Tuesday, 28 September 2021

World Rabbits Day on Sep 28 on eve of death anniversary of LOUIS PASTEUR

https://www.facebook.com/groups/264730900337451/permalink/2420391718104681/

World Rabies Day is held every year on September 28. This date was chosen as it is the anniversary of the death of LOUIS PASTEUR – THE FIRST PERSON TO SUCCESSFULLY CREATE A VACCINE AGAINST RABIES.

The global COVID-19 pandemic has raised many doubts and misconceptions about VACCINATION in general. For RABIES, this is nothing new, as fears and misconceptions about the disease dates back hundreds of years. 

FAKE NEWS will negatively affect the RABIES elimination efforts. FACTS are the only way to beat fake news, so help to SHARE ACCURATE FACTS about rabies control.  

We need to dispel the myths about VACCINE HESITANCY and the MISCONCEPTIONS.   

Rabies is a Vaccine-preventable Viral Disease. Dogs are the source of the vast majority of human rabies transmission and deaths. 

Calling for effective Mass Dog Vaccination, instead of ineffective Dog Culling.

Vaccinate your pet. Act now !

Let us use facts to raise awareness and educate others about rabies – a 99% FATAL, yet 100% PREVENTABLE DISEASE.

Let us work together to Spread FACTS, and not FEAR, this World Rabies Day !

Let's achieve our goal of “Zero Human Rabies Deaths by 2030.”

#WorldRabiesDay

జాషువా జయంతి సందర్భంగా సెమినార్ :: JVV, ప్రొద్దుటూరు


ఈరోజు జాషువా జయంతి సందర్భంగా జన విజ్ఞాన వేదిక ప్రొద్దుటూరు ఆఫీసులో జాషువా జీవితం పై సెమినార్ను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక  కడప జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ రంగనాయకులు గారు పాల్గొని జాషువా తన జీవితంలో   అణగారిన వర్గాల స్వతంత్రం కోసం ఎంతో కృషి   చేశారని తెలియజేశారు జాషువా గారు భారతీయ సమాజాన్ని సాహిత్యంగా ప్రజాస్వామికంగా స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం  మూడు సూత్రాల మీద సమాజం  ఏర్పడాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జాషువా  రాసిన గిజిగాడు గబ్బిలం కావ్యాల సారాంశాన్ని తెలియజేశారు జాషువా జయంతిని పురస్కరించుకొని  కరపత్రాలను విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షులు ప్రకాష్ గారు  పట్టణ ప్రధాన కార్యదర్శి నంగా రాజేష్ గారు పొద్దుటూరు జనవిజ్ఞాన వేదిక నాయకులు మురళి  ఉత్తం రెడ్డి చంద్రశేఖర్ మధుగారు మొదలగు వారు పాల్గొన్నారు

మండే నిప్పు కణిక "భగత్ సింగ్" :: ఎం. రాంప్రదీప్, జన విజ్ఞాన వేదిక

Today's 'Prajapaksham' daily... 

తాత్విక ప్రయాణికుడు గుర్రం జాషువా ౼ రాచపాళెం చంద్రశేఖరరెడ్డి :: విశాలాంధ్ర దినపత్రిక నుండి సేకరణ


‘‘కవినిగన్నతల్లి గర్భంబు ధన్యంబు’’ గుర్రం జాషువ (18951971) జన్మించి 126ఏళ్లు, మరణించి 50ఏళ్లు పూర్తయ్యాయి. జీవించిన డబ్బైఆరేళ్లలో 50ఏళ్లు రచనా జీవితం గడిపారు. ఆయన రచనా జీవితం ఒక గొప్ప ప్రయాణం. ‘‘హిమధామార్కధర పరిణయము’’ (1917) మొదలైన ఆయన రచనా ప్రస్థానం‘‘తన వీలునామా’’ (1968) తో ముగిసింది. ఈ మధ్యకాలంలో ఆయన దాదాపు 36 రచనలు చేశారు. 

ఆయన రచనలలో నవల, నాటికలు, కొన్ని సినిమా రచనలు ఉన్నా, ఆయన ప్రధానంగా కవి. తాను కవినన్న స్పృహ ఆయనలో బలంగా ఉంది. సంఘసంస్కరణ, స్వాతంత్య్ర సమరకాలంలో కవిగా పుట్టుకొచ్చిన జాషువ మొదట 191725 మధ్య కొన్ని పౌరాణిక కావ్యాలు రాశారు. భారతీయ సమాజంలో ఇరవయ్యవ శతాబ్దం తొలినాళ్లలో కవులుగా ఎదిగొచ్చిన వాళ్లంతా మొదట పౌరాణిక రచనలే చేశారు. 

1926లో ‘శివాజి’ కావ్యరచనతో జాషువ ఆధునిక మార్గంలోకి ప్రవేశించారు. అక్కడి నుంచి తిరిగి చూడకుండా సామాజిక కావ్యాలే రాశారు. పిరదౌసి (1932) ముంతాజమహలు (1943) క్రీస్తు చరిత్ర (1963)వంటి చారిత్రక పౌరాణిక కావ్యాలు పోగా తక్కినవన్నీ సాంఘిక కావ్యాలే. స్వప్న కథ, అనాథ (1934) గబ్బిలం (1941, 1946) కాందిశీకుడు (1945) నేతాజీ (1947) బాపూజీ (1948) అశ్రుమంజరి (1948) స్వయంవరం (1950) రాష్ట్ర పూజ (1953) కొత్తలోకము (1967) నా కథ (1962) ముసాఫరులు (1963) నాగార్జున సాగర్‌ (1966) వంటి బలమైన కావ్యాలతో ఆధునిక తెలుగు కవిత్వానికి జవజీవాలు అందించారు జాషువ. 

వీటికి తోడు 1937` 1945 మధ్య ఏడు సంపుటాలతో 200లకు పైగా కవిత్వ ఖండికలు విభిన్న సందర్భాలలో రచించారు. ఆయన కావ్యాలన్నీ ఒక ఎత్తయితే, ఈ ఖండికలు మరో ఎత్తు.
జాషువ కవిత్వం ఆకలి ముప్పైల నుండి, నియమోల్లంఘనోద్యమం నుండి శ్రీకాకుళం గిరిజన పోరాటం దాకా ఉన్న సామాజిక చరిత్రను కవిత్వ రూపంలో ఆవిష్కరిస్తుంది. 

సామాజిక పరిణామాల నేపథ్యంలో జాషువ కవిత్వం చదివితే ఆయన కవిత్వానికుండే సామాజిక స్వభావం తెలుస్తుంది. మొదట్లో జాషువ తాత్వికంగా ఆస్తికుడే. దైవ విశ్వాసం బలంగా ఉండేది. అందుకే పురాణ కథలు కావ్యాలుగా రాశారు. అంతేకాదు సాంఘిక కావ్యాలలో కూడా ఆ విశ్వాసాన్ని ప్రకటించారు. ‘అనాథ’ అనే తొలి తెలుగు దళిత మహిళా కావ్యంలో ‘‘నలువసేయు విలాసము’’ ప్రస్తావన చేశారు. దళిత బిచ్చగత్తె చంకలో బిడ్డను పెట్టుకొని అడుక్కుంటూ ఉంటే, ఎవరో సైకిలుతో గుద్దుతారు. తల్లీబిడ్డ కిందపడతారు. బిడ్డకు దెబ్బలు తగలవు. తల్లికి గాయాలవుతాయి. 

అప్పుడు కవి
ఓయి! నాస్తికుడా! విను మొక్కమాట
అరసియుందువు ఘోర దృశ్యంబు నిచట
మృత్యుదేవత కోఱలు మెఱయునపుడు
శిశువునే మహాశక్తి రక్షించెనోయి
అని నాస్తికులను ప్రశ్నించారు. ‘‘పరమేశు విలాసమ్ములు కరముదు రుహ్యములు’’ అన్నారు.

పరమేశ్వరుడు లేడా
నరుండు నరునుద్దరించునా! వెఱిదానా!
అని చెప్పించారు. జాషువలో ప్రశ్నించే గుణం మొదట నుంచీ ఉన్నా, దానితో పాటు ఆధ్యాత్మిక విశ్వాసం చాలాకాలం ఆయనను నడిపించింది. 

‘గబ్బిలం’ లో అస్పృశ్యతను ఖండిస్తూనే, గబ్బిలంతో సందేశాన్ని శివునికి పంపించడం ఇందుకు నిదర్శనం. ‘గబ్బిలం’ లో కర్మ సిద్ధాంతాన్ని నిలదీసినా శివుని నిందించలేదు. గబ్బిలంతో
వెఱవనేల నీకు విశ్వనాథుమ్రోల
సృష్టికర్త తాను, సృష్టి వీవు
అని అనటంలోనూ ఈ లక్షణమే కనిపిస్తుంది.

గబ్బిలం రెండవ భాగంలో జాషువలో తాత్వికంగా వచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ‘‘ఏనాడు మా బుఱ్ఱలు, జుట్టుతల లేని పుక్కిట కథలలో జిక్కువడవొ అని మార్పును కోరుకున్నారు. ‘‘నరుని కష్టపెట్టి నారాయణుని కొల్చే వింత ధర్మాన్ని ప్రశ్నించారు. హిందుత్వంలోని అసంబద్ధతను ప్రశ్నిస్తున్న జాషువకు ఏసుక్రీస్తులో విశ్వాసం సన్నగిల్లలేదు. 

గబ్బిలం రెండవ భాగం రాసే నాటికే (1946) జాషువలో తాత్వికంగా మార్పు వచ్చి దైవ అవతార సిద్ధాంతాన్ని అధిక్షేపించారు.ఇక ఇక్కడ నుంచి అవకాశం వచ్చినప్పుడంతా దాదాపు రెండు దశాబ్దాలు ఈ ప్రశ్నించే తాత్వికతను జాషువ కొనసాగించారు.

‘‘కాందిశీకుడు’’ కావ్యం రెండో ప్రపంచ యుద్ధ కావ్యంలో జాషువ రాసిన కావ్యం. యుద్ధ కాలంలో బర్మా నుంచి బయటికి వచ్చిన ఒక సైనికునికి, ఒక బౌద్ధ కపాలానికి మధ్య జరిగిన సంభాషణ ఈ కావ్యం. ఈ బౌద్ధ కపాలాన్ని ఎన్నుకోవడంలోనే జాషువ తాత్విక పరిపక్వత కనిపిస్తుంది. బౌద్ధం మానవ ధర్మం కావడమే ఇందుకు కారణం.
స్వర్గనరకాలు రెండు నీ జగతి యందె
నరుడు సృష్టింపగలడని నమ్మగలను
అని మానవుని చరిత్ర నిర్మాతగా ప్రతిపాదించింది బౌద్ధ కపాలం.

‘నేతాజీ కావ్యం’ లో సుభాస్‌చంద్రబోస్‌కు కనిపించిన భరతమాత దేశంలోని వర్తమాన పరిస్థితుల పట్ల విచారం వ్యక్తం చేస్తుంది. ఆ సందర్భంలో విగ్రహాల రూపంలో దేవుళ్ల కిచ్చిన ప్రాధాన్యం కంటికి కనిపించే మనుషులకు ఇవ్వకపోవడాన్ని ఆమె ప్రస్తావిస్తుంది.

గాంధీజీ హత్య జరిగినప్పుడు, జాషువ తీవ్రంగా వేదనపడ్డారు. శోకించారు. ఆ బాధలో
భరతభూమినింక భగవంతుడుండునా
దేవళంబు లుత్త తిత్తులయ్యె
అని ఆక్రోశించారు. ఇది ఉద్వేగభరిత, బాధాతప్త ఉద్వేగమేగానీ తాత్వికంగా తిరుగుబాట పట్టడం కాదు. ఈ కావ్యంలోనే మతం పేరు జరిగే అమానవ కర్మకాండను జాషువ విమర్శించి తన భౌతిక తాత్వికతను చాటుకున్నారు.

గుళ్లు గోపురాల కొఱకు చందాలెత్తి
పొట్టబోసికొనుట పుణ్యమగునె
అన్నమునకు నీటి కంటు జాడ్యంబున్న
చుప్పనాతి మతము గొప్పదగునె
అని ప్రశ్నించారు. 

మానవ ముఖం కోల్పోయిన ఏ అంశాన్నీ జాషువ ఉపేక్షించకుండా విమర్శించారు. ఈ ధోరణి జాషువ తాత్వికతా ప్రయాణంలో క్రమంగా బలపడింది.

భారతదేశం అస్పృశ్యతా జాడ్యం మీద అవకాశం వచ్చినప్పుడంతా జాషువ అస్పృశ్యతకు తాత్వికంగా మతానికీ ఉన్న సంబంధాన్ని ప్రస్తావించి విమర్శిస్తూ వచ్చారు! ‘బాపూజీ’ కావ్యంలోనూ ఈ పని చేశారు.
దళకోటి పంచముల దు
ర్దశకై కన్నీటి చుక్కరాల్పని వేల్పులో
దశలక్షవేల? వెన్నుని
దశావతారంబు లేల? ధర్మములేలా?
ఈ ప్రశ్నలో జాషువ కంఠస్వరం,దానిలో దాగిన ఆయన తాత్వికతా పరిణతి ప్రస్ఫుటంగా ధ్వనిస్తున్నాయి. 

1957నాటి ‘కొత్తలోకము’ కావ్యం రాసేనాటికి జాషువకు 60ఏళ్లు దాటాయి. అనేక సామాజిక ఉద్యమాలను ఆయన చూశారు. అంబేద్కర్‌ ఉద్యమాన్ని చూశారు. మానవ ధర్మమైన బౌద్ధాన్ని అంబేద్కర్‌ స్వీకరించడమూ గమనించారు. ‘‘కొత్త లోకము’’ ‘‘తొలికోర్కె’’ లో దేవుని అనేక రకాలుగా ప్రశ్నించారు. ‘‘కనుపడవేమిర జగము కల్పన చేసిన గారడీడ’’ అని అధిక్షేపించారు. దేవుడు ఉన్నది నిజమైతే తనకు కనపడమని డిమాండ్‌ చేశారు. దేవుని సృష్టిగా ప్రచారంలో ఉన్న వ్యవస్థను విమర్శించారు.

భగవంతుడు ఉన్నాడని నమ్మే భక్తులు తనువులు కోసి వేడి నెత్తురుతో అనాదిగా అర్చనలు చేస్తుంటే దర్శనం ఇవ్వనివాడు ‘‘నిన్నసలుసందేహించుచుక నమ్మిన నమ్మని మా బోంట్లను లెక్కసేయుదువె’’ అని అన్నారు. 

జాషువ కాంగ్రెస్‌ పాలనలో ఉంటూ, గాంధీజీని స్మరిస్తూ ఉన్నా ఆయన తాత్వికత క్రమక్రమంగా పదునెక్కింది. అది భౌతికవాద తాత్వికత. తన కాలంనాటి తెలంగాణ రైతాంగ సాయుధపోరాటాన్ని చూశారు. కమ్యూనిస్టులు నిర్వహించిన అనేక ఉద్యమాలను గమనించారు. ‘‘కొత్తలోకము’’ కావ్యంలో వామపక్ష ప్రశంస చేయడానికి ఆయన సంకోచించలేదు.

నాస్తికుల సామ్యవాదుల
మస్తిష్కము నందు పతిత మానవతతికిన్‌
గాస్త జగా కలదేమో
నాస్తి సుమి కరుణకేది కాలం గృతులన్‌
మరణించే నాటికి జాషువ పూర్తిగా భౌతికవాది అయ్యారని ఆయన అల్లుడు లవణంగారు ఒకసారి నాతో అన్నారు. 

జాషువ ఒక తాత్విక ప్రయాణికుడు. భావవాదం నుండి భౌతికవాదం వైపు ఆయన ప్రయాణించారు. కవిత్వాన్ని తన తాత్విక ప్రయాణానికి వాహికగా చేసుకున్నారు. భౌతికవాదులుగా ఉండి జీవిత అవసాన దశలో భావవాదులుగా మారిన రచయితలు తెలుగులో కొందరున్నారు. జాషువ దానికి భిన్నమైన కవి. ఆయన ప్రయాణం శాస్త్రీయమైది

నవయుగ కవి చక్రవర్తి శ్రీ గుర్రం జాషువా జయంతి సెప్టెంబరు 28 సందర్భంగా :: ప్రజాశక్తి వ్యాసం "తెలుగు భాషపై జాషువా మక్కువ"

కవి కోకిల, కవితా విశారద, కవి దిగ్గజ, మధుర శ్రీనాధ. నవయుగ కవి చక్రవర్తి. విశ్వకవి సామ్రాట్ , పద్మభూషణ్
*శ్రీ గుర్రం జాషువ*
జయంతి వేడుకలు ప్రతి పాఠశాల లో జరగాలి ఆయన కలం గొప్పదనం ప్రతి విద్యార్థి కి తెలియాలి...

మీ
కొలగాని వరప్రసాద్

Monday, 27 September 2021

News clippings on GLOBAL CLIMATE STRIKE in Prakasam Dist



Programme on GLOBAL CLIMATE STRIKE at PRAKASAM ENGG. COLLEGE, Kandukur

Programme at PRAKASAM engineering college, KANDUKUR on ( save nature )
Climate strike....
Participants
K.Ramaiah
K Srikanth
G.V.Malyadri
A.Vijay kumar
TVV Krishna Kumar
SK Mahboob basha....

And 50 students more were participated in Programme.

Sanke Bite - First Aid

 

Celebrated GLOBAL CLIMATE STRIKE at SVK High School, Gangavaram.

Conducted Quiz,Drawing, Essay writing competitions, Skit,Rally and Plantation programs for GLOBAL CLIMATE STRIKE. at SVK High School, Gangavaram.

Sunday, 12 September 2021

JVV రాష్ట్ర మహాసభలకు ప్రకాశం జిల్లా నుండి హాజరవుతున్న వారు

జనవిజ్ఞాన వేదిక 16 వ రాష్ట్ర మహాసభలకు ప్రకాశం జిల్లా నుండి హాజరవుతున్నవారు:

*1)కుర్రా రామారావు*( రాష్ట్ర ఉపాధ్యక్షులు), చీరాల
*2)P.స్వరూపరెడ్డి* (రాష్ట్ర కమిటీ సభ్యులు ), గిద్దలూరు
*3)కె.సుబ్రహ్మణ్యం*(రాష్ట్ర కమిటీ సభ్యులు ), ఒంగోలు

4)Sk.ఖాజా హుస్సేన్,(జిల్లా అధ్యక్షులు),కనిగిరి
5)Ch.జయప్రకాశ్(జిల్లా ప్రధాన కార్యదర్శి), ఒంగోలు
6)కె.ప్రభుదాస్,(జిల్లా ఉపాధ్యక్షులు), అద్దంకి
7)D.గురుస్వామి,(జిల్లా ఉపాధ్యక్షులు), పొదిలి
8)R.రంగరాజు(జిల్లా ఉపాధ్యక్షులు), గిద్దలూరు
9)K.నారాయణ,జిల్లా JVV  సబ్ కమిటీ(విద్యా) కన్వీనర్-సింగరాయకొండ
10)U.వెంకట్రావు,(జిల్లా కార్యదర్శి), మార్కాపురం
11)Z.రమణయ్య, జిల్లా సబ్ కమిటీ(సాంస్కృతిక) కన్వీనర్, కనిగిరి
12)TVV.కృష్ణకుమార్, డివిజన్ అధ్యక్షులు, కందుకూరు
13)M.శ్రీనివాసులు, డివిజన్ ప్రధాన కార్యదర్శి,గిద్దలూరు
14)Sk.బషీరున్నీసా బేగం, కనిగిరి (జిల్లా సమత విభాగం)
15)G.శ్రీనివాసరెడ్డి,జిల్లా సబ్ కమిటీ (యూత్)కన్వీనర్, కనిగిరి
16)T.రమణ, ఒంగోలు నగర ప్రధాన కార్యదర్శి.
17)K.తేజస్విని,జిల్లా సబ్ కమిటీ (సమత)కన్వీనర్, గిద్దలూరు

Friday, 10 September 2021

ప్రశ్న గురించి నార్ల వారి మాట

పర్యావరణ హితంగా పండుగలు

రానున్న నాలుగు నెలల్లో వివిధ మతాలకు చెందిన వినాయక చవితి, దసరా,దీపావళి, మిలాద్ నబి,క్రిస్మస్ వంటి పండుగలు వస్తున్నాయి. బంధువులు, స్నేహితులు కలవడానికి పండుగలు ఒక వేదికగా ఉపయోగపడతాయి.తద్వారా మనుషుల మధ్య అనుబంధాలు బలపడతాయి.అయితే దేశంలో కరోనా మూడవ వేవ్ పొంచివున్నదనే ముందస్తు హెచ్చరికలని ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేశాయి. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గినప్పటికీ కేరళలో రోజుకు 30 వేల కేసులు నమోదు అవుతున్నాయి.దేశంలో నాలుగు లక్షల పైగా యాక్టివ్ కేసులున్నాయి.ఈ నేపథ్యంలో
ఏ పండుగానైనా ప్రశాంతంగా, పర్యావరణ హితంగా జరుపుకోవడం మంచిది. ఇలా
చెప్పడాన్ని వివిధ మతాలపై దాడిగా భావించరాదు.

పండుగలు జరుపుకోవద్దని ఎవరూ చెప్పరు. పండుగలు,వేడుకలు,ఉత్సవాలు జరుపుకోవడం జీవితంలో ఒక భాగమే.అయితే దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటుంది. చిన్నపిల్లలకి ఇంకా వ్యాక్సిన్ రాలేదు.ఇటువంటి సమయంలో ప్రతి ఒక్కరు తమ మనోభావాలు దెబ్బతింటున్నాయి అనే ధోరణిలో కాకుండా సంయమనం పాటించాలి.
హేతువాదులు, సైన్స్ వాదులు,పర్యావరణ ప్రేమికులు ఎలాగూ పండుగలని పర్యావరణ హితంగా జరుపుకోమని ప్రచారం చేస్తారు.ప్రజలకి వివిధ 
కార్యక్రమాల ద్వారా అవగాహన కల్గిస్తారు.ఇందులో
పాలకులు, రాజకీయ నాయకులు కూడా భాగస్వామ్యులు కావాలి. వారు కూడా కరోనా నిబంధనలు పాటించాలి. కొంతకాలంపాటు పెద్ద పెద్ద బహిరంగ సభలు ఏర్పాటు చేయకూడదు. వివిధ మత పెద్దలు కూడా తమ మతస్థులకు పండుగలని నిర్మలంగా జరుపుకోమని సూచించాలి.తాము కరోనా నిబంధనలు పాటించకుండా, ప్రజలు మాత్రమే పాటించాలని చెప్తే పాలకులు ఆశించిన ఫలితాలు రావు.

కరోనా ఉమ్మడి శత్రువు.దీనిపై ఉమ్మడిగానే పోరాడాలి.వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా రాదని చెప్పలేము.కాకపోతే వ్యాధి తీవ్రతను తగ్గిస్తుంది. ఈ నేపథ్యంలో రాజకీయ, మత కోణంలో గాకుండా, విశాలమైన ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రతి
ఒక్కరు కోవిడ్ నిబంధనలు పాటించాలి. వివిధ వేడుకల్ని పర్యావరణహితంగా జరుపుకోవాలి. లేనట్లయితే కరోనా మరో వేరియంట్ రూపంలో విజృంభించి మనందరిచేత బలవంతంగా నిబంధనలని పాటించేటట్లు చేస్తుంది.
జనవిజ్ఞానవేదిక-కనిగిరిడివిజన్

Sunday, 5 September 2021

ఉపాధ్యాయ దినోత్సవాన్ని విద్యా పరిరక్షణ దినోత్సవం గా పాటిద్దాం. :: జనవిజ్ఞాన వేదిక, ఆంధ్ర ప్రదేశ్ పిలుపు మరియు ఆన్ లైన్ పోస్టర్ క్యాంపెయిన్

AIPSN లోని సైన్స్ సంస్థలు (జనవిజ్ఞాన వేదిక), మేధవులు, యూనివర్సిటీ అధ్యాపక సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు మరియు విద్యార్థి సంఘాలు  కలిసి Joint Forum of Movement on Education (JFME)గా ఏర్పడి ఉద్యమిస్తున్న మరియు ప్రతిపక్షాలు, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలను స్వీకరించకుండా NEP-2020 ని పార్లమెంటు లో చర్చ లేకుండా మంత్రి మండలి ఆమోదించి అమలు చేసేందుకు పూనుకున్నందుకు నిరసగా "ఉపాధ్యాయ దినోత్సవాన్ని"  "విద్యా పరిరక్షణ దినోత్సవం గా పాటిద్దాం" -విద్యాసబ్ కమిటీ, జనవిజ్ఞాన వేదిక, ఆంధ్రప్రదేశ్

ఉత్తమ ఉపాధ్యాయులు దాసరి గురుస్వామి గారు.