాహిత్య సభల్లో ఆయన్ని కలుసుకోగలగడం మరువలేని జ్ఞాపకాలు! బ్రౌన్‌ను తనలో ఆవహింపజేసుకున్నవాడిగా ఆయన కనబడేవారు. అందుకే ఆయనను తెలుగు సూర్యుడు అని పిలుస్తారు.

ప్రతి రంగంలోనూ త్యాగధనులు ఉంటారు. వారి కృషిని కనీసం స్మరించుకోవడం మనుష్యులైన వారి కనీస కర్తవ్యం. తన 86  సంవత్సరాలలో 60 సంవత్సరాలు తెలుగు భాషాభివృద్ధికి అంకితం చేసిన బ్రౌన్ ని సంస్మరించుకోవడం తెలుగు వారందరి విధి.

9492712836
తిరువూరు

Sunday, 12 December 2021

జన విజ్ఞాన వేదిక జిల్లా సమావేశము, లావు బాల గంగాధర రావు భవన్, తేదీ:12.12.21, ఒంగోలు..














జన విజ్ఞాన వేదిక జిల్లా సమావేశమునకు శ్రీ A.V. పుల్లారావు గారు గౌరవాధ్యక్షులు గా వ్యవహరించారు.  
👉 ప్రస్తుతo దేశంలో క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి. ప్రజలు సమస్యలు చెప్పుకొనే స్థితి లేదు.
 👉 ప్రజాప్రతినిధులకు పెన్షన్ వుంది.మరి సామాన్య ఉద్యోగులకు పెన్షన్ ఎందుకు తొలగించారు.
👉 ప్రజా ప్రతినిధులు ప్రజలకు బాధ్యత వహించాలి. కాని ప్రభుత్వ ఆస్తులు కారు చౌకగా అమ్మకానికి ప్రజలకు ఎన్నుకొలేదు.
👉 అన్నిమతాల సారాంశం ఒక్కటే
👉 శాస్ర్తీయ దృక్పదం  పెంచాలి.
💐రాష్ట్ర కార్యదర్శి  శ్రీ మురళిధర్ గారు 
       .  👉కరొన మనకు నేర్పిన పాఠం ప్రజలందరూ ఆరోగ్యంగా వుండాలి.
ప్రజలు ఆరోగ్యంగా లేకుండా మనం ఆరోగ్యంగా ఉండలేం . 
👉విజ్ఞానశాస్త్ర ప్రచారం లో మహిళల భాగస్వామ్యం పెరగాలి .
👉 మహనీయులు, జాతీయ నాయకులు మేధావుల జయంతులు , వర్ధంతులు జరపాలి

Saturday, 11 December 2021

మూఢనమ్మకాల నిర్మూలన కోసం జనవిజ్ఞాన వేదిక యూత్ కమిటీ సభ్యుడు జె.శేఖర్ యొక్క సాహసోపేత ప్రదర్శన

మూఢనమ్మకాల నిర్మూలన కోసం జనవిజ్ఞాన వేదిక యూత్ కమిటీ సభ్యుడు జె.శేఖర్ యొక్క సాహసోపేత ప్రదర్శనకు ఏ ఐ పి ఎస్ ఎన్ రాష్ట్ర శాఖ మరియు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యాలయం, JVV ప్రకాశం జిల్లా శాఖ మరియు అద్దంకి డివిజన్ జన విజ్ఞాన వేదిక తరఫున తెలియజేయడమైనది.

Monday, 6 December 2021

ప్రకృతిని మనం కాపాడితే మనల్ని మనం కాపాడుకున్నట్టే.

JVV, అద్దంకి డివిజన్ ఆధ్వర్యంలో సీపీఎం 13 వ జిల్లా మహాసభలకు వైద్య సహాయం.

JVV, అద్దంకి డివిజన్ ఆధ్వర్యంలో సీపీఎం 13 వ జిల్లా మహాసభలకు వైద్య సహాయాన్ని అందిస్తున్న డివిజన్ హెల్త్ సబ్ కమిటీ కన్వీనర్ డా|| కె.రఘుచంద్ గారు

Friday, 29 October 2021

MLC VBS గారిచే గిద్దలూరు డివిజన్ లో JVV సభ్యత్వ కార్యక్రమం ప్రారంభం

శాసనమండలి ప్రొటెం స్పీకర్ శ్రీ విఠపు బాలసుబ్రహ్మణ్యం గారి చే గిద్దలూరు డివిజన్లో జన విజ్ఞాన వేదిక సభ్యత్వ క్యాంపెయిన్ ప్రారంభించబడినది.

Tuesday, 26 October 2021

జనవిజ్ఞాన వేదిక సభ్యత్వ క్యాంపెయిన్ అక్టోబర్ 2021

శాస్త్రీయ సమాజ నిర్మాణం కోసం జనవిజ్ఞాన వేదిక లో భాగస్వాములు కండి. సభ్యత్వాన్ని స్వీకరించండి.

Sunday, 24 October 2021

జన విజ్ఞాన వేదిక సభ్యత్వ క్యాంపెయిన్ ప్రారంభిస్తున్న ప్రకాశం జిల్లా డిఇఓ శ్రీ విజయ భాస్కర్ గారు

సమాజంలో వేళ్లూనుకుపోయిన మూఢనమ్మకాల నిర్మూలన కు విద్యావంతులైన ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి విజయభాస్కర్ పేర్కొన్నారు జన విజ్ఞాన వేదిక సభ్యత్వ నమోదు కరపత్రాలు మరియు పోస్టర్స్ ను ఆయన శనివారం ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక వారు శాస్త్ర విజ్ఞాన ప్రచారం కొరకు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. పాఠశాల విద్యార్థులకు చెకుముకి సైన్స్ సంబరాలు ద్వారా సైన్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం కొనసాగించాలన్నారు. జెవివి రాష్ట్ర కార్యదర్శి కె. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ JVV ద్వారా శాస్త్రవిజ్ఞాన ఫలితాలు సామాన్య ప్రజలకు కూడా చేరువయ్యేందుకు  విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నా మన్నారు. పర్యావరణ పరిరక్షణకు, ప్రజల మౌలిక సమస్యలక పరిష్కారాల కొరకు JVV పనిచేస్తుందన్నారు. జెవివి సభ్యత్వ నమోదుకు ఉపాధ్యాయులు ఉద్యోగులు విద్యావంతులు తమ వంతు సహకారాన్ని అందించాలని కోరారు. సభ్యత్వ నమోదులో జెవివి జిల్లా ప్రధాన కార్యదర్శి ch. జయ ప్రకాష్, జిల్లా కార్య వర్గ సభ్యులు,  నగర కోశాధికారి నాగేశ్వరరావు గారు పాల్గొన్నారు.

జన విజ్ఞాన వేదిక లక్ష్యాలు

1. సామాన్య ప్రజానీకంలో శాస్త్ర విజ్ఞాన ప్రచారం, శాస్త్రీయ ఆలోచనా దృక్పథాన్ని పెంపోందిచటం.
2. శాస్త్ర విజ్ఞానం ద్వారా మూఢ విశ్వాసాలను, ఛాందస భావాలను అరికట్టుట.
3. ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల మౌలిక స్వరూప స్వభావాలను గూర్చి సమగ్రమైన శాస్త్రీయ అవగాహనను పెంపొందించుట, పరిష్కారాలను అన్వేషించుట.
4. ఏ కొద్దిమందికో పరిమితమైన శాస్త్ర విజ్ఞాన ఫలితాలను సామాన్య ప్రజలకు కూడా అందేటట్టు ప్రయత్నించుట.
5. సత్యాన్వేషణకు, దేశ స్వావలంబనకు, సంగ్రతలు, ప్రపంచ శాంతికి, సామాజిక అభివృద్దికి, సాంస్కృతిక వికాసానికి కృషి చేయడం.
6. వివిధ రంగాలలో ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని శాస్త్ర పరిశోధనలను ప్రోత్సహించుట.
7. పై ఆశయాల సాధనకు తగు రీతిలో కార్యక్రమాలు నిర్వహించుట.

Saturday, 23 October 2021

సైన్సుపై ఆసక్తి పెంచుకుందాం!(నేడు మోల్ డే) వ్యాసకర్త- యం.రాం ప్రదీప్

భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి
పౌరుడు శాస్త్రీయ దృక్పథంని
అలవర్చుకోవాలి. కానీ పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని
కొందరు సమాజంలో సరికొత్త మూఢ నమ్మకాలని పెంచి పోషిస్తున్నారు. సైన్స్ పట్ల ఆసక్తి పెంచడానికి,ప్రజల్లో శాస్త్రీయ ఆలోచనలు పెంచడానికి జనవిజ్ఞాన వేదిక వంటి సైన్స్ ప్రచార సంస్థలు విశేష కృషి చేస్తున్నాయి.

విద్యార్థులలో రసాయన శాస్త్రం పట్ల ఆసక్తి పెంచడానికి
అక్టోబర్ 23న మోల్ డేని ప్రతి ఏటా జరుపుతారు.1980వ దశకం నుంచి ఈ దినోత్సవం జరుపుతున్నారు.

19వ శతాబ్దంలో పరమాణువు
ద్రవ్యరాశుల్ని కనుగొనడానికి ఎలాంటి సౌకర్యాలు లేవు.అందుకే రసాయన శాస్త్ర వేత్తలు ఈ విలువలను ప్రయోగాల ద్వారా సాపేక్షంగా
నిర్ధారించారు. ఈనాడు పరమాణువుల ద్రవ్యరాశిని కచ్చితంగా కనుగొనడానికి మాస్ స్పెక్ట్రో మీటర్ వంటి పరికరాలు ఉపయోగిస్తున్నారు.

పదార్ధంలో ఉండే పరమాణువుల పరిమాణం చాలా  చిన్నదిగా ఉంటుంది. చాలా కొద్ది పదార్థాన్ని తీసుకున్నా అందులో అతి పెద్ద
సంఖ్యలో కణాలు ఉంటాయి.ఉదాహరణకు 18 గ్రాముల నీటిలోను,12 గ్రాముల కార్బన్ లోను కణాల సంఖ్య సమానంగా ఉంటాయి. ఈ సంఖ్య చాలా పెద్దగా వుంటుంది. వీటిని చెప్పాలంటే
మనకు ఒక సంఖ్యా యూనిట్ అవసరం. ఈ సంఖ్యా యూనిట్ నే మోల్ అంటాం. ఏ పదార్ధంలో నైనా ఒక మోల్ లో
ఉండే కణాల సంఖ్య ఎల్లప్పుడూ స్థిరం.

ఒక మోల్ పదార్ధంలో ఉన్న కణాల సంఖ్యని అవగాడ్రో సంఖ్య అంటారు.దీని విలువ ఎల్లప్పుడూ 6.022x10 23కు సమానం.ఇటలీ శాస్త్రవేత్త అమెడియో అవగాడ్రో రసాయన శాస్త్రానికి చేసిన సేవకు గౌరవ సూచకంగా ఈ
సంఖ్యకు అతని పేరు నిర్ణయించారు. మోల్ అనే పదాన్ని విల్ హెల్మ్ ఆస్వాల్డ్ లాటిన్ పదమైన మోల్స్ నుండి
తీసుకున్నారు.దీని అర్ధం కుప్ప.
ఒక పెద్ద సంఖ్యకు మోల్ అనే ప్రమాణాన్ని వాడాలని 1967లో నిర్ణయించారు.

మన దేశానికి చెందిన కణాదుడు అనే ఋషి కణం యొక్క ఉనికిని ఊహించారు.తర్వాత డాల్టన్ తదితరులు చేసిన పరిశోధనల
ఫలితంగా అణువు,పరమాణువులపై ఆధునిక ప్రపంచానికి ఒక అవగాహన వచ్చింది.ప్రజల్లో సైన్స్ పట్ల
అవగాహన పెరగాలంటే మరో ప్రజా సైన్స్ ఉద్యమం రావాల్సిన అవసరం ఉంది


తిరువూరు
9492712836

Saturday, 16 October 2021

ఆహార వృథాని అరికడదాం!(నేడు ప్రపంచ ఆహార దినోత్సవం) :: యం.రాం ప్రదీప్

ఆకలితో ఉన్నవారికి ముందు అన్నం పెట్టు,ఆ తర్వాత వేదం చెప్పు అంటారు స్వామి వివేకానంద. దేశంలో హరిత విప్లవం వచ్చాక ఆహార ఉత్పత్తులు పెరిగాయి. ఆహార ఎగుమతులు పెరిగాయి. కానీ
పేదవారి ఆకలి దప్పులు అలాగే ఉన్నాయి.

కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం అందరికీ ఆరోగ్యంపై అవగాహన కాస్తైనా పెరిగింది. పోషకాహారాన్ని తీసుకోవాల్సిన ప్రాధాన్యతను అది నొక్కి చెబుతున్నది. అయితే అందరికీ మూడు పూటలా ఆహారం లభించడం లేదని మన కండ్ల ముందు కనబడుతున్న వాస్తవం. ఈ నేపథ్యంలో  అక్టోబర్16న మనం జరుపుకుంటున్న ప్రపంచ ఆహార దినోత్సవం గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.ఆకలి సూచిలో కూడా మన స్థానం ఆశాజనకంగా లేదు.

ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం అక్టోబరు 16 తేదీన జరుపుకుంటారు. 1945 సంవత్సరం అక్టోబరు 16 న ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయక సంస్థను  స్థాపించారు. దీనికి గుర్తుగా అక్టోబరు 16 తేదీని ప్రపంచ ఆహార దినోత్సవంగా నిర్ణయించారు. ఈ దినోత్సవాన్ని ప్రపంచ ఆహార కార్యక్రమంతో సహా ఆహార భద్రతకు సంబంధించిన అనేక ఇతర సంస్థలు విస్తృతంగా జరుపుకుంటున్నాయి. ఈ ప్రపంచ ఆహార దినోత్సవ కార్యక్రమాన్ని మొదటిసారి 1981 లో జరుపుకున్నారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ దినోత్సవం రోజున ఆహార భద్రతకు సంబంధించిన ఒక్కో సందేశాన్నిస్తున్నారు.

నేటి మన చర్యలే రేపటి మన భవిష్యత్ ని నిర్ణయిస్తాయి అనే నినాదంతో ఈ ఏడాది ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము.
ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం భారత దేశంలో 28 శాతం పేదరికం ఉందని,పేదరిక శాతం తగ్గినప్పటికీ, పేదల సంఖ్య గణనీయంగా ఉందని తెలిపింది. కరోనా ప్రపంచంతో పాటు,మనదేశాన్ని కూడా దారుణంగా దెబ్బతీసింది.ముఖ్యంగా కరోనా
సెకండ్ వేవ్ మన దేశాన్ని చిన్నాభిన్నం చేసింది.
ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. పేదవారికి తగిన పౌష్టికాహారం లభించడం లేదు.ఆహారపు గిడ్డంగుల్లో ధాన్యాన్ని ఎలుకలు కొట్టేస్తున్నాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు
సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. కరోనా కాలంలో
కేరళ ప్రభుత్వం ప్రజలకు నిత్యావసర సరుకులని పంపిణీ చేసింది.
ఇక వివాహాలు తదితర వేడుకల్లో వృథా అయ్యే ఆహారం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
రోజురోజుకూ వ్యవసాయం చేసే
వారి సంఖ్య మరింత తగ్గిపోతుంది. గ్రామాల్లో ఉపాధి అవకాశాలు లేక ప్రజలు పట్టణాలకు తరలిపోతున్నారు.ఫలితంగా
దేశవ్యాప్తంగా వలస కార్మికుల
సంఖ్య పెరిగిపోతుంది.వీరి వివరాలు ప్రభుత్వాల వద్ద లేవు.కరోనా కాలం లో వీరి వెతలు ప్రత్యక్షంగా చూశాము.

ప్రభుత్వాలు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి.రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలి. దళారుల ప్రమేయాన్ని నియంత్రణ చేయాలి.నాణ్యమైన విత్తనాలని రైతులకు అందించాలి.ఎరువుల ధరలు తగ్గించాలి.భూసార పరీక్షలని
ఉచితంగా చేయాలి. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పేదవారికి ఏడాది పొడవునా పని కల్పించాలి.తద్వారా కొంతవరకయినా పేదరికం తగ్గుతుంది. పౌష్టికాహారం అందరికి అందుతుంది

జనవిజ్ఞానవేదిక
కనిగిరి డివిజన్

Thursday, 14 October 2021

APSBB’s Biodiversity Conserver Awardees 2021 ::

మన మిత్రులు పర్యావరణ ఆక్టివిస్ట్, పక్షుల పరిశోధకులు, 80 వ పడిలో కూడా నిబద్ధతతో పనిచేసే నిత్య కృషీవ లుడు *శ్రీ మృత్యుంజయ రావు* గారు APSBB's జీవ వైవిధ్య పరిరక్షణ 2021టీమ్ లో అవార్డు పొందడం అత్యంత ఆనంద దాయకం, గర్వకారణం. వారికి JVVAP పర్యావరణ సభ్కమిటీ మరియు జిల్లా,రాష్ట్ర శాఖల పక్షాన *విజ్ఞాన అభినందన మందారాలు*

డెంగీ ని గురించి తెలుసుకుందాం

       దోమ కాటు ద్వారా డెంగీ వైరస్‌ మన శరీరంలోకి ప్రవేశించిన 4-6 రోజుల్లో లక్షణాలు ఆరంభమవుతాయి.
    * హఠాత్తుగా తీవ్రజ్వరం  * తీవ్రమైన తలనొప్పి  * కళ్ల వెనుక నుంచి నొప్పి
    * ఒళ్లు-కీళ్ల నొప్పులు  * వాంతి వికారం  * ఆకలి లేకపోవటం
    ... ఇవి ఆరంభ లక్షణాలు.. ఈ జ్వరం రెండుమూడు రోజుల్లో తగ్గుతుంది, కానీ ఆ తగ్గుతున్న దశలోనే మరింత జాగ్రత్తగా ఉండాలి.

   ఈ దోమ చాలా స్పెషల్‌!

    ఈ దోమలు పగలే కుడతాయి. కుట్టినప్పుడు నొప్పి తెలీదు. మంచి నీటిలోనే ఎక్కువగా పెరుగుతాయి. ఇవి 100 మీటర్లు దాటి ప్రయాణం చెయ్యలేవు. సాధారణంగా శరీరంలో కాళ్లు, పాదాల వంటి కింది భాగాల్లోనే ఎక్కువగా కుడతాయి... ఇలా డెంగీని మోసుకొచ్చే ‘ఈడిస్‌ ఈజిప్టై’ రకం దోమ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. చూడటానికి కూడా ఇది కాస్త పెద్దగా, నల్లటి చారలతో విభిన్నంగా కనబడుతుంది. అందుకే దీన్ని ‘టైగర్‌ దోమ’ అనీ అంటారు. వీటిని గుర్తుపట్టటం తేలికే. కాబట్టి ఈ దోమలకున్న ప్రత్యేకతలను ఆధారంగా చేసుకుని మనం వీటి బారినపడకుండా చాలా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది.

    తప్పించుకునేదెలా?

    * టైగర్‌ దోమ మనం మెలకువగా ఉండే సమయంలోనే, పట్టపగలే కుడుతుంది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో ఎక్కువగా కుడుతుంది. కాబట్టి ఇంట్లోనే కాదు.. స్కూళ్లలో, ఆఫీసుల్లో, బస్సుల్లో, ఆఫీసుల్లో, షాపుల్లో, బ్యాంకుల్లో.. ఇలా మనం బయటకు వెళ్లే అన్నిచోట్లా జాగ్రత్తగా ఉండాలి.
    * టైగర్‌ దోమలు ఎక్కువ దూరం ప్రయాణించలేవు. కాబట్టి మన ఇళ్లు, ఆఫీసులు, స్కూళ్ల పరిసరాల్లో 100 మీటర్ల పరిధిలో ఎక్కడా నీరు చేరకుండా చూడాలి. ఇది కూడా కష్టసాధ్యమైనదేం కాదు. ఇటీవలి కాలంలో ప్లాస్టిక్‌ గ్లాసుల వాడకం బాగా పెరిగింది. వాడిన తర్వాత వీటిని ఎక్కడబడితే అక్కడ పారేస్తుంటారు. వీటిలో నీరు చేరి, దోమలకు ఆలవాలంగా తయారవుతుంది. కాబట్టి మన చుట్టుపక్కల వాడి పారేసిన ప్లాస్టిక్‌ గ్లాసులు, నీళ్ల సీసాలు, పాత టైర్లు, టెంకాయ చిప్పలు, ఖాళీ కుండీల వంటివేమీ లేకుండా చూస్తే చాలు.
    * మన పిల్లలు వెళుతున్న స్కూలు పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడటం చాలా ముఖ్యం. అవసరమైతే క్లాసు రూముల్లో ముందుగానే మ్యాట్స్‌, కాయిల్స్‌ వంటివి పెట్టాలి. స్కూలుకు పంపేటప్పుడు పిల్లలకు పొడుగు చేతుల చొక్కాలు, ప్యాంట్లు, సాక్సులు వెయ్యటం మంచిది. ఇది కుదరకపోతే దోమలు కుట్టకుండా కాళ్లూచేతులకు దోమల క్రీములు రాసి పంపాలి. క్లాసుల్లో కూడా- బల్లల కింద నుంచి, డెస్కుల నుంచి, టేబుల్‌ సొరుగుల నుంచి, కర్టెన్ల వెనక నుంచి ఈ దోమలు రేగి కుడుతుంటాయి. అందుకే వీటిని తరచూ శుభ్రం చెయ్యాలి.

    జ్వరంలో కాదు, తగ్గేప్పుడు జాగ్రత్త

    డెంగీ వస్తే.. జ్వరం చాలా తీవ్రంగా, 105 వరకూ కూడా రావచ్చు. తలనొప్పి, ఒళ్లు నొప్పలు చాలా ఎక్కువగా ఉండొచ్చు. అయినా డెంగీలో ఇదేమంత ప్రమాదకర దశ కాదు. ఆ మంటల జ్వరం రెండు, మూడు రోజుల్లో తగ్గిపోతుంది. ఈ తగ్గిపోయే దశ చాలా కీలకం. ఒంటి మీద ఎర్ర మచ్చలు రావటం, ప్లేట్‌లెట్లు పడిపోవటం, బీపీ తగ్గటం వంటివన్నీ ఆరంభమయ్యేది ఇప్పుడే. డెంగీలో ఇది ప్రమాదకరమైన దశ. కాబట్టి డెంగీలో జ్వరం ఉన్నప్పుడు కాదు.. జ్వరం తగ్గుతున్నప్పుడే మరింత శ్రద్ధగా, అప్రమత్తంగా ఉండాలి. ఈ సమయంలో వైద్యుల సలహా పాటించటం, ఆసుపత్రుల్లో ఉండాలని సూచిస్తే ఉండటం ఉత్తమం. జ్వరం తగ్గాక ఒంటి మీద మచ్చలు వస్తున్నా, తీవ్ర నిస్సత్తువగా ఉన్నా, కాళ్లూ చేతులూ చల్లగా ఉంటున్నా, కడుపులో నొప్పి వస్తున్నా, వాంతులు ఎక్కువ అవుతున్నా.. చిగుళ్ల నుంచి రక్తం వస్తున్నా.. పడుకుని లేవగానే కళ్లు తిరుగుతున్నా వెంటనే వైద్యుల దృష్టికి తీసుకువెళ్లాలి.

    ప్లేట్‌లెట్ల కంటే ‘ప్లాస్మా’ ముఖ్యం!

    మన సమాజంలో చాలామంది డెంగీ జ్వరం అనగానే.. ప్లేట్‌లెట్లు పడిపోతాయని భయపడుతుంటారు. కానీ నిజానికి దీనికంటే కూడా ప్రమాదకరమైనది- రక్తనాళాల్లో నుంచి ప్లాస్మా లీక్‌ అవుతుండటం! మన రక్తంలో ఎర్రకణాలు, తెల్లకణాలు, ప్లేట్‌లెట్ల వంటివన్నీ కలిసి 45 శాతమే ఉంటాయి. మిగిలిన 55 శాతం ద్రవ పదార్థం ప్లాస్మానే. డెంగీ జ్వరం వచ్చినప్పుడు రక్తనాళాల్లో నుంచి ఈ ప్లాస్మా బయటకు.. అంటే కడుపు, వూపిరితిత్తులు, కణజాలాల్లోకి లీక్‌ అయిపోతుంటుంది. దీంతో రక్తం చిక్కబడి, రక్తం పరిమాణం తగ్గి, బీపీ పడిపోతుంది. ఈ స్థితిలో శరీర భాగాలకు తగినంత రక్తం, ఆక్సిజన్‌ అందవు, దీంతో అన్ని అవయవాలు దెబ్బతిని రోగి షాక్‌లోకి వెళ్లే ప్రమాదం ముంచుకొస్తుంది. డెంగీ జ్వరంతో ఎక్కువగా రోగులు చనిపోయేది ఈ స్థితిలోనే. కాబట్టి మనం కేవలం ప్లేట్‌లెట్లనే పట్టించుకోవటం కాదు... వీరికి ‘హెమటోక్రిట్‌’ పరీక్ష చేసి రక్తం చిక్కబడుతోందా? బీపీ తగ్గిపోతోందా? అన్నది తరచూ చూస్తుండటం చాలా అవసరం.

    20 వేల వరకూ తగ్గినా...

    డెంగీ జ్వరం వచ్చినప్పుడు రక్తంలో ప్లేట్‌లెట్‌ కణాలు కొంత తగ్గటం సహజం. అయితే ఈ కొద్దిపాటి తగ్గుదలనే ప్రమాద సంకేతంగా భావిస్తూ బయటి నుంచి ప్లేట్‌లెట్లు, రక్తం వంటివి ఎక్కించెయ్యాల్సిన పని లేదు. వాస్తవానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం డెంగీ బాధితులకు ప్లేట్‌లెట్లు ఎక్కించాల్సిన అవసరం చాలా అరుదుగానే ఎదురవుతుంది. దీన్ని కాస్త వివరంగా చూద్దాం: సాధారణ ఆరోగ్యవంతుల్లో ప్లేట్‌లెట్లు 1.5 నుంచి 4 లక్షల వరకూ ఉంటాయి. వీటి సంఖ్య 1 లక్ష కంటే తక్కువకు పడిపోతుంటే అప్రమత్తం కావాలి. ఈ స్థితిలో వైద్యుల పర్యవేక్షణ అవసరం. ప్లేట్‌లెట్ల సంఖ్య 20 వేలకు పడిపోతే చాలా జాగ్రత్త అవసరం. ఇది 10 వేల కంటే కూడా తగ్గితే రక్తస్రావం అయిపోవచ్చు.. పళ్లచిగుళ్ల నుంచి, ముక్కు నుంచి, మలమూత్రాల ద్వారా లేదా వాంతిలోకూడా రక్తం రావచ్చు. అందుకే ప్లేట్‌లెట్లు ఎప్పుడు ఎక్కించాలన్న దానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ప్లేట్‌లెట్ల సంఖ్య 20 వేల కన్నా తక్కువగా ఉండి ఒంట్లో రక్తస్రావం లక్షణాలు కనబడుతుంటే వెంటనే ప్లేట్‌లెట్లు ఎక్కించాలి. లేదూ- ఎలాంటి రక్తస్రావం లక్షణాలూ లేకున్నా కూడా వీటి సంఖ్య 10 వేలకంటే తక్కువకు పడిపోతుంటే ప్లేట్‌లెట్లు ఎక్కించాలి. కాబట్టి లక్షకంటే తగ్గగానేనే... ప్లేట్‌లెట్లు తగ్గుతున్నాయంటూ ఆందోళనతో వైద్యులపై ఒత్తిళ్లు పెంచాల్సిన పనిలేదని గుర్తించాలి.

    మొదటిసారి ఏ సమస్యా ఉండదు!

    ఎవరికైనా గానీ.. డెంగీ జ్వరం మొదటిసారి వచ్చినప్పుడు అదే తగ్గిపోతుంది, సమస్యలు రావటం అరుదు. డెంగీ వైరస్‌లో నాలుగు రకాల ఉపజాతులున్నాయి. వీటిలో ఒక జాతితో జ్వరం వస్తే జీవితాంతం ఇక ఆ రకం ఉపజాతితో మళ్లీ జ్వరం రాదు. మన శరీరం అందుకు తగిన నిరోధక శక్తిని పెంచుకుంటుంది. కానీ మొదటిసారి ఒక ఉపజాతితో వచ్చి తగ్గిపోయి, రెండోసారి మరో రకం ఉపజాతితో జ్వరం వచ్చినప్పుడే- తీవ్ర పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది- రక్తస్రావమైపోయే ‘డెంగీ హెమరేజిక్‌ ఫీవర్‌’. అయితే ఇది అందరిలో వచ్చే సమస్య కాదు. డెంగీ బారినపడిన చాలా కొద్దిమంది మాత్రమే ఈ పరిస్థితిలోకి వెళతారు. కాబట్టి డెంగీ అనగానే వణికిపోవాల్సిన పని లేదు, వెంటనే ఆసుపత్రిలో చేరాల్సిన పనీ లేదు. కాకపోతే డెంగీ జ్వరమని అనుమానం వచ్చినప్పుడు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి. వైద్యులు డెంగీ అని నిర్ధారించినప్పుడు తరచుగా రక్తం చిక్కదనం తెలుసుకునేందుకు ‘హెమటోక్రిట్‌’ పరీక్ష చేసి చూస్తుంటారు, అది ముఖ్యం. ఒకవేళ ఈ పరీక్షలో చిక్కదనం పెరుగుతున్నట్టు తేలితే సత్వరమే సెలైన్‌ పెట్టటం వంటి వైద్యుల సంరక్షణ అవసరం. అలాగే ప్లేట్‌లెట్‌ కణాలు గణనీయంగా తగ్గిపోతుంటే అప్పుడు వాటిని ఎక్కించాల్సి ఉంటుంది. ఇటువంటి తక్షణ చర్యలతో ప్రాణ ప్రమాదం తగ్గిపోతుంది. కాబట్టి జ్వరం వచ్చినప్పుడు అది డెంగీనా? కాదా? అన్నది నిర్ధారణ చేయించుకోవటం, డెంగీ అయితే జ్వరం తగ్గే దశలో అప్రమత్తంగా ఉండటం ముఖ్యం. డెంగీలో తీవ్ర సమస్యలన్నీ కూడా సాధారణంగా జ్వరం తగ్గిపోతున్న దశలో, ఒకట్రొండు రోజులు మాత్రమే ఉంటాయి. ఆ రెండు రోజులూ వైద్యుల సంరక్షణలో జాగ్రత్తగా ఉంటే చాలు, తర్వాత ఏ సమస్యా ఉండదు.

    నొప్పులు తగ్గించే మందులు వాడొద్దు!

    సాధారణంగా తీవ్రమైన ఒళ్లునొప్పుల్లాంటి బాధలు తగ్గేందుకు ఐబూప్రోఫెన్‌ వంటి మందులు వాడుతుంటారు. కానీ డెంగీ జ్వరంలో వీటిని వాడకూడదు. కాబట్టి ఈ సీజన్లో జ్వరం వస్తే- జ్వర తీవ్రత తగ్గేందుకు ఒక్క ‘ప్యారాసెటమాల్‌’ తప్పించి మరే మందులూ వాడొద్దు. ముఖ్యంగా ఆస్పిరిన్‌, ఐబూప్రోఫెన్‌, నిముసులైడ్‌, డైక్లోఫెనాక్‌ వంటి నొప్పులు తగ్గించే బిళ్లలు అసలుకే వద్దు. కండరాల్లోకి ఇంజక్షన్లు, స్టిరాయిడ్ల వంటివీ తీసుకోకూడదు. యాంటీబయాటిక్‌, యాంటీవైరల్‌ మందులతో ఎలాంటి ఉపయోగం ఉండదు.

    వైద్యులపై ఒత్తిడి తేవొద్దు

    ప్లేట్‌లెట్ల సంఖ్య లక్ష కన్నా తగ్గగానే చాలామంది కంగారు పడిపోతుంటారు. వెంటనే ప్లేట్‌లెట్లు లేదా రక్తం ఎక్కించాలని వైద్యులపై ఒత్తిడి తెస్తుంటారు. ఇది సమంజసం కాదు. ప్లేట్‌లెట్లు, రక్తం ఎప్పుడు ఎక్కించాలనేది డాక్టర్‌ నిర్ణయానికే వదిలేయటం మంచిది. 

    ప్రమాద సంకేతాలు కీలకం

     . సాధారణంగా ప్లాస్మా లీకేజీ ఎక్కువై అంటే ప్యాక్డ్‌సెల్‌ వాల్యూమ్‌ ఉండాల్సిన దానికంటే 20% పెరిగినా, రక్తస్రావం ఎక్కువ అవుతున్నా, ఏదైనా అవయవం దెబ్బతిన్నా.. దాన్ని ‘సివియర్‌ డెంగీ’ అంటున్నారు. (దీన్నే గతంలో డెంగీ హెమరేజిక్‌ ఫీవర్‌, షాక్‌ సిండ్రోమ్‌ అనేవాళ్లు.) ఇది డెంగీలో చాలా తీవ్రమైన స్థితి. జ్వరం వచ్చిన 3, 4 రోజులకు ఈ స్థితి తలెత్తే అవకాశం ఉంటుంది. రక్తంలో హెమోగ్లోబిన్‌ శాతం అసాధారణంగా పెరిగితే దీన్ని అనుమానించాలి. వెంటనే వేగంగా సెలైన్‌ ఎక్కించటం ఆరంభించాలి. అందుకే డెంగీ జ్వరంలో ప్లేట్‌లెట్ల సంఖ్య చూడటం కంటే కూడా హెమటోక్రిట్‌/ప్యాక్డ్‌ సెల్‌ వాల్యూమ్‌ పరీక్ష ప్రధానమని గుర్తించాలి. నిజానికి ఇది రక్తంలో హెమోగ్లోబిన్‌ ఎంత ఉందోనని చెప్పేచాలా చిన్నపరీక్ష, ఎక్కడైనా చేస్తారు, అయినా చాలామంది దీనిపై శ్రద్ధ పెట్టకపోవటం వల్ల ప్రాణాపాయాలు సంభవిస్తున్నాయి. రక్తనాళాల నుంచి ప్లాస్మా లీక్‌ అవుతూ రక్తం చిక్కబడి, హెమోగ్లోబిన్‌ శాతం పెరిగిపోతుంటే అప్పుడు డెక్స్‌ట్రాన్‌ 40 లేదా ప్లాస్మా ఎక్కించటం గురించి ఆలోచించాలి. రక్తంలో హెమటోక్రిట్‌ సాధారణ స్థాయకి చేరుకుని, కనీసం ఒకటి రెండు రోజులు నిలకడగా ఉంటూ, ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతున్నప్పుడు మాత్రమే ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లాలి. 

                                            సి. నాగేంద్ర ప్రసాద్ ,                   
                                             హెల్త్ సూపర్వేజర్                     
                                                                 కూడేరు.

Nobel Prizes 2021

జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు షేక్ ఖాజా హుస్సేన్ గారికి ఏపీజే అబ్దుల్ కలాం విశిష్ట సేవా పురస్కారం

జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు షేక్ ఖాజా హుస్సేన్ గారికి ఏపీజే అబ్దుల్ కలాం విశిష్ట సేవా పురస్కారం లభించింది ఈ సందర్భంగా జనవిజ్ఞాన వేదిక అద్దంకి డివిజన్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.

Tuesday, 12 October 2021

సరైన సమాచారంతోనేపారదర్శకత - :యం.రాం ప్రదీప్ :: నేడు సమాచార హక్కు చట్టం ఏర్పడిన రోజు

స్వాతంత్ర్య అనంతరం కేంద్రం
తీసుకొచ్చిన మంచి చట్టాల్లో
సమాచార హక్కు చట్టం ఒకటి.భారత రాజ్యాంగం ప్రకారం ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు.ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పుకు తిరుగులేదు. ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన చేయాల్సి ఉంటుంది.

ప్రభుత్వాలు  ప్రజల నుంచి వివిధ రూపాల్లో పన్నులు వసూలు చేసి అభివృద్ధి పనులు చేపడతాయి. ప్రజా సంక్షేమానికి నిధులు మంజూరు చేస్తాయి. ఏ పథకానికి ఎన్ని నిధులు మంజూరు అయ్యాయి,ఎంత ఖర్చు పెట్టారు అనే విషయాలు ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. అప్పుడే పాలకులు
అవినీతి రహిత పాలనని అందించగల్గుతారు.అందుకు వారు సరైన,ఖచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలి.
దేశంలో అనేక ఉద్యమాల ఫలితంగా 2005 అక్టోబర్ 12న
సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ద్వారా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు
సమాచార కమీషన్ లని ఏర్పాటు చేయాలి. రాజకీయ నేపథ్యంలేని,నేర చరిత్ర లేని వ్యక్తులని సభ్యులుగా నియమించాలి.వారు వివిధ రంగాలలో నిపుణులు అయి
ఉండాలి.

సమాచార హక్కు చట్ట ఫలితంగా కొంతవరకు దేశంలో 
అవినీతి రహిత పాలన అందింది.పౌరులలో కూడా చైతన్యం పెరిగింది.రాను రాను
సమాచార హక్కు చట్టం స్ఫూర్తి 
దెబ్బతింటుంది.సమాచారం కోరే వారిపై దాడులు చేస్తున్నారు.సమాచారం అడిగినా సక్రమంగా ఇవ్వడంలేదు. అధికారుల నియామకాల్లో రాజకీయ నాయకుల జోక్యం పెరుగుతుంది. ఒక వ్యక్తి
సమాచారం అడిగితే నెల రోజులలోపు అధికారులు ఇవ్వాలి.ప్రభుత్వ కార్యాలయాలలో తప్పనిసరిగా
సహ చట్టం వివరాలు పొందుపర్చాలి.దేశ భద్రతకు సంబంధించినవి తప్ప, మిగతా
సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలి.
సహ ఉద్యమ కారులకి రక్షణ
కల్పించాలి.కమిషన్ స్వతంత్రంగా పని చేయడానికి
వీలు కల్పించాలి. అప్పుడే
అధికారులు పౌరులకు సత్వర
సేవలు అందిస్తారు


తిరువూరు
9492712836 


Monday, 11 October 2021

ఆడపిల్లని ఎదగనిద్దాం :: యం.రాం ప్రదీప్

భారతీయ సమాజంలో ఆడపిల్లని మహాలక్ష్మితో పోలుస్తారు.కానీ ఆచరణలో
ఈ పోలిక ఎక్కడా కనపడదు. వారు అడుగడుగునా అవరోధాలు ఎదుర్కొంటున్నారు.
బాలికల హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ఆడపిల్లలు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రపంచానికి తెలియజేయడానికి.. 2012 నుంచి ఏటా అక్టోబర్ 11న అంతర్జాతీయ బాలికల దినోత్సవంగా జరుపుకొంటున్నారు. బాలికలకు తమ హక్కుల పట్ల అవగాహన కల్పించడానికి, లింగ వివక్షను రూపుమాపడానికి, మహిళా సాధికారత కోసం పోరాటం అనేవి బాలికల దినోత్సవం లక్ష్యాలు.

1995లో బీజింగ్‌లో నిర్వహించిన భేటీలో మహిళలు, బాలికల హక్కుల కోసం ప్రపంచ దేశాలు ఏకగ్రీవ తీర్మానం చేశాయి. బాలికల హక్కుల కోసం ఆమోదం పొందిన తొలి తీర్మానం ఇదే. ఏటా అక్టోబర్ 11న అంతర్జాతీయ బాలికల దినోత్సవం జరుపుకోవాలని డిసెంబర్ 19, 2011న ఐక్యరాజ్య సమితి సూచించింది. తొలి ఏడాది బాల్యవివాహాలకు ముగింపు పలకాలనే థీమ్‌తో బాలికల దినోత్సవం జరుపుకొన్నారు.

దేశంలో కౌమార దశలో అధిక శాతం బాలికలు బరువు తక్కువగా ఉన్నారని ఒక అంచనా. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. సరైన ఆహారాన్ని అందించకపోవడం, ఆరోగ్య సమస్యలు వంటి ఇబ్బందులతో ఈసమస్య ఏర్పడుతోంది. లింగనిర్థారణ పరీక్షలపై నిషేధం ఉన్నా ఆచరణలో చాలావరకు అమలు కావడంలేదు. ఇది భ్రూణ హత్యలకు కారణమౌతోంది. బాలికలపై జరుగుతున్న హింసతో ప్రపంచంలో ప్రతి 10 నిమిషాలకు ఏదో ఒకచోట మరణాలు సంభవిస్తునే ఉన్నాయి. ప్రపంచంలో 36 మిలియన్ల మంది బాలికలు పాఠశాల విద్యను అందుకోలేకపోతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. 18 ఏళ్లలోపు వారికి వివాహాలు జరుగుతున్నాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.కరోనా కాలం లో  బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయని
యునెస్కో నివేదిక తెలుపుతుంది.

కిశోరీ బాలికలని స్వశక్తివంతులుగా తీర్చిదిద్దడానికి విద్య ప్రధానమైన ఆయుధం. దీనవల్ల సామాజికంగా వెనుకపడిన నిరక్షరాస్యుల కుటుంబాల్లోంచి అనేక మంది ఉన్నతులు తయారౌతారు. తమపై జరిగే హింసను, దాడులను తిప్పికొడతారు. కిశోరీ బాలికలకు సాంకేతిక, వృత్తి విద్యా అవకాశాలు కల్పించాలి. శిక్షణ ఇవ్వాలి. తమ జీవితాన్ని తాము ముందుకు తీసుకెళ్లేలా వృత్తి, జీవన నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం, సామాజిక, ఆర్థిక, ఆరోగ్య, రాజకీయ అంశాలపై అవగాహన పెంచాలి. తమను తాము రక్షించుకునే భద్రత, సాంకేతిక విజ్ఞానాన్ని సేవల్ని అందుబాటులో ఉంచాలి. బాలురతో సమానంగా సరైన వనరులు, విద్యను అందించాలి.వారికి ఆర్ధిక సహకారాన్ని అందించాలి.మహిళా దినోత్సవానికి ఇచ్చిన ప్రాధాన్యత బాలికా దినోత్సవానికి కూడా ఇవ్వాలి

జనవిజ్ఞానవేదిక
తిరువూరు
9492712836

Tuesday, 5 October 2021

జాతి నిర్మాత ఉపాధ్యాయుడు :: యం.రాం ప్రదీప్


"ఉపాధ్యాయులు ఒక జాతిని నిర్మిస్తారు"అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.ఒక విశాలమైన ప్రదేశంలో నివశించే
విభిన్న వర్గాల ప్రజల సమూహాన్నే ఒక జాతి అంటారు.అంటే ఉపాధ్యాయులు భిన్న వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తారు.వారు విద్యార్థులలో
సోదరభావం, ఐక్యత, జాతీయ సమగ్రత వంటి అంశాలు నేర్పితేనే ఒక జాతి పటిష్టంగా ఉంటుంది. ప్రతి ఏడాది అక్టోబర్ 5న ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుతారు.100 దేశాల్లో ఈ
దినోత్సవం జరుపుతారు.2021 లో 'టీచర్స్ ఎట్ ది హార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రికవరీ'అనే థీమ్ తో ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవంని నిర్వహిస్తున్నారు.కోవిడ్ కాలం లో విద్యార్థులు నెలల తరబడి
పాఠశాలలకు దూరంగా ఉన్నారు.ప్రపంచ వ్యాప్తంగా ఇదే తరహా పరిస్థితి నెలకొంది. కోవిడ్ ప్రభావం పేద విద్యార్థులపై అధికంగా పడింది.ఇంకా పూర్తి స్థాయిలో
విద్యాలయాలు ప్రారంభం కాని
పరిస్థితి నెలకొంది.ఇప్పుడు
చదువుకు దూరమైన విద్యార్థులని గాడిలో పెట్టే
బృహత్తర కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

సమాజంలో ఎన్ని వర్గాలయితే ఉంటాయో, పాఠశాలలో కూడా అన్ని రకాల మనస్తత్వాలు గల విద్యార్థులు వుంటారు.అందుకే 
పాఠశాలని ఒక సమాజం అనవచ్చు.

ఒకప్పుడు ఉపాధ్యాయుడిని బతకలేక బడి పంతులనేవారు.ఆరోజుల్లో వారికి జీతాలు తక్కువగా ఉండేవి.ఉపాధ్యాయుల కొచ్చే
జీతాల కంటే వ్యవసాయం ద్వారా ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి ఉండేది. ఉపాధ్యాయుడు గ్రామానికి కేంద్రంగా ఉండేవాడు.స్థానికంగా నివశించేవాడు.పంచాంగం తానే చూసేవాడు.వైద్యం తానే చేసేవాడు.

అనేక ఉద్యమాలు చేపట్టిన తర్వాత ఈ రోజు ఉపాధ్యాయులకి జీతాలు పెరిగాయి.పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించబడ్డాయి.ఇప్పుడు ఉపాధ్యాయుడిని బతక నేర్చిన
బడిపంతులని అంటున్నారు.పెరిగిన జీతంతో
పాటు వారికి బాధ్యతలు కూడా పెరిగాయి.ఎన్నికల విధులు,జనాభా లెక్కలు వారికెప్పుడూ ఉంటాయి.ఇవి
గాకుండా ప్రభుత్వాలు విద్యార్థుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. ఉపాధ్యాయుల ద్వారా ఈ పథకాలు విజయవంతంగా అమలుచేయబడుతున్నాయి.

ఆధునిక కాలంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినప్పటికీ ఉపాధ్యాయుల స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు.విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య అనుబంధం బలంగా ఉంటేనే విద్యార్థులలో అసలైన వికాసం జరుగుతుంది. నేటి విద్యార్థి రేపటి పౌరుడు అవుతాడు. ఏ వృత్తి వారైనా పాఠశాల నుంచి రావాల్సిందే. ఉపాధ్యాయుల దగ్గర శిక్షణ పొందాల్సిందే.కరోనా కాలంలో
ప్రత్యక్ష బోధనకు అవకాశం లేక
విద్యార్థులు ఎలా ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నాము.

కార్పొరేట్ పాఠశాలలని మినహాయిస్తే చాలా ప్రయివేటు
పాఠశాలల యజమానులు తాము ఉపాధి పొందుతూ, మరికొంతమందికి జీవనోపాధి కల్పిస్తున్నారు.కరోనా ప్రయివేటు ఉపాధ్యాయులని కాటు వేసింది. వారికి ఉపాధి లేకుండా చేసింది.వారిని ఆదుకోవాల్సి ఉంది.

ప్రభుత్వాలు విద్యా రంగాన్ని పటిష్ట పర్చాలి.దేశంలో విద్యాభివృద్ధికి పాలకులు ఏమి చేయాలో
పలు కమిటీలు సూచనలు చేశాయి. ఒక బలమైన సమాజం ఉండాలంటే విద్యా వ్యవస్థ పటిష్టంగా ఉండాలి.విద్యకు కేంద్రం పాఠశాలే కాబట్టి ,పాలకులు విద్యాలయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి.
ఉపాధ్యాయులని బోధనకే పరిమితము చేయాలి. సరైన బోధనతోనే విద్యార్థులు పరిశోధన చేసే స్థాయికి చేరుకుంటారు.

పాఠ్య పుస్తకాలు విద్యార్థులలో శాస్త్రీయ ఆలోచనలు  పెంచే విధంగా  ఉండాలి.అప్పుడే వారు పరిశోధనా రంగంవైపు ఆసక్తిని
ప్రదర్శిస్తారు.సావిత్రి బాయి పూలే,జ్యోతిరావు పూలే, షేక్ ఫాతిమా బేగం,సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి 
మహనీయుల కృషితో దేశంలో
విద్యా పునాదులు ఏర్పడ్డాయి.
విద్య సమానత్వాన్ని నేర్పాలి. అందరికీ సమాన అవకాశాలని కల్పించాలి.ఇందుకు ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనది.మంచి ఉపాధ్యాయులని ప్రోత్సహిస్తూనే, బద్దకించే ఉపాధ్యాయులని పాలకులు
హెచ్చరిస్తూ ఉండాలి.ఎప్పటికప్పుడు ఉపాధ్యాయ నియామకాలని చేపట్టాలి.ఉపాధ్యాయులని
సముచితంగా గౌరవించాలి. పాలకులు వారిని గౌరవిస్తే,దేశాన్ని గౌరవించే బలమైన జాతి ఆవిర్భవిస్తుంది.
అప్పుడే సమాజం పటిష్టంగా ఉంటుంది.

యం. రాం ప్రదీప్
తిరువూరు
అక్టోబర్ 5 -ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం

Saturday, 2 October 2021

JVV Podili Division ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన సదస్సు :: Govt.Boys HighSchool, Podili

పర్యావరణ పరిరక్షణపై పదవ తరగతి విద్యార్థులకు అవగాహన సదస్సు Govt Boys High School PODILI   JVV పొదిలి డివిజన్

Tuesday, 28 September 2021

World Rabbits Day on Sep 28 on eve of death anniversary of LOUIS PASTEUR

https://www.facebook.com/groups/264730900337451/permalink/2420391718104681/

World Rabies Day is held every year on September 28. This date was chosen as it is the anniversary of the death of LOUIS PASTEUR – THE FIRST PERSON TO SUCCESSFULLY CREATE A VACCINE AGAINST RABIES.

The global COVID-19 pandemic has raised many doubts and misconceptions about VACCINATION in general. For RABIES, this is nothing new, as fears and misconceptions about the disease dates back hundreds of years. 

FAKE NEWS will negatively affect the RABIES elimination efforts. FACTS are the only way to beat fake news, so help to SHARE ACCURATE FACTS about rabies control.  

We need to dispel the myths about VACCINE HESITANCY and the MISCONCEPTIONS.   

Rabies is a Vaccine-preventable Viral Disease. Dogs are the source of the vast majority of human rabies transmission and deaths. 

Calling for effective Mass Dog Vaccination, instead of ineffective Dog Culling.

Vaccinate your pet. Act now !

Let us use facts to raise awareness and educate others about rabies – a 99% FATAL, yet 100% PREVENTABLE DISEASE.

Let us work together to Spread FACTS, and not FEAR, this World Rabies Day !

Let's achieve our goal of “Zero Human Rabies Deaths by 2030.”

#WorldRabiesDay

జాషువా జయంతి సందర్భంగా సెమినార్ :: JVV, ప్రొద్దుటూరు


ఈరోజు జాషువా జయంతి సందర్భంగా జన విజ్ఞాన వేదిక ప్రొద్దుటూరు ఆఫీసులో జాషువా జీవితం పై సెమినార్ను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక  కడప జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ రంగనాయకులు గారు పాల్గొని జాషువా తన జీవితంలో   అణగారిన వర్గాల స్వతంత్రం కోసం ఎంతో కృషి   చేశారని తెలియజేశారు జాషువా గారు భారతీయ సమాజాన్ని సాహిత్యంగా ప్రజాస్వామికంగా స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం  మూడు సూత్రాల మీద సమాజం  ఏర్పడాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జాషువా  రాసిన గిజిగాడు గబ్బిలం కావ్యాల సారాంశాన్ని తెలియజేశారు జాషువా జయంతిని పురస్కరించుకొని  కరపత్రాలను విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షులు ప్రకాష్ గారు  పట్టణ ప్రధాన కార్యదర్శి నంగా రాజేష్ గారు పొద్దుటూరు జనవిజ్ఞాన వేదిక నాయకులు మురళి  ఉత్తం రెడ్డి చంద్రశేఖర్ మధుగారు మొదలగు వారు పాల్గొన్నారు

మండే నిప్పు కణిక "భగత్ సింగ్" :: ఎం. రాంప్రదీప్, జన విజ్ఞాన వేదిక

Today's 'Prajapaksham' daily... 

తాత్విక ప్రయాణికుడు గుర్రం జాషువా ౼ రాచపాళెం చంద్రశేఖరరెడ్డి :: విశాలాంధ్ర దినపత్రిక నుండి సేకరణ


‘‘కవినిగన్నతల్లి గర్భంబు ధన్యంబు’’ గుర్రం జాషువ (18951971) జన్మించి 126ఏళ్లు, మరణించి 50ఏళ్లు పూర్తయ్యాయి. జీవించిన డబ్బైఆరేళ్లలో 50ఏళ్లు రచనా జీవితం గడిపారు. ఆయన రచనా జీవితం ఒక గొప్ప ప్రయాణం. ‘‘హిమధామార్కధర పరిణయము’’ (1917) మొదలైన ఆయన రచనా ప్రస్థానం‘‘తన వీలునామా’’ (1968) తో ముగిసింది. ఈ మధ్యకాలంలో ఆయన దాదాపు 36 రచనలు చేశారు. 

ఆయన రచనలలో నవల, నాటికలు, కొన్ని సినిమా రచనలు ఉన్నా, ఆయన ప్రధానంగా కవి. తాను కవినన్న స్పృహ ఆయనలో బలంగా ఉంది. సంఘసంస్కరణ, స్వాతంత్య్ర సమరకాలంలో కవిగా పుట్టుకొచ్చిన జాషువ మొదట 191725 మధ్య కొన్ని పౌరాణిక కావ్యాలు రాశారు. భారతీయ సమాజంలో ఇరవయ్యవ శతాబ్దం తొలినాళ్లలో కవులుగా ఎదిగొచ్చిన వాళ్లంతా మొదట పౌరాణిక రచనలే చేశారు. 

1926లో ‘శివాజి’ కావ్యరచనతో జాషువ ఆధునిక మార్గంలోకి ప్రవేశించారు. అక్కడి నుంచి తిరిగి చూడకుండా సామాజిక కావ్యాలే రాశారు. పిరదౌసి (1932) ముంతాజమహలు (1943) క్రీస్తు చరిత్ర (1963)వంటి చారిత్రక పౌరాణిక కావ్యాలు పోగా తక్కినవన్నీ సాంఘిక కావ్యాలే. స్వప్న కథ, అనాథ (1934) గబ్బిలం (1941, 1946) కాందిశీకుడు (1945) నేతాజీ (1947) బాపూజీ (1948) అశ్రుమంజరి (1948) స్వయంవరం (1950) రాష్ట్ర పూజ (1953) కొత్తలోకము (1967) నా కథ (1962) ముసాఫరులు (1963) నాగార్జున సాగర్‌ (1966) వంటి బలమైన కావ్యాలతో ఆధునిక తెలుగు కవిత్వానికి జవజీవాలు అందించారు జాషువ. 

వీటికి తోడు 1937` 1945 మధ్య ఏడు సంపుటాలతో 200లకు పైగా కవిత్వ ఖండికలు విభిన్న సందర్భాలలో రచించారు. ఆయన కావ్యాలన్నీ ఒక ఎత్తయితే, ఈ ఖండికలు మరో ఎత్తు.
జాషువ కవిత్వం ఆకలి ముప్పైల నుండి, నియమోల్లంఘనోద్యమం నుండి శ్రీకాకుళం గిరిజన పోరాటం దాకా ఉన్న సామాజిక చరిత్రను కవిత్వ రూపంలో ఆవిష్కరిస్తుంది. 

సామాజిక పరిణామాల నేపథ్యంలో జాషువ కవిత్వం చదివితే ఆయన కవిత్వానికుండే సామాజిక స్వభావం తెలుస్తుంది. మొదట్లో జాషువ తాత్వికంగా ఆస్తికుడే. దైవ విశ్వాసం బలంగా ఉండేది. అందుకే పురాణ కథలు కావ్యాలుగా రాశారు. అంతేకాదు సాంఘిక కావ్యాలలో కూడా ఆ విశ్వాసాన్ని ప్రకటించారు. ‘అనాథ’ అనే తొలి తెలుగు దళిత మహిళా కావ్యంలో ‘‘నలువసేయు విలాసము’’ ప్రస్తావన చేశారు. దళిత బిచ్చగత్తె చంకలో బిడ్డను పెట్టుకొని అడుక్కుంటూ ఉంటే, ఎవరో సైకిలుతో గుద్దుతారు. తల్లీబిడ్డ కిందపడతారు. బిడ్డకు దెబ్బలు తగలవు. తల్లికి గాయాలవుతాయి. 

అప్పుడు కవి
ఓయి! నాస్తికుడా! విను మొక్కమాట
అరసియుందువు ఘోర దృశ్యంబు నిచట
మృత్యుదేవత కోఱలు మెఱయునపుడు
శిశువునే మహాశక్తి రక్షించెనోయి
అని నాస్తికులను ప్రశ్నించారు. ‘‘పరమేశు విలాసమ్ములు కరముదు రుహ్యములు’’ అన్నారు.

పరమేశ్వరుడు లేడా
నరుండు నరునుద్దరించునా! వెఱిదానా!
అని చెప్పించారు. జాషువలో ప్రశ్నించే గుణం మొదట నుంచీ ఉన్నా, దానితో పాటు ఆధ్యాత్మిక విశ్వాసం చాలాకాలం ఆయనను నడిపించింది. 

‘గబ్బిలం’ లో అస్పృశ్యతను ఖండిస్తూనే, గబ్బిలంతో సందేశాన్ని శివునికి పంపించడం ఇందుకు నిదర్శనం. ‘గబ్బిలం’ లో కర్మ సిద్ధాంతాన్ని నిలదీసినా శివుని నిందించలేదు. గబ్బిలంతో
వెఱవనేల నీకు విశ్వనాథుమ్రోల
సృష్టికర్త తాను, సృష్టి వీవు
అని అనటంలోనూ ఈ లక్షణమే కనిపిస్తుంది.

గబ్బిలం రెండవ భాగంలో జాషువలో తాత్వికంగా వచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ‘‘ఏనాడు మా బుఱ్ఱలు, జుట్టుతల లేని పుక్కిట కథలలో జిక్కువడవొ అని మార్పును కోరుకున్నారు. ‘‘నరుని కష్టపెట్టి నారాయణుని కొల్చే వింత ధర్మాన్ని ప్రశ్నించారు. హిందుత్వంలోని అసంబద్ధతను ప్రశ్నిస్తున్న జాషువకు ఏసుక్రీస్తులో విశ్వాసం సన్నగిల్లలేదు. 

గబ్బిలం రెండవ భాగం రాసే నాటికే (1946) జాషువలో తాత్వికంగా మార్పు వచ్చి దైవ అవతార సిద్ధాంతాన్ని అధిక్షేపించారు.ఇక ఇక్కడ నుంచి అవకాశం వచ్చినప్పుడంతా దాదాపు రెండు దశాబ్దాలు ఈ ప్రశ్నించే తాత్వికతను జాషువ కొనసాగించారు.

‘‘కాందిశీకుడు’’ కావ్యం రెండో ప్రపంచ యుద్ధ కావ్యంలో జాషువ రాసిన కావ్యం. యుద్ధ కాలంలో బర్మా నుంచి బయటికి వచ్చిన ఒక సైనికునికి, ఒక బౌద్ధ కపాలానికి మధ్య జరిగిన సంభాషణ ఈ కావ్యం. ఈ బౌద్ధ కపాలాన్ని ఎన్నుకోవడంలోనే జాషువ తాత్విక పరిపక్వత కనిపిస్తుంది. బౌద్ధం మానవ ధర్మం కావడమే ఇందుకు కారణం.
స్వర్గనరకాలు రెండు నీ జగతి యందె
నరుడు సృష్టింపగలడని నమ్మగలను
అని మానవుని చరిత్ర నిర్మాతగా ప్రతిపాదించింది బౌద్ధ కపాలం.

‘నేతాజీ కావ్యం’ లో సుభాస్‌చంద్రబోస్‌కు కనిపించిన భరతమాత దేశంలోని వర్తమాన పరిస్థితుల పట్ల విచారం వ్యక్తం చేస్తుంది. ఆ సందర్భంలో విగ్రహాల రూపంలో దేవుళ్ల కిచ్చిన ప్రాధాన్యం కంటికి కనిపించే మనుషులకు ఇవ్వకపోవడాన్ని ఆమె ప్రస్తావిస్తుంది.

గాంధీజీ హత్య జరిగినప్పుడు, జాషువ తీవ్రంగా వేదనపడ్డారు. శోకించారు. ఆ బాధలో
భరతభూమినింక భగవంతుడుండునా
దేవళంబు లుత్త తిత్తులయ్యె
అని ఆక్రోశించారు. ఇది ఉద్వేగభరిత, బాధాతప్త ఉద్వేగమేగానీ తాత్వికంగా తిరుగుబాట పట్టడం కాదు. ఈ కావ్యంలోనే మతం పేరు జరిగే అమానవ కర్మకాండను జాషువ విమర్శించి తన భౌతిక తాత్వికతను చాటుకున్నారు.

గుళ్లు గోపురాల కొఱకు చందాలెత్తి
పొట్టబోసికొనుట పుణ్యమగునె
అన్నమునకు నీటి కంటు జాడ్యంబున్న
చుప్పనాతి మతము గొప్పదగునె
అని ప్రశ్నించారు. 

మానవ ముఖం కోల్పోయిన ఏ అంశాన్నీ జాషువ ఉపేక్షించకుండా విమర్శించారు. ఈ ధోరణి జాషువ తాత్వికతా ప్రయాణంలో క్రమంగా బలపడింది.

భారతదేశం అస్పృశ్యతా జాడ్యం మీద అవకాశం వచ్చినప్పుడంతా జాషువ అస్పృశ్యతకు తాత్వికంగా మతానికీ ఉన్న సంబంధాన్ని ప్రస్తావించి విమర్శిస్తూ వచ్చారు! ‘బాపూజీ’ కావ్యంలోనూ ఈ పని చేశారు.
దళకోటి పంచముల దు
ర్దశకై కన్నీటి చుక్కరాల్పని వేల్పులో
దశలక్షవేల? వెన్నుని
దశావతారంబు లేల? ధర్మములేలా?
ఈ ప్రశ్నలో జాషువ కంఠస్వరం,దానిలో దాగిన ఆయన తాత్వికతా పరిణతి ప్రస్ఫుటంగా ధ్వనిస్తున్నాయి. 

1957నాటి ‘కొత్తలోకము’ కావ్యం రాసేనాటికి జాషువకు 60ఏళ్లు దాటాయి. అనేక సామాజిక ఉద్యమాలను ఆయన చూశారు. అంబేద్కర్‌ ఉద్యమాన్ని చూశారు. మానవ ధర్మమైన బౌద్ధాన్ని అంబేద్కర్‌ స్వీకరించడమూ గమనించారు. ‘‘కొత్త లోకము’’ ‘‘తొలికోర్కె’’ లో దేవుని అనేక రకాలుగా ప్రశ్నించారు. ‘‘కనుపడవేమిర జగము కల్పన చేసిన గారడీడ’’ అని అధిక్షేపించారు. దేవుడు ఉన్నది నిజమైతే తనకు కనపడమని డిమాండ్‌ చేశారు. దేవుని సృష్టిగా ప్రచారంలో ఉన్న వ్యవస్థను విమర్శించారు.

భగవంతుడు ఉన్నాడని నమ్మే భక్తులు తనువులు కోసి వేడి నెత్తురుతో అనాదిగా అర్చనలు చేస్తుంటే దర్శనం ఇవ్వనివాడు ‘‘నిన్నసలుసందేహించుచుక నమ్మిన నమ్మని మా బోంట్లను లెక్కసేయుదువె’’ అని అన్నారు. 

జాషువ కాంగ్రెస్‌ పాలనలో ఉంటూ, గాంధీజీని స్మరిస్తూ ఉన్నా ఆయన తాత్వికత క్రమక్రమంగా పదునెక్కింది. అది భౌతికవాద తాత్వికత. తన కాలంనాటి తెలంగాణ రైతాంగ సాయుధపోరాటాన్ని చూశారు. కమ్యూనిస్టులు నిర్వహించిన అనేక ఉద్యమాలను గమనించారు. ‘‘కొత్తలోకము’’ కావ్యంలో వామపక్ష ప్రశంస చేయడానికి ఆయన సంకోచించలేదు.

నాస్తికుల సామ్యవాదుల
మస్తిష్కము నందు పతిత మానవతతికిన్‌
గాస్త జగా కలదేమో
నాస్తి సుమి కరుణకేది కాలం గృతులన్‌
మరణించే నాటికి జాషువ పూర్తిగా భౌతికవాది అయ్యారని ఆయన అల్లుడు లవణంగారు ఒకసారి నాతో అన్నారు. 

జాషువ ఒక తాత్విక ప్రయాణికుడు. భావవాదం నుండి భౌతికవాదం వైపు ఆయన ప్రయాణించారు. కవిత్వాన్ని తన తాత్విక ప్రయాణానికి వాహికగా చేసుకున్నారు. భౌతికవాదులుగా ఉండి జీవిత అవసాన దశలో భావవాదులుగా మారిన రచయితలు తెలుగులో కొందరున్నారు. జాషువ దానికి భిన్నమైన కవి. ఆయన ప్రయాణం శాస్త్రీయమైది

నవయుగ కవి చక్రవర్తి శ్రీ గుర్రం జాషువా జయంతి సెప్టెంబరు 28 సందర్భంగా :: ప్రజాశక్తి వ్యాసం "తెలుగు భాషపై జాషువా మక్కువ"

కవి కోకిల, కవితా విశారద, కవి దిగ్గజ, మధుర శ్రీనాధ. నవయుగ కవి చక్రవర్తి. విశ్వకవి సామ్రాట్ , పద్మభూషణ్
*శ్రీ గుర్రం జాషువ*
జయంతి వేడుకలు ప్రతి పాఠశాల లో జరగాలి ఆయన కలం గొప్పదనం ప్రతి విద్యార్థి కి తెలియాలి...

మీ
కొలగాని వరప్రసాద్