Tuesday, 28 December 2021

సూక్ష్మజీవుల పరిశోధనల దిట్ట "లూయీ పాశ్చర్‌" జయంతి Dec 27



#నిజజీవిత సమస్యల సుడిగుండాలలో చిక్కుకున్నప్పుడు మానవ మేధస్సులో ఆ సమస్యలకు తగిన పరిష్కారం కనుగొనేందుకు వీలైన ఆలోచనలు, ఆవిష్కరణలు ఉద్భవిస్తుంటాయి. ఆ ఆవిష్కరణలు కొంతమంది మహామహుల విశేష కృషి వల్ల వెలుగులోకి వచ్చి అదే సమస్యలతో బాధపడుతున్న ఎంతోమంది జీవితాలలో ఆ గ్రహణం వీడి వెలుగులు నింపడానికి దోహదపడుతుంది. అటువంటి సమస్యల పరిష్కారానికి సరికొత్త నిర్దేశాలను నిర్వచించడానికి తమ జీవితాన్ని అంకితం చేశిన 'ఆదర్శమూర్తి, ఆంత్రాక్స్, రబీస్ తదితర వ్యాధులకు మందులను కనిపెట్టడంలో మూలపురుషుడై అవిరళ కృషి సల్పిన సూక్ష్మజీవ శాస్త్రవేత్త లూయీ పాశ్చర్.
వ్యాధులకు కారణం సూక్ష్మక్రిములని కనుగొని రోగ నివారణకు పాశ్చర్ బాటలు వేశారు. టీకాల ఆవిష్కారానికి ఇతడు ఆద్యుడు. మొదటిసారిగా రేబీస్ వ్యాధి కోసం టీకాను తయారుచేశాడు.

చాలా మందికి ఇతడు పాలు ద్వారా వ్యాపించే వ్యాధులను అరికట్టే పద్ధతిని ప్రవేశపెట్టిన వ్యక్తిగా సుపరిచితులు. ఈ పద్ధతిని నేడు #పాశ్చరైజేషన్ అంటారు.
ఫ్రాన్స్‌ రాజు మూడవ నెపోలియన్‌ కోరికపై ద్రాక్షసారాయి చెడి పోవడానికి కారణాలు, నివారణ చర్యలు కని పట్టారు.కేవలం 55 సెంటీగ్రేడు ఉష్ణం వరకు పదార్థాలను వేడిచేసి, వెంటనే చల్లారిస్తే మధ్యం చెడిపోదని ప్రయోగ పూర్వకంగా కని పెట్టరు. దీనినే పాశ్చరైజోషన్‌ అంటారు.

1822, డిసెంబర్ 27న ఫ్రాన్స్ దేశంలోని డోల్ ప్రాంతంలో జన్మించిన లూయీ పాశ్చర్ తన చిన్నతనంలో డ్రాయింగ్ మరియు పెయింటింగ్ మీద ఎక్కువ ఆసక్తి కనపరిచేవారు. కానీ శాస్త్రీయ సంబంధిత అంశాల గురించి, వాటి విశ్లేషణల గురించిన సందేహాలను నివృతి చేసుకునేందుకు ఎంతో కుతూహలం చూపేవారు. అసలు అందరూ తాగే వైన్ ద్రాక్ష పళ్ళనుండి ఎట్లా తయారుచేస్తారు? పాలు తోడుకొని పెరుగు ఎట్లవుతుంది? ఇటువంటి ఆలోచనలు తనను ఎప్పుడూ వేధిస్తూనే ఉండేవి. స్వతహాగా గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ విద్యార్ధి అయినను ఎప్పుడూ అతి తక్కువ మార్కులతో పాస్ అవడం జరిగేది. అందుకు కారణం ఆయన ఆలోచనా ప్రవాహ విధానం. అదే ఆ తరువాత Pasteurization (క్రిమిదూరీకరణం, శుద్ధి) అనే గొప్ప ప్రక్రియను కనుగొనడానికి దోహదపడింది. తద్వారా నేడు ప్రపంచంలో అతి పెద్ద పరిశ్రమ అయిన వైన్ ఇండస్ట్రీ లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి.

1849 వ సంవత్సవరం లో #స్ట్రాస్బౌర్గ్ (Strasbourg) విశ్వవిద్యాలయం లో రసాయన శాస్త్ర ప్రొఫెసర్ అయ్యారు. అక్కడ ఆయన సేంద్రీయ సంయోగం (organic synthesis) ద్వారా స్ఫటిక విన్యాసాలకి (crystal structure) సంబంధించి ఎన్నో ముఖ్యమైన ఆవిష్కరణలు చేసారు.

బాక్టీరియా వల్లా మరియు ఇతర సూక్ష్మ జీవుల వల్లా వ్యాధులు ఎలా సంభవిస్తాయి అన్న విషయం 19 వ శతాబ్దంలో ఒక రహస్యం గా ఉండేది. అప్పట్లో చాలా మంది కేవలం గాలి సోకడం వల్ల అంటువ్యాధులు వస్తాయని నమ్మేవారు. గాలిలో రోగకారక క్రిములని మోసుకొచ్చే వస్తువుల వల్ల అంటువ్యాధులు కలుగుతాయని అప్పుడు ఎవరికీ తెలీదు.

పాశ్చర్ కొన్ని #అద్భుత ప్రయోగాలు చేసి సూక్ష్మ జీవులు ఒకదాన్నుండి ఒకటి పుడతాయని, గాల్లోంచి ఊడిపడవని నిరూపించాడు. ఆయన ప్రతిపాదించిన రోగకారక క్రిమి సిద్ధాంతం (Germ theory of disease) వైద్య శాస్త్రంలో ఒక విప్లవాత్మకమైన భావనగా చెప్పుకోవచ్చు. అంతేకాక ఆయన వ్యాధి యొక్క వ్యాప్తిని అరికట్టేందుకు ఆస్పత్రులలో చేతులు కడుక్కోవడం వంటి పరిశుభ్రతా పరమైన పద్ధతులు ప్రవేశపెట్టారు. పాశ్చర్ అత్యంత సునిశితమైన, క్రమబధ్ధమైన ప్రయోగాలు చేసి ఎన్నో ప్రమాదకరమైన సూక్ష్మజీవులను కనుగొన్నారు. ఆ సూక్ష్మజీవులని అరికట్టే వాక్సీన్ లు రూపొందించి మనుషులనే కాక, జంతువులను కూడా ఎన్నో భయంకరమైన వ్యాధుల నుంచి కాపాడారు.

#జీవం నుంచి జీవం :

ఈ ద్రాక్ష చుట్టూ ఉన్న చిన్న సహజ పదార్థాలు(Yeasts) వాటి ఏక కణ శిలీంధ్రాల (single-celled fungi) నుంచి పెరుగుతాయి. ఇటువంటి సూక్ష్మజీవులు, పరిసరాలలో అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు వాటంతట అవే పుట్టుకు వస్తాయని ఒక సిద్ధాంతంగా(spontaneous generation) అప్పట్లో ప్రజలు భావించేవారు. పాశ్చర్ తన ప్రయోగాలను ఉపయోగించి ఈ సూక్ష్మజీవులు వాస్తవానికి ఇతర సూక్ష్మజీవుల నుండి ఉత్పత్తి అవుతాయని, ఊరికే గాలిలోంచి ఊడిపడవని నిరూపించారు.

#ఆరోగ్యకరమైన పాలు:

పాలు అమ్మకానికి వెళ్ళే ముందు, వాటిలో ఉండే హానికరమైన జీవుల సంఖ్య (బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాలు వంటివి) తగ్గించేందుకు, ఒక నిర్ణీత సమయం సేపు, ఒక నిర్దిష్టమైన ఉష్ణోగ్రత వద్ద వేడి చెయ్యాలి. పాశ్చర్ 1860 లో మొదట పులిసిపోయిన వైన్ ని శుధ్ధి చెయ్యడానికి ఈ పద్దతిని ఉపయోగించారు. ఆ తర్వాత నుంచి ఈ పద్దతిని పాశ్చరైజేషన్ ("Pasteurization") అన్నారు.

#మద్యాన్ని పులియబెట్టే పద్ధతిని #మెరుగుపరచడం(Improving fermentation of Alcohol):

ఫ్రాన్స్ లో వైన్ మరియు బీర్ పరిశ్రమలలో ఎన్నో సందర్భాలలో మద్యం అతిగా పులిసిపోవడం వల్ల దాన్ని పారబోయాల్సి వచ్చేది. ఈ దుష్పరిణామాన్ని అడ్డుకోడానికి ఏదైనా చెయ్యమని ఆ పరిశ్రమల వారు పాశ్చర్ ని కోరారు. పాశ్చర్ తన పరిశోధనల ద్వార పులిసిన వైన్ లోను, మంచి వైన్ లోను ఉండే ఈస్ట్ (yeast ) కణాల మధ్య ఆకారంలో తేడా ఉందని కనుక్కునారు. ఆక్సిజన్ రహితంగా కిణ్వన ప్రక్రియ (fermentation process) జరుగుతున్నప్పటికీ, అందులో వున్న ఈస్ట్ (yeast) వల్ల మద్యం ఉత్పత్తి జరుగుతుంది అని కనుక్కున్నారు. సరైన ఈస్ట్ (yeast ) ను ఉపయోగించడం వల్ల, 122F (55C) ఉష్ణోగ్రత వరకు వేడి చేసి అనర్థకరమైన ఇతర సూక్ష్మజీవులను ఆ ద్రవం నుంచి తొలగించడం వల్ల వైన్ పులియకుండా అరికట్టవచ్చని కనుక్కున్నారు.

#పట్టు పరిశ్రమను కాపాడుట:

దక్షిణ-పశ్చిమ ఫ్రాన్స్ పట్టుపరిశ్రమలకి ఆలవాలం. అలంకార ప్రియులైన ఫ్రెంచ్ పౌరుల జీవనంలో ఈ పట్టు ఓ ముఖ్యభాగంగా ఉండేది. ఆ రోజుల్లో ఏదో తెలియని వ్యాధి వల్ల పట్టుకాయలు (silk coccoons) నాశనం అవుతూ ఉండేవి. కనుక 1864 లో ఫ్రెంచ్ ప్రభుత్వం, వ్యాధి వల్ల నాశనం అవుతున్న పట్టుపురుగులని రక్షించమని పాశ్చర్ ని కోరింది. స్థానికులైన పట్టు పురుగు పెంపకదార్లకి ముందు పాశ్చర్ మీద పెద్దగా నమ్మకం కలగలేదు. మైక్రోస్కోప్ పట్టుకుని బయల్దేరి వచ్చిన ఈ పెద్ద మనిషి తమకి ఏం చెయ్యగలడు అనుకున్నారు.

#పట్టుపురుగులని నాశనం చేస్తున్న సూక్ష్మజీవుల మీద పాశ్చర్ పరిశీలనలు మొదలెట్టారు. 2 సంవత్సరాల తర్వాత పాశ్చర్ రెండు రకాలైన పరాన్నజీవులు (parasites) వల్ల infection సంభవించింది అని కనుగొన్నారు. తదనంతరం వాటిని నిర్మూలించే పద్ధతిని కనిపెట్టి పాశ్చర్ పట్టుపరిశ్రమని కాపాడారు.

#అదృశ్య శత్రువులు:

ప్రాణాంతకమైన వ్యాధి ఆంత్రాక్స్ వ్యాధికి కారణం bacillius అనే కడ్డీ ఆకారంలో బాక్టీరియం. జర్మన్ వైద్యుడు రాబర్ట్ కోచ్ (Robert Koch) (1843-1910) ఆంత్రాక్స్ కి కారణమైన సూక్ష్మజీవి ఒకటుందని 1876 లో కనుక్కున్నాడు. పాశ్చర్ తన పరిశోధనలతో ఆ విషయాన్ని నిర్ధారించడమే కాక, ఆంత్రాక్స్ నివారణకి అవసరమైన వాక్సీన్ ని రూపొందించారు.

#రాబిస్ వ్యాధి:

రేబీస్ అనేది వైరస్ ల వల్ల కలిగే ఓ భయంకరమైన వ్యాధి. అది కుక్కల నుండి మనుషులకి సోకుతుంది. ఈ వైరస్ బాక్టీరియాల కన్నా అతి చిన్నదైన వస్తువు. కనుక పాశ్చర్ వాడిన సూక్ష్మదర్శినిలో ఇది కనిపించలేదు. ఆ వైరస్ వ్యాధితో కేంద్ర నాడీ వ్యవస్థ ఫై ప్రభావితం చేస్తుంది. పాశ్చర్ ఆ వ్యాధి సోకిన జంతువుల వెన్నుపాము (spinal cord) నుంచి ద్రవం సంగ్రహించి, వివిధ పద్ధతుల చేత ఆ ద్రవం యొక్క రోగతీవ్రతని క్షీణపరిచి, ఆ ద్రవాన్ని తిరిగి కుక్కల మీదకి ఎక్కించి రేబీస్ కి వాక్సీన్ ని రూపొందించారు.

#మొదటి రాబీస్ వ్యాక్సిన్:

1885,లో జోసెఫ్ మైస్టర్ అనే 9 ఏళ్ల పిల్లవాడికి మొట్టమొదటి సారిగా ఈ రేబీస్ వాక్సీన్ ని ఎక్కించి రోగాన్ని నయం చేశారు.

ఎన్నో ఏళ్ళ పాటు ఎన్నో మహమ్మారి రోగాల మీద ధ్వజం ఎత్తిన తన వ్యాధి నిర్మూలనా ప్రయత్నాలని వ్యవస్థీకరించాలనే ఉద్దేశంతో "పాశ్చర్ ఇన్స్టిట్యూట్" అనే ప్రైవేటు సంస్థకి ప్రారంభోత్సవం చేశారు.
పాశ్చర్ సుక్ష్మజీవశాస్త్రంలో అత్యుత్తమ గౌరవమని పిలిచే లీవెన్ హాక్ బహుమతిని 1895లో పొందారు.
ఆ విధంగా గొప్ప వైద్యుడిగా, శాస్త్రవేత్తగా, #దేశభక్తుడిగా ఫ్రెంచ్ వారి మనసులలో స్థిరనివాసం ఏర్పరచుకున్న పాశ్చర్ 1895 లో సెప్టెంబర్ 28 నాడు పారిస్ లో సెయింట్ క్లౌడ్ సమీపంలో చివరి శ్వాస విడిచారు.
🙏🙏🔬🔬🙏🙏
Collected by
A.Srinivasa Reddy
9912731022
Zphs Munugodu Amaravathi mandal Guntur district.

Monday, 27 December 2021

జనవరి చెకుముకి సంచిక కొరకు, Dec 30 లోపు కథ రాయండి

జన విజ్ఞాన వేదిక ప్రచురణ
*చెకుముకి* - బాలల సైన్స్ మాస పత్రిక వారి " *ఈ బొమ్మకు కథ రాయండి*" శీర్షికలో  పైబొమ్మకు
*2022 జనవరి సంచిక* కథ కొరకు విద్యార్థులకు ఆహ్వానం.

— మీ కథ A 4 సైజులో 1 - 2 పేజీలు మించరాదు.
— తెలుగు & ఆంగ్ల భాషలలో విడివిడిగా రాయచ్చు.
— ఆఖరు తేది డిసెంబరు 30.
chekumuki@gmail.com కు మీ కథను వెంటనే పంపగలరు. 

Friday, 24 December 2021

జన విజ్ఞాన వేదిక రాష్ట్ర స్థాయి చెకుముకి సైన్స్ సంబరాల కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్సీ K.S. లక్ష్మణరావు గారు

జన విజ్ఞాన వేదిక రాష్ట్ర స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు వచ్చే జనవరి 8, 9 తేదీల్లో గుంటూరులోని పాటిబండ్ల సీతారామయ్య హై స్కూల్ లో నిర్వహిస్తున్నట్లుగా ఎమ్మెల్సీ కే.ఎస్. లక్ష్మణరావు గారు తెలిపారు గుంటూరులోని యు.టి.ఎఫ్. కార్యాలయంలో చెకుముకి సైన్స్ సంబరాల కరపత్రాన్ని శనివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మణ రావు గారు మాట్లాడుతూ విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథాన్ని, ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించడానికి గత 30 ఏళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరారు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాజశేఖర్ రాహుల్, మురళీధర్ లు మాట్లాడుతూ ఇప్పటికే పాఠశాల స్థాయిలో నిర్వహించిన పోటీల్లో నాలుగున్నర లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. వారికి జిల్లా స్థాయి పోటీలు నిర్వహించి విజేతలను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్టుగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల నుండి 52 బృందాలు ఈ చెకుముకి సంబరాల్లో పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే సంబరాలలో  క్విజ్, శాస్త్రవేత్తల తో ముఖాముఖి, సైన్స్ ప్రయోగాలు ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు త్రిమూర్తులు రెడ్డి, శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Monday, 13 December 2021

జన విజ్ఞాన వేదిక రాష్ట్ర స్థాయి చెకుముకి సైన్స్ సంబరాల కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్సీ K.S. లక్ష్మణరావు గారు

జన విజ్ఞాన వేదిక రాష్ట్ర స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు వచ్చే *జనవరి 8, 9* తేదీల్లో *గుంటూరులోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్* లో నిర్వహిస్తున్నట్లుగా ఎమ్మెల్సీ కే.ఎస్. లక్ష్మణరావు గారు తెలిపారు గుంటూరులోని యు.టి.ఎఫ్. కార్యాలయంలో *చెకుముకి సైన్స్ సంబరాల కరపత్రాన్ని* శనివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మణ రావు గారు మాట్లాడుతూ విద్యార్థులలో *శాస్త్రీయ దృక్పథాన్ని, ప్రశ్నించే తత్వాన్ని* పెంపొందించడానికి గత 30 ఏళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరారు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాజశేఖర్ రాహుల్, మురళీధర్ లు మాట్లాడుతూ ఇప్పటికే పాఠశాల స్థాయిలో నిర్వహించిన పోటీల్లో *నాలుగున్నర లక్షల మంది విద్యార్థులు* పాల్గొన్నారని తెలిపారు. వారికి జిల్లా స్థాయి పోటీలు నిర్వహించి విజేతలను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్టుగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లోని *13 జిల్లాల నుండి 52 బృందాలు* ఈ చెకుముకి సంబరాల్లో పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే సంబరాలలో  *క్విజ్, శాస్త్రవేత్తల తో ముఖాముఖి, సైన్స్ ప్రయోగాలు* ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు త్రిమూర్తులు రెడ్డి, శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

వేమన పద్యాలను వెలుగులోకితెచ్చిన మహనీయుడు సిపి బ్రౌన్ వర్ధంతి నేడు(నిర్యాణం 12.12.1884) :: ఎం. రాం ప్రదీప్

తెలుగు వారికి ఎనలేని సేవలు అందించినసర్ ఆర్థర్ కాటన్  వంటివారితోబాటు తెలుగువారు అత్యంత  ప్రేమాభిమానాలతో  గుర్తుంచుకోవలసిన మహామనీషి బ్రౌన్ . 800 సంవత్సరాల పైగా ఘన చరిత్ర కలిగిన ఈ  తెలుగు భాష గొప్పతనాన్ని గుర్తించి సామాన్య ప్రజానీకానికి ఇంకా ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత ఒక విదేశీయునికి చెందడం ఆశ్చర్యమే అయినా ఆనందదాయకం కూడా!  

1817, ఆగస్ట్‌ 1 న ఇంగ్లండ్‌ నుంచి భారతదేశానికి ఓడ ఒకటి బయల్దేరింది. దాని పేరు కర్ణాటక్‌. వందలాది ప్రయాణికులున్నారు అందులో. ఆ వందల్లో ఓ అనామకుడు. 19 ఏళ్లవాడు. పేరు.. ఛార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌. భవిష్యత్తులో మరణశయ్యపై ఉన్న తెలుగు సాహిత్యాన్ని.. శాస్త్రీయత అనే గంగతో బతికించే సాహితీ భగీరథుడు. 'కానీ ఆ ఓడ ఎక్కేటప్పుడు అసలు 'తెలుగు' అనే మూడక్షరాల మాట విన్లేదు' అంటాడతను నిజాయతీగా. కానీ అతని జీవితం మొత్తాన్ని ఆ మూడు అక్షరాలే శాసించాయి. అతని మాటల్లో చెప్పాలంటే 'పిచ్చెక్కించాయి'. అతని వూపిరున్నంత వరకు వూడిగం చేయించుకున్నాయి!

తెలుగు సాహిత్యమునకు విశేష సేవ చేసిన ఆంగ్లేయుడు. తొలి తెలుగు శబ్దకోశమును ఈయనే పరిష్కరించి ప్రచురించాడు (నవంబర్ 10, 1798 ). బ్రౌన్ డిక్షనరీని ఇప్పటికి తెలుగులో ప్రామాణికంగా ఉపయోగిస్తారు. 

తెలుగు జాతికి సేవ చేసిన నలుగురు ఆంగ్లేయులలో ఒకరిగా బ్రౌన్ ను పరిగణిస్తారు. మిగతా ముగ్గురి పేర్లు ఆర్థర్ కాటన్, కాలిన్ మెకెంజి, థామస్ మన్రోలు. ఆంధ్ర భాషోద్ధారకుడు అని గౌరవించబడిన మహానుభావుడు. వేమన పద్యాలను సేకరించి, ప్రచురించి, ఆంగ్లంలో అనువదించి ఖండాంతర వ్యాప్తి చేశాడు.

12 డిసెంబర్‌ 1884న అవివాహితుడిగానే తన 87వ యేట లండన్‌లోనే కన్ను మూశారు. కుటుంబం - సంసారం వంటి బంధనాల్లో ఇరుక్కోకుండా స్వేచ్ఛగా తెలుగు భాషా సాహిత్యాలకు, తెలుగు ప్రజలకు తనను తాను అర్పించుకున్న మహనీయుడు ఛార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌!

డాక్టర్‌ జానుమద్ది హనుమచ్ఛాస్త్రి కడపలో బ్రౌన్‌ స్మారక గ్రంథాలయం నెలకొల్పారు. బ్రౌన్‌ జీవితం - సాహిత్య కృషి గురించి పరిశోధించి, విషయాలు తరువాతి తరాలవారికి అందించారు. జానుమద్దిగారితో గతంలో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడం, కొన్ని సాహిత్య సభల్లో ఆయన్ని కలుసుకోగలగడం మరువలేని జ్ఞాపకాలు! బ్రౌన్‌ను తనలో ఆవహింపజేసుకున్నవాడిగా ఆయన కనబడేవారు. అందుకే ఆయనను తెలుగు సూర్యుడు అని పిలుస్తారు.

ప్రతి రంగంలోనూ త్యాగధనులు ఉంటారు. వారి కృషిని కనీసం స్మరించుకోవడం మనుష్యులైన వారి కనీస కర్తవ్యం. తన 86  సంవత్సరాలలో 60 సంవత్సరాలు తెలుగు భాషాభివృద్ధికి అంకితం చేసిన బ్రౌన్ ని సంస్మరించుకోవడం తెలుగు వారందరి విధి.

9492712836
తిరువూరు

Sunday, 12 December 2021

జన విజ్ఞాన వేదిక జిల్లా సమావేశము, లావు బాల గంగాధర రావు భవన్, తేదీ:12.12.21, ఒంగోలు..














జన విజ్ఞాన వేదిక జిల్లా సమావేశమునకు శ్రీ A.V. పుల్లారావు గారు గౌరవాధ్యక్షులు గా వ్యవహరించారు.  
👉 ప్రస్తుతo దేశంలో క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి. ప్రజలు సమస్యలు చెప్పుకొనే స్థితి లేదు.
 👉 ప్రజాప్రతినిధులకు పెన్షన్ వుంది.మరి సామాన్య ఉద్యోగులకు పెన్షన్ ఎందుకు తొలగించారు.
👉 ప్రజా ప్రతినిధులు ప్రజలకు బాధ్యత వహించాలి. కాని ప్రభుత్వ ఆస్తులు కారు చౌకగా అమ్మకానికి ప్రజలకు ఎన్నుకొలేదు.
👉 అన్నిమతాల సారాంశం ఒక్కటే
👉 శాస్ర్తీయ దృక్పదం  పెంచాలి.
💐రాష్ట్ర కార్యదర్శి  శ్రీ మురళిధర్ గారు 
       .  👉కరొన మనకు నేర్పిన పాఠం ప్రజలందరూ ఆరోగ్యంగా వుండాలి.
ప్రజలు ఆరోగ్యంగా లేకుండా మనం ఆరోగ్యంగా ఉండలేం . 
👉విజ్ఞానశాస్త్ర ప్రచారం లో మహిళల భాగస్వామ్యం పెరగాలి .
👉 మహనీయులు, జాతీయ నాయకులు మేధావుల జయంతులు , వర్ధంతులు జరపాలి

Saturday, 11 December 2021

మూఢనమ్మకాల నిర్మూలన కోసం జనవిజ్ఞాన వేదిక యూత్ కమిటీ సభ్యుడు జె.శేఖర్ యొక్క సాహసోపేత ప్రదర్శన

మూఢనమ్మకాల నిర్మూలన కోసం జనవిజ్ఞాన వేదిక యూత్ కమిటీ సభ్యుడు జె.శేఖర్ యొక్క సాహసోపేత ప్రదర్శనకు ఏ ఐ పి ఎస్ ఎన్ రాష్ట్ర శాఖ మరియు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యాలయం, JVV ప్రకాశం జిల్లా శాఖ మరియు అద్దంకి డివిజన్ జన విజ్ఞాన వేదిక తరఫున తెలియజేయడమైనది.

Monday, 6 December 2021

ప్రకృతిని మనం కాపాడితే మనల్ని మనం కాపాడుకున్నట్టే.

JVV, అద్దంకి డివిజన్ ఆధ్వర్యంలో సీపీఎం 13 వ జిల్లా మహాసభలకు వైద్య సహాయం.

JVV, అద్దంకి డివిజన్ ఆధ్వర్యంలో సీపీఎం 13 వ జిల్లా మహాసభలకు వైద్య సహాయాన్ని అందిస్తున్న డివిజన్ హెల్త్ సబ్ కమిటీ కన్వీనర్ డా|| కె.రఘుచంద్ గారు