Tuesday, 25 August 2020

Live programme on ప్రజారోగ్యం - సవాళ్లు

 Please watch live programme in జనవిజ్ఞాన వేదిక, ప్రకాశం Facebook page 


https://www.facebook.com/jvv.prakasham/videos/767168634115527/?sfnsn=wiwspmo&extid=HkJjkhP61QOWuE1D&d=n&vh=e

Wednesday, 6 May 2020

బుద్ధిజంతోనే సమానత్వం..(తేది :7/5/2020 బుద్ధ జయంతి సందర్భంగా)


నేడు కరోనా వైరస్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది. బుద్ధుని కాలంలో కూడా అంటురోగాలు ప్రబలాయి. జంతువులను వేటాడటం ఎక్కువయ్యింది, అందుకే బుద్ధుడు శాకాహార ఉద్యమాన్ని ప్రారంభించారని అంటారు. తిన్న ఆహారం మనిషిని కలుషితం చేయదని ఆయన అంటాడు. కానీ నేడు ప్రజల ఆహారపు అలవాట్లపై ఆంక్షలు పెరిగాయి. హత్య, దొంగతనం, వ్యభచరించడం, చెడు ఆలోచనలు మాత్రమే మనిషిని కలుషితం చేస్తాయని బుద్ధుడు వివరించాడు. ప్రేమతోనే కోపాన్ని జయించవచ్చని ఆయన అంటారు. చేసే పనిని బట్టే ఫలితం ఉంటుందని, ఆత్మలుండవని ఆయన ప్రవచించారు.
 ఆధునిక ప్రపంచంలో మానవుడు సౌకర్యవంతంగా జీవించడానికి అన్ని రకాల హంగులున్నప్పటికీ అతనికేదో వెలితి కన్పిస్తుంది. మరేదో తెలియని భయం మనిషిని వెంటాడుతుంది. ఈ భయాన్ని అధిగమించడానికి కొందరు భక్తి మార్గాన్ని ఎంచుకుంటున్నారు. మరికొందరిలో ఈ భక్తి మూఢభక్తిగా మారుతుంది. యాంత్రీకరణ, జీవితంలో పెరిగిన వేగం వలన మనిషి ఎలా జీవించాలోనని తర్జన భర్జన పడుతున్నాడు. ఒకవైపు ఆధునికతని అనుకరిస్తూనే, మరోవైపు ప్రాచీన సాంప్రదాయాలని వదులుకోలేక ఘర్షణకు గురౌతున్నాడు. ఈ ఘర్షణ వల్ల మనశ్శాంతిని కోల్పోతున్నాడు. తాను పరిశోధించి అభివృద్ధి చేసుకొన్న సాంకేతిక పరిజ్ఞానానికి తానే బందీ అవుతున్నాడు. ఆధునికత, ఆధ్యాత్మికతలని మేళవింపు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రపంచీకరణ పేదవారికి ఒక ప్రపంచాన్ని, ధనికులకు మరొక ప్రపంచాన్ని సృష్టించింది. ఆధునిక కాలంలో మన మెదుర్కొనే ప్రతి సమస్యకి బుద్ధుడు పలు శాస్త్రీయమైన పరిష్కార మార్గాలు సూచించాడు. ఆయన క్రీ .పూ. ఆరవ శతాబ్ధంలో జన్మించాడు. ఈ శతాబ్దం మేధోపరంగా చాలా ఫలప్రదమైందిగా కన్పిస్తున్నది. ఈ శతాబ్దంలోనే కన్ఫూషియస్, లౌడ్డు, జరాతూష్ట్ర, పైథాగరస్, జెర్మియా, 2వ ఈజయ్య వంటి మహామహులు జన్మించారు. బుద్ధుని కాలంలో వర్ణవ్యవస్థ రాజ్యం ఏలుతోంది. చిన్న చిన్న రాజులు రాజ్యాలని పరిపాలించేవారు. అనేక బాషలు, అనేక మాండలికాలుండేవి. అగ్రవర్ణాలు అధోవర్గాలని దోపిడి చేసి పీక్కుతినేవి. ఈ పరిస్థితి బుద్ధుణ్ణి కలవరపెట్టింది. అందుకే చరిత్రలో వర్ణ వ్యవస్థకు మొదటిగా ఎదురు తిరిగిన వ్యక్తిగా బుద్ధుడు నిలిచాడు. మనిషి ఔన్నత్యం కులం మీదకాదు, గుణం మీద ఆధారపడుతుందని ఆయన నొక్కి చెప్పాడు. నాడు అనేక గందరగోళ సిద్దాంతాలు, వాదనలు ప్రజలని అయోమయానికి గురిచేశాయి. ఇటువంటి తరుణంలో మనుషులనీ హేతుబద్ధంగా, తర్కబద్దంగా ఆలోచింపజేయాలనీ బుద్దుడు సంకల్పించాడు. మనిషి కేంద్రంగా ఆయన ఆలోచనలు చేశాడు. మనిషి ఎలా ఉండాలో బుద్ధుడు తన అష్టాంగ మార్గంలో వివరించాడు.  ఆయన ప్రకారం 'కోరికలని జయించడమంటే వాటిని అదుపులో పెట్టుకోమని కాదు, శారీరక అవసరాల బట్టి సామాజిక సూత్రాల ద్వారా వాంఛలని తీర్చుకోవచ్చు. నైతిక సూత్రాల ద్వారా ధనాన్ని సంపాదించుకోవచ్చు. అలాగని పూర్తిగా విలాసవంతమైన జీవితం మంచిది కాదు. సర్వం త్యజించి సన్యాసాన్ని కూడా తీసుకోనవసరం లేదు. కఠిన ఉపవాసాలతో శరీరాన్ని ఇబ్బంది పెట్టవద్దు. శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మంచి ఆలోచనలు వస్తాయి. తినే ఆహారం మనిషి ఆలోచనలని ప్రభావితం చేయలేవు. ఇతరుల మీద దయని చూపడం ద్వారా నీవు మరింత స్వేచ్ఛగా ఉండగల్గుతావు. జంతు , వృక్ష రాశులని ప్రేమించాలి. దొంగతనాలకు, మద్యపానానికి, వ్యభిచారానికి దూరంగా ఉండాలి. కర్మ కంటే కర్తే ముఖ్యం. మనం చేసే పనులు బట్టే ఫలితాలు వస్తాయి. అన్నింటికీ మనసే ప్రధానం' అని ఆయన ప్రబోధించాడు. మరణాంతరం జీవితం లేదని ఆయన తేల్చాడు. మానవులంతా సమానమని, దేనిని గుడ్డిగా అనుకరించవద్దని వివరించాడు. తన పేరుతో విగ్రహాలు నిర్మించవద్దని చెప్పాడు. తనకు అత్యంత ప్రాముఖ్యతని కూడా ఇవ్వనవసరం లేదని బుద్దుడు తన శిష్యులకు తెలియచేశాడు. బుద్ధుని బోధనల ప్రభావం, బైబిల్ పై ( కొత్తనిబంధన ) కూడా ఉందని పాల్ కారస్ తన 'ద గాస్పెల్ ఆఫ్ బుద్ధ' లో తెలియజేశాడు. వీటికి సంబంధించిన ఆధారాలు ఇజ్రాయిల్ రాజ్యం అవతరించిన తరువాత జరిపిన త్రవ్వకాలలో లభించాయి. అలెగ్జాండర్ దండయాత్రల వల్ల, ఇతర వ్యాపార సంబంధాల వల్ల సుగంధ ద్రవ్యాలు, నెమళ్ళు, కోతులు, గంధం చెక్కలు మన దేశం నుండి విదేశాలకు ఎగుమతి అయ్యాయి. బౌద్ధ సాహిత్యం కూడా విదేశాలకు వ్యాపించింది. బ్రదర్, సిస్టర్, ఫాదర్ మొదలైన పదాలన్ని బౌద్ధం నుంచే క్రైస్తవం. స్వీకరించిందని జహంగీర్ ఆర్.దూమాసియా రాసిన 'స్టోరీ ఆఫ్ ద పారలల్ గ్రేట్ రోడ్స్' లో తెలిపారు . బుద్ధుడు , క్రీస్తు లిద్దరూ శాంతిదూతలుగా పేరు పొందారు. వారిద్దరూ బానిసత్వాన్ని ఎదిరించారు. అందుకే బాబా సాహెబ్ అంబేద్కర్ బౌద్ద సాహిత్యాన్ని సమగ్రంగా పరిశీలించి బౌద్దమతాన్ని స్వీకరించాడు. 'బుద్ధిజానికి ఆధునిక రూపంగా అంబేద్కరిజాన్ని వర్ణించవచ్చు. బుద్దుడు ఒక సోషల్ ఇంజనీర్. ఆయన గొప్ప మానవతా వాది. మానసిక శాస్త్రంలో జరిగిన పరిశోధనలు కూడా ఆయన బోధనలని బలపర్చాయి. మనమే బుద్దుడిని దూరం చేసుకున్నాం. అంబేద్కర్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. బుద్ధుడు జన్మించిన నాటి పరిస్థితులు ఇప్పుడు మన దేశంలో తిరిగి పురుడు పోసుకుంటున్నాయి. అందుకే మన మూలాల్లోకి తిరిగి వెళదాం. బుద్ధుడిని విగ్రహాల్లో గాకుండా ఆయన బోధనలలో దర్శించుకుందాము. బుద్ధుడు బోధించిన స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సమానత్వం సూత్రాల ఆధారంగానే తాను రాజ్యాంగాన్ని రచించానని అంబేద్కర్ స్పష్టం చేశారు. నిమ్న వర్ణాల రక్షణకై రాజ్యాంగంలో పలు నిబంధనలు రూపొందించబడ్డాయి. పాలకులు రాజ్యాంగ స్ఫూర్తిని అర్ధంచేసుకొని నిమ్న వర్గాల హక్కులని కాపాడాల్సిన అవసరం ఉంది. అణగారిన వర్గాల వారు కూడా తమ హక్కుల గురించి తెలుసుకోవడం, తమ రక్షణకై రూపొందించబడ్డ చట్టాల పట్ల అవగాహన కలిగి వుండటం, వాటిని సక్రమంగా ఉపయోగించుకోవడం ద్వారానే దేశంలో నిజమైన దళిత సాధికారిత వస్తుంది.
యం.రాంప్రదీప్,
జనవిజ్ఞాన వేదిక,
సెల్ నెం.9492712836

వేద భూమి - పుస్తక సమీక్ష :: జన విజ్ఞాన వేదిక ప్రకాశం జిల్లా కమిటీ

వేదభూమి పుస్తకం చాప్టర్ ల వారిగా.... పరిచయం చేయువారు
 1.  జి.వి. మాల్యాద్రి గారు     ‌
 2.  ఎల్.అంజమ్మ మేడంగారు
 ౩. మండ్ల శ్రీనివాసులు గారు
 4. ఎన్. టి .వెంకటేష్ గారు
 5. కె.పోతురాజు గారు
 6. టి.వి.నర సింహా రావు గారు
 7. టి.సరోజిని గారు
 8. వీరమ్మ గారు

[12:58 PM, 5/1/2020] JVVMRKP@Dr.DSarat:
ఈ వేదాలు యుగాల అంటే లక్షల సంవత్సరాల  క్రితం రాయబడినవా?నిజమేనా?

లిఖిత పూర్వకంగా ఉన్న పురాతన వేద సంకలనం యొక్క వయసు ఆధారాలతో నిరూపణ చేశారా? ఉంటే ఎంత కాలం క్రితం?

[1:01 PM, 5/1/2020] JVVMRKP@Dr.DSarat:
వేదాల కన్నా పురాతన సాహిత్యం  ఇతర నాగరికత లలో ఏవైనా ఉన్నాయా?

[1:51 PM, 5/1/2020] JVVKDKR@GVMalyadri Secretariat Member:
మనకు గల నమ్మకం ప్రకారం వేదాలు అపౌరుషేయాలంటారు గదా!

[2:04 PM, 5/1/2020] JVVMRKP@Dr.DSarat:
అవును సార్. అందుకే లిఖితపూర్వక ఆధారాలు ఎప్పుడు  అని అడిగాను.

[3:37 PM, 5/1/2020] SUBRAHMANYAM JVV State Coord.:

వేద భూమి ముందు మాట. కె.సుబ్రహ్మణ్యం.

వేద భూమి ముందు మాట. రాహుల్ గారు 


[04:01 PM, 5/1/2020] JVVMRKP@Dr.DSarat:
మన దేశంలో లిఖితపూర్వక ఆధారాలు క్రీస్తు పూర్వం 1500-1300 మధ్యలో లభ్యమవుతాయి.

అదే ప్రపంచంలో మెసపొటేమియా నాగరికత  సుమేరియన్లు 1900-1500 మధ్యలో లభ్యమవుతాయి.

అంతకు ముందు ఎక్కడ కూడా లభ్యం కాలేదు.

అంటే లిఖిత సాహిత్యం సుమారు 5000 సంవత్సరాల లోపు అంతే.

[01/05, 5:01 PM] JVVMRKP@ch.Jayaprakash Social Activist: JVV జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం గారు ఈరోజు కార్యక్రమాన్ని preside చేస్తారు.

[01/05, 5:08 PM] JVVONG@SUBRAHMANYACHARI:
మిత్రులారా! మే డే శుభాకాంక్షలు. అమరజీవి సుందరయ్య గారికి జోహార్లు అర్పిస్తూ ఈరోజు చర్చ ను ప్రారంభించు కుందాం. చాప్టర్ వారీగా మొదలు పెట్టాలి.

మే డే సందేశం - రాహుల్ గారు 

వేద భూమి చాప్టర్ 1.1 - జి.వి. మాల్యాద్రి గారు

వేద భూమి చాప్టర్ 1.2 - జి.వి. మాల్యాద్రి గారు

written images ch 1

[01/05, 5:15 PM] JVVMRKP@ch.Jayaprakash Social Activist:
మేడమ్ 2వ చాప్టర్ పోస్ట్ చేస్తారు
[01/05, 5:35 PM] JVVMRKP@ch.Jayaprakash Social Activist:
మాల్యాద్రి సార్... వేద భూమి మొదటి చాప్టర్ రచయిత  ఏ ఏ కాలాలకు సంబంధించి రచించారు...

NOT ANSWERED

[01/05, 5:37 PM] JVVMRKP@ch.Jayaprakash Social Activist:
అపౌరుషేయాలు అంటే

[01/05, 5:39 PM] JVVKDKR@GVMalyadri Secretariat Member:
మానవ నిర్మితాలు కావని...

[01/05, 5:43 PM] JVVMRKP@ch.Jayaprakash Social Activist:
Ok.... అపౌరుషేయాలు అంటే మానవులు రచించినవి కాదని అర్థమా..it's ok

[01/05, 5:44 PM] JVVMRKP@Dr.DSarat:
ఆర్యులు ఇతర ద్రవిడ మరియు ఇతర జాతులను నాశనం చేయడం ఒకవైపు ఆయా జాతుల ఆచార వ్యవహారాలను తెలివిగా తమ ఆర్య సిద్ధాంతం లో కలిపేసుకున్నారు.

[01/05, 5:46 PM] JVVMRKP@ch.Jayaprakash Social Activist: ఎవరైనా మిత్రులు ఆర్యులు ద్రావిడులు ఏ కాలాలకు చెందినవారు అని చరిత్ర చెబుతుందో వివరిస్తారా

జవాబు - కుర్రా రామా రావు గారు 

[01/05, 5:50 PM] JVVMRKP@Dr.DSarat: క్రీస్తు శకం బహుశా 1000-1500 సంవత్సరాల దగ్గర
నుంచి మన దేశంలో భక్తి విప్లవం పెరిగి శాస్త్రీయ పద్ధతి లో విశ్లేషణ తగ్గటం మొదలైంది.....

అలా జరుగుతూ మన విజ్ఞాన శాస్త్ర  పెరగటం ఆగిపోతున్న కాలంలోనే ఇతర దేశాల ముఖ్యంగా యూరప్ లో పునరుజ్జీవనం అంటే ఆనాటి శాస్త్రీయ పద్ధతి లో విశ్లేషణ చేయటం మొదలైంది.దాని ఫలితమే ఇప్పటి ఆధునిక విజ్ఞానం గా చెప్పవచ్చు . శాస్త్రీయ విజ్ఞానం ఇప్పుడు ఉన్న రూపంలోకి మారటం సోషలిజం రావటంతో మరో మలుపు తిరిగింది

[01/05, 5:52 PM] T V. NarasimhaRao: క్రీస్తు పూర్వం సం!!3000షుమారుగా

[01/05, 5:52 PM] JVVKDKR@GVMalyadri Secretariat Member: ఇది చాలా లోతైన విషయం అనుకుంటా...

[01/05, 5:57 PM] JVVMRKP@Dr.DSarat: కరెక్ట్ గా చెప్పటం అసంభవం. బహుశా 2000 క్రీస్తు పూర్వం నుంచి యూరేసియన్ పీఠభూముల నుంచి కొన్ని తెగలు పశ్చిమ దిశలో ఇప్పటి ఇంగ్లాండ్ వైపు....
కొన్ని జాతులు తూర్పు దిక్కుగా అంటే టర్కీ ఆఫ్ఘనిస్తాన్ ఇండియా దిశలో వలసలు  వచ్చారని భావన.

వారి భాష లో ముఖ్యంగా రుగ్వేదంలోని అంశాలు నేటి పశ్చిమ -ఉత్తర భారత దేశంలో పరిస్థితులు మాత్రమే వివరణ ఇచ్చారు.

[01/05, 6:00 PM] JVVMRKP@Dr.DSarat: ఏదైనా సింధూ నాగరికత మొహంజదారో హరప్పా నాగరికత తరువాత మాత్రమే వైదీక నాగరికత వచ్చింది అని నా అభిప్రాయం. అంటే సుమారు క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల తరవాత క్రీస్తు శకానికి దగ్గరగా అని అభిప్రాయం

[01/05, 6:02 PM] JVVMRKP@GUmamaheswari: Sir....ద్విజులు ?

జవాబు - సుబ్రహ్మణ్యం గారు 

[01/05, 6:05 PM] T V. NarasimhaRao: రెండు సార్లు జన్మించిన వారు... మామూలు పుట్టుక... యజ్ఞోపవీతం రెండవది

[01/05, 6:07 PM] JVVMRKP@Dr.DSarat: రామాయణం మహా భారతం ఏ కాలంలో రాసి ఉండే అవకాశం ఉంది

జవాబు 1,
జవాబు 2 - రామారావు గారు

[01/05, 6:10 PM] +91 97043 38619: అంజని.మేడం గారు చక్కగా వివరించారు ధన్యవాదములు

[01/05, 6:14 PM] JVVMRKP@Dr.DSarat: ఇలాంటి సామాజిక వర్గీకరణ యూరప్ దేశాల్లో ఎందుకు రాలేదు?
అలాగే కుల వర్గీకరణ కలిగిన ఈ ఆర్య సిద్ధాంతం భారత ఉపఖండంలోనే మిగిలటం ఇంత గ్లోబలైజేషన్ లో కూడా విస్తరించలేదు ఎందుకు

జవాబు - టి.వి.ఎన్.రావు గారు.


[01/05, 6:17 PM] JVVMRKP@ch.Jayaprakash Social Activist: అవును కదా!ఇది మరీ అమానవీయ వ్యవస్థ, ఆటవిక న్యాయం అని వారు ముందే అర్థం చేసుకుని ఉంటారనుకుంటా.

[01/05, 6:21 PM] JVVONG@SUBRAHMANYACHARI: జీవి మాల్యాద్రి సార్, అంజనిమేడంగారు ,మండ్ల శ్రీనివాసరావు సార్ చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. వీరికి అభినందనలు. నాలుగవ చాప్టర్ పోస్ట్ చేయగలరు.

వేదభూమి చాప్టర్ 4 - ఎన్. టి .వెంకటేష్ గారు

written images ch 4

[01/05, 6:21 PM] JVVMRKP@ch.Jayaprakash Social Activist: వారు ఆంటే ఇతర దేశాలు ముఖ్యంగా యూరప్ మరియు అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలు

[01/05, 6:32 PM] JVVMRKP@ch.Jayaprakash Social Activist: Ok.... 5, 6 ,7 &8 చాప్టర్ లపై సోమవారం (4th మే).. అందరూ ఒకసారి పుస్తకం చదివి హాజరై చర్చలో చురుకుగా పాల్గొంటే బాగుంటుందనుకుంటున్నా

[01/05, 6:37 PM] +91 98498 04467: Yes close చేయండి. చర్చలు కొనసాగుతూ ఉంటాయి

[01/05, 6:38 PM] JVVMRKP@ch.Jayaprakash Social Activist: మిత్రులారా! ఈరోజు గ్రూపులో చర్చను ప్రిసైడ్ చేసిన సుబ్రహ్మణ్యం గారికి రాష్ట్ర పరిశీలకులు రాహుల్ గారికి ప్రత్యేక ధన్యవాదములు.చర్చ  లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ అభినందనలు.

✊ముఖ్యంగా ఎంతో కష్టపడి రాత పూర్వకంగానూ, ఆడియో మెసేజ్ లు ద్వారాను చాప్టర్ల వారీగా  విషయాలను  వివరించేందుకు కష్టపడిన మాల్యాద్రి గారికి, అంజమ్మ మేడం గారికి, శ్రీనివాసులు గారికి మరియు వెంకటేష్ యూత్ కి ఉదయ పూర్వక అభినందనలు ధన్యవాదములు🙏💐💐💐💐


1,2,3,4 భాగాల ముగింపు సందేశం - కుర్రా రామారావు గారు 


[04/05, 9:47 AM] JVVMRKP@ch.Jayaprakash Social Activist: GOOD MORNING 💐💐    

        మిత్రులారా! 

ఈరోజు సాయంత్రం  *అయిదు గంటల నుండి ఆరున్నర గంటల వరకు 'వేద భూమి' పుస్తకంపై చర్చ- అధ్యయనం* కలదు.

      Note:4,5,6,7,8చాప్టర్లపై!

[04/05, 5:33 PM] JVVADK@KPothuraju: VEDHA BHUMI   5  th chapter  (K.POTHURAJU) SA(PS)ZPHS MEDARAMETLA

వేదభూమి చాప్టర్ 5 - కె.పోతురాజు గారు 

వేదభూమి చాప్టర్ 5 పిడిఎఫ్

[04/05, 5:41 PM] JVVMRKP@ch.Jayaprakash Social Activist: 6️⃣☝️ చాప్టర్ ...by T.V.Narsimharao గారు
[04/05, 11:58 AM] JVVMRKP@ch.Jayaprakash Social Activist: ☝️పైన ఏడవ భాగం  పై పోస్ట్ చేయబడిన 3 ఆడియో మెసేజ్ లు మొత్తంగా 9 నిమిషాల లోపువే.

 4,5,6 మరియు 7 భాగాలకు సంబంధించిన స్టడీ మెటీరియల్ సంక్షిప్త పాఠాలను మీరు ప్రిపేర్ కావడం కోసం ముందస్తుగా పోస్ట్ చేయడమైనది..

ఎనిమిదో చాప్టర్ పై నాలుగు గంటల వరకు పోస్ట్ చేయడం జరుగుతుంది.

అందరూ సాయంత్రం జరిగే స్టడీ సర్కిల్ చర్చ- అధ్యయనం కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం💐💐💐💐

[04/05, 5:01 PM] JVVMRKP@ch.Jayaprakash Social Activist: మిత్రులారా!

 ఈరోజు స్టడీ సర్కిల్ చర్చను  కుర్ర రామారావు గారు( జెవివి రాష్ట్ర ఉపాధ్యక్షులు)అధ్యక్షత వహించి మన కార్యక్రమాన్ని నడిపిస్తారు

[04/05, 5:07 PM] JVVMRKP@ch.Jayaprakash Social Activist: 8వ Chapter వీరమ్మ మేడమ్ గారు ప్రజెంట్ చేశారు.

వేదభూమి చాప్టర్ 8 - వీరమ్మ గారు 

written images ch 8

[04/05, 5:11 PM] +91 99486 62296: మధ్యయుగంలో భక్తి ఉద్యమం రావడానికి ప్రధాన కారణం?
[04/05, 5:58 PM] +91 99486 62296: భారతదేశంలో లోఆర్యులు రాకముందు ఎలాంటి కుల & వర్ణ వ్యవస్థ ఉండేది?

జవాబు - రామారావు గారు 

జవాబు - సరోజినీ గారు 

[04/05, 6:18 PM] JVVMRKP@ch.Jayaprakash Social Activist: మిత్రులారా!

 ఈరోజు 'వేద భూమి' పుస్తకంపై 4th to 8 th చాప్టర్ల ప్రజెంటేషన్ ...ఎన్. టి వెంకటేష్, కె.పోతురాజు, టీ.వీ. నరసింహారావు, టి. సరోజిని, జి .వీరమ్మ గార్లు ఆడియో మెసేజ్ ల ద్వారా మరియు రాతపూర్వకంగా ప్రజెంట్ చేశారు.వారంతా చాలా కష్టపడి ప్రిపేర్ చేసి ప్రజెంట్ చేశారు.🙏

వారందరికీ పేరుపేరునా  ధన్యవాదాలు 💐💐💐


ఈరోజు చర్చలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు🤝

ఈరోజు స్టడీ సర్కిల్ చర్చను నడిపించిన కుర్ర రామారావు గారికి ప్రత్యేక ధన్యవాదములు💐💐

Wednesday, 29 April 2020

కరోనా నేపథ్యంలో ప్రజారోగ్యం :: డా||సీతారామ శాస్త్రి గారు

కరోనా నేపథ్యంలో ప్రజారోగ్యం :: డా||సీతారామ శాస్త్రి గారు జెవివి ప్రకాశం స్టడీ సర్కిల్ కొరకై నిర్వహించబడిన చర్చా కార్యక్రమం

[27/04, 4:26 PM] JVVMRKP@Dr.DSarat: 
HEALTH లేదా ఆరోగ్యం ఆఫీషియల్ W.H.O
డెఫినేషన్:::::::::::

"A state of complete physical,mental and social well-being,NOT merely the absence of disease or  infirmity."

ఓ మనిషి జబ్బులు లేకుండా ఉండటమో బలహీనంగా  ఉండటం   కాదు........

  సంపూర్ణంగా భౌతికంగా మానసికంగా మరియు సామాజికంగా మంచి స్థితిలో ఉండటమే  "ఆరోగ్యం" అని నిర్వచనం

[27/04, 4:27 PM] JVVMRKP@Dr.DSarat:
 ప్రజారోగ్యం అంటే ఏమిటి?

[27/04, 4:41 PM] JVVMRKP@Dr.DSarat:
 "ఆరోగ్యం  అనేది సామాజిక శాస్త్రం..... రాజకీయం అంటే విస్తృత స్థాయిలో ఉన్న ఆరోగ్య శాస్త్రమే.... వైద్యం/ఆరోగ్యం  అనేది సామాజిక  సమస్య కాబట్టి అది సమాజం సమస్య లను ఎత్తి చూపుతూ పరిష్కారం చూపవలసిన బాధ్యత కలిగి ఉంది. దానిని సాధించే పని రాజకీయ వ్యవస్థ లకు ఉంది  "...

రుడాల్ఫ్ విర్షో అనే శాస్త్రవేత్త 200 సంవత్సరాల క్రితం చెప్పిన మాట....

ఇప్పటికీ నిజమేనా?

[27/04, 4:43 PM] JVVMRKP@Dr.DSarat:
 ఆరోగ్యం  కూ ఆర్థిక స్థితి కీ   సంబంధం ఏమిటి?

[27/04, 4:44 PM] JVVMRKP@Dr.DSarat:
 ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్యం( PUBLIC PRIVATE PARTNERSHIP) ఎంత వరకూ కరెక్ట్? అందులో లోటుపాట్లు ఏమిటి?

[27/04, 4:45 PM] JVVMRKP@Dr.DSarat: 
GDP కూ ఆరోగ్యం కూ మధ్య సంబంధం ఏమిటి?

[27/04, 5:06 PM] JVVMRKP@Dr.DSarat: 
ఈ చర్చ ను కొరోనా మీద కాకుండా...... ఓవర్ అల్ గా ప్రజారోగ్యం -- దాని నిర్లక్ష్యం -- సవాళ్లు -పరిష్కారం లాగా చర్చ చేయమని కోరుతున్నాను

[27/04, 5:07 PM] JVVMRKP@ch.Jayaprakash Social Activist: 
మిత్రులారా! కరోనా నేపథ్యంలో ప్రజారోగ్యం' పై డా"సీతారామ శాస్త్రి గారు వాయిస్ మెసేజ్ ప్రారంభ సందేశం (


[27/04, 5:20 PM] JVVMRKP@Dr.DSarat: 
ప్రజారోగ్యం ఎలా నిర్లక్ష్యం చేయబడింది?

[27/04, 5:26 PM] JVVMRKP@ch.Jayaprakash Social Activist: 
మిత్రులారా! కరోనా ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటినీ చుట్టుముట్టింది‌. అందుకని ఆయా దేశాల్లో ఉన్న ప్రజారోగ్య వ్యవస్థ ఎటువంటిది? ఇటువంటి health ఎమర్జెన్సీని ఏ దేశాలు ఏ రకంగా ఎదుర్కొన్నాయి? వాటి మంచి చెడులు డాక్టర్ సీతారామ రామశాస్త్రి గారు వివరించారు.



[27/04, 5:30 PM] +91 98498 04467: భారత దేశంలో కార్పొరేట్ వైద్యం  ప్రారంభం నుంచి ప్రజా వైద్యం నిర్లక్ష్యం చేయడం ప్రారంభమైంది

[27/04, 5:31 PM] JVVMRKP@Dr.DSarat: 
నిర్లక్ష్యం చేయబడిన విధానం ఇలా చూడవచ్చు.
1) ప్రభుత్వం నిధులు తగ్గించటం.
2)నిధుల కొరత చూపి ప్రయివేటు భాగస్వామ్యం చేయటం
3)చివరగా సంపూర్ణంగా  ప్రయివేటు పరం చేయటం.

ఇలా ప్రయివేటు పరం కానున్న వైద్యం కేవలం లాభం వచ్చిన జబ్బులు మాత్రమే చికిత్స చేస్తున్నారు తప్ప ప్రజారోగ్యం వేదిక గా చేయదు.


[27/04, 5:32 PM] +91 98498 04467: ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్య శ్రీ తో  ప్రజారోగ్య నిర్లక్ష్యం ఉచ్చ స్థాయి కీ చేరింది

[27/04, 5:35 PM] JVVMRKP@Dr.DSarat: 
ఇన్సూరెన్స్ కంపెనీలు ఆరోగ్య వ్యవస్థ మీద ఎలా ప్రభావితం చేస్తున్నాయి? 


మనలాంటి దేశాల్లో ఇది కరెక్టా?

[27/04, 5:37 PM] JVVMRKP@Dr.DSarat: 
మనం పేపర్ లో చూసే
" కార్పొరేట్ స్థాయిలో మేమూ వైద్యం అందిస్తాము" అనే పదం కరెక్టే నా?

ఒక వ్యక్తి లేదా సంస్థ మంచి 
ఆసుపత్రి  ఇవ్వగలిగితే మన వ్యవస్థ ఎందుకు  ఇవ్వలేకపోతున్నది?

[27/04, 5:41 PM] +91 75694 95186: నిజమే సార్ ప్రకృతి లో జీవరాశుల మధ్య నిరంతరం మనుగడ కోసం నిరంతర పోరాటం అనేది జరుగుతూనే వుంది. ఆ పోరాటంలో జయించిన జీవులే ప్రకృతి లో మనుగడ సాగించడం జరుగుతుంది.దీన్ని డార్విన్ అనే శాస్త్రవేత్త ఎంతో క్లుప్తంగా వివరించారు


[27/04, 5:47 PM] JVVMRKP@GUmamaheswari: 
కరోనా నేపథ్యంలో ప్రజారోగ్యం' పై డా"సీతారామ శాస్త్రి గారు ఆడియో మెసేజ్ ల ద్వారా చక్కటి విశ్లేషణ ను అందించారు థన్యవాదాలు

[27/04, 5:47 PM] +91 98498 04467: కరెక్ట్ కాదు. ప్రభుత్వ వ్యవస్థకు ఏ వ్యవస్థ కూడా సరి కాదని ఇప్పుడు నిరూపించబడింది. మన రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా, ఆరోగ్యం  నిర్లక్ష్యం చేయబడినంత ఏ రాష్ట్రంలో జరగలేదు

[27/04, 5:54 PM] JVVMRKP@ch.Jayaprakash Social Activist: 
ప్రభుత్వాల దగ్గర మన ఆర్థిక వివరాలు ఆదాయ వివరాలు ఉన్నాయి గాని మన ఆరోగ్య ప్రొఫైళ్లు ఉండవు శోచనీయమైన విషయం😢

[27/04, 6:03 PM] +91 99486 62296: భారతదేశంలో ఆరోగ్యం విద్య మిగతా దేశాలతో పోల్చుకుంటే చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి కారణం ఆరోగ్యం విద్య పట్ల ప్రభుత్వాలు నిశిత దృష్టితో చూడలేకపోవడం విద్యలో ఆరోగ్యంలో హ్యూమన్ డెవలప్మెంట్ లో నార్వే మొదటి స్థానంలో ఉందిగత పది సంవత్సరాల ఇండెక్స్ తీసుకుంటే భారతదేశం 130 నుంచి 142 స్థానాల మధ్య కొట్టుమిట్టాడుతోంది దీనికి ఏకైక కారణం మూఢత్వం, ప్రభుత్వాల అసమర్థత, ప్రశ్నించే వాళ్ళు తక్కువగా ఉండటం

[27/04, 6:43 PM] Sree: 
భారత దేశంలోని ప్రజారోగ్య వ్యవస్థను గురించి Dr. సీతారామ శాస్త్రి గారు 4 భాగాలలో తమ విస్తృత సందేశాన్ని చక్కగా వివరించారు. ఈ సందేశంలో ప్రజారోగ్యం అనేది సామాజిక ఆరోగ్యం తో ఏ విధంగా ముడిపడి ఉంది, అది ఏ విధంగా నిర్లక్ష్యం చేయబడుతోంది అనే విషయాన్ని  విపులీక రించినందుకు    వారికి మా జెవివి, మార్టూరు శాఖ తరపున ధన్య వాదములు.

[27/04, 6:52 PM] JVVMRKP@ch.Jayaprakash Social Activist: 
డాక్టర్ సీతారామశాస్త్రిగారు భారతదేశ ప్రజారోగ్య వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో వివరించారు.ఆ వ్యవస్థని బలోపేతం చేయడానికి సైన్స్ కార్యకర్తలు, విద్యావంతులు కృషి చేయాల్సిన ఆవశ్యకతను తెలియపర్చారు.

🪐గత రెండు రోజులుగా డాక్టర్ గారితో అనేక పర్యాయాలు ఫోన్లో మాట్లాడుతూ అనేక విషయాలు... వారి వద్ద నుండి అయిదు(5) ఆడియో మెసేజ్ లో పొందు పరచడమైనది.ఈ ఆడియో మెసేజ్ లన్ని కలిపి మరోసారి వినండి.శాస్త్రీయంగా అనేక విషయాలు analyse చేశారు డాక్టర్ గారు.మంచి వివరణాత్మక విశ్లేషణ, సమాచారం అందించారు.


💐స్టడీ సర్కిల్ కోసం వారి విలువైన సమయాన్ని కేటాయించినందుకు  డాక్టర్ సీతారామశాస్త్రి గార్కి ధన్యవాదాలు💐🙏🙏
 @JVV సోషల్ మీడియా విభాగం ,ప్రకాశం జిల్లా. వారి తరపున ధన్య వాదాలు.

[27/04, 7:05 PM] JVVMRKP@ch.Jayaprakash Social Activist: ఈరోజు స్టడీ సర్కిల్ నిర్వహణ కు ప్రిన్సిపాల్/అధ్యక్షత వహించిన కుర్రా రామారావు,(JVV state) గారికి,JVV రాష్ట్రపరిశీలకులు/Advisor గా హాజరైన రాహుల్ గారికి  ప్రత్యేక ధన్యవాదములు💐💐💐🙏🙏

చర్చా కార్యక్రమం ముగిసింది.

Sunday, 26 April 2020

కొవిడ్-19 రాజకీయార్థిక పరిచయం పార్ట్ 2 :: మనీష్ ఆజాద్


(హిందీ నుంచి ఇంగ్లిష్: హసన్ ప్రీత్, తెలుగు: ఎన్ వేణుగోపాల్)

(నిన్నటి పోస్ట్ తరువాయి)

ఈ కంపెనీలు మాంసం ఉత్పత్తి చేయడం మాత్రమే కాదు, తీవ్రమైన వ్యాధులకు కారణమయ్యే వైరస్ లను కూడ సాగు చేస్తాయని రాబ్ వాలేస్ మరో చోట రాశారు.

ఇదే పరిస్థితి వ్యవసాయంలో కూడ సాగుతున్నది. నిజానికి వృక్షజాతుల జన్యు నిర్మాణం అంత క్లిష్టమైనది కాదు గనుక,
సులభతరమైనది గనుక వ్యవసాయంలో జన్యు సాంకేతిక పరిజ్ఞానాన్ని చాల విస్తృతంగా వాడుతున్నారు. దానితో పాటు వ్యవసాయంలో పురుగుల మందులు, కలుపు మందులు (క్రిమి సంహారకాలు, గుల్మ నాశనులు) విపరీతంగా వాడుతున్న తీరు వల్ల, అవి భూమండల ఉష్ణోగ్రతలు పెరగడానికి మాత్రమే కాక, మొత్తంగా భూగోళపు సమస్త వాతావరణంలో నిర్ణయాత్మకమైన, గుణాత్మకమైన మార్పులకు దారి తీశాయి.

పందులకు ఆహారంగా సోయాబీన్ పిండి పెడుతున్నారు గనుక, సోయాబీన్ సాగు విస్తీర్ణం పెంచడానికి బ్రెజిల్ లో అమెజాన్ అడవులను నరికి సాగు భూమిగా మార్చారు. తత్ఫలితంగా, అక్కడి పర్యావరణ సమతుల్యత దెబ్బతినడంతో పాటు, అప్పటివరకూ ఆ అరణ్యాలలో ఇతర జీవజాతులతో సంబంధం లేకుండా స్థానికంగా ఉండిపోయిన వైరస్ లతో మనుషులు ప్రత్యక్ష సంబంధంలోకి వచ్చారు. ప్రకృతి ఎంత సంక్లిష్ట నిర్మాణంతో ఉంటుందంటే ఎన్నో ప్రమాదకరమైన వైరస్ లను అది స్థానికతా ‘గృహాలలో’ నిర్బంధించి పెడుతుంది.

ఒక శాస్త్రీయ పరిశోధన ప్రకారం, అమెజాన్ అరణ్యాల నరికివేత ఏ పద్ధతిలో జరుగుతున్నదంటే, రానున్న 15 సంవత్సరాలలో అమెజాన్ ప్రాంతంలో కార్బన్ ను స్వీకరించే విశాల క్షేత్రమంతా కార్బన్ ను విడుదల చేసే ప్రాంతంగా మారిపోతుంది. పెట్టుబడిదారీ లాభాపేక్షతో మనం ఈ ప్రకృతి సహజమైన సంక్లిష్ట నిర్మాణంలో జోక్యం చేసుకుని, దాన్ని ఏకరూపకంగా మార్చినప్పుడు, మనం కచ్చితంగా వైరస్ లకు రాజమార్గాలు నిర్మిస్తున్నామన్నమాట.

ఇదే పద్ధతిలో పెట్టుబడిదారీ పారిశ్రామిక వ్యవసాయం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని తమ భూముల నుంచి బేదఖలు చేసింది. అప్పుల ఊబిలో దించిన ఫలితంగా రైతులు ఆత్మహత్యలు చేసుకునే స్థితి వచ్చింది. అది మొత్తం పర్యావరణాన్ని విషపూరితం చేసింది.

ఇవాళ విత్తనాల, పురుగుమందుల రంగంలో ఉన్న కంపెనీలలో అత్యధికం మొదటి, రెండో ప్రపంచ యుద్ధ కాలాల్లో, వియత్నాం యుద్ధ కాలంలో విషపూరిత వాయువులను ఉత్పత్తి చేస్తూ ఉన్నాయనేది ఒక ఆశ్చర్యకరమైన వాస్తవం. డ్యుపాంట్, మోన్సాంటో, డౌ కెమికల్ వంటి కంపెనీలు అమెరికాకూ, మిత్రరాజ్యాలకూ విషవాయువులను సరఫరా చేయగా, బేయర్ వంటి అగ్రశ్రేణి పురుగుల మందుల కంపెనీలు హిట్లర్ కు విషవాయువులను సరఫరా చేశాయి. డౌ కెమికల్, మోన్సాంటో వంటి కంపెనీలు వియత్నాం యుద్ధ సమయంలో అమెరికన్ సైన్యానికి ‘ఏజెంట్ ఆరెంజ్’ అనే కుఖ్యాతి పొందిన విషవాయువునూ, నాపామ్ బాంబునూ సరఫరా చేశాయి.

ఇక ‘శాంతి కాలం’లో, ప్రస్తుతం, ఈ కంపెనీలు అదే విషపూరిత రసాయనాలను పురుగుల మందులుగా మార్చి పర్యావరణాన్ని దెబ్బతీయడానికి వాడుతున్నాయి. ఒక ప్రతిష్ఠాత్మక పత్రికలో ప్రచురితమైన పత్రాన్ని ఉటంకిస్తూ, పంటల మీద కొట్టే పురుగుల మందులలో 99.9 శాతం నేరుగా పర్యావరణంలోకి వెళతాయని, కేవలం 0.1 శాతం మాత్రమే లక్ష్యాన్ని చేరుతాయని సుప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త దేవిందర్ శర్మ అన్నారు. ఈ 99.9 శాతం విష రసాయనాల వల్ల జీవజాతులకు సహకారిగా, స్నేహంగా ఉండే ఎన్నో రకాల బాక్టీరియా, వానపాముల వంటి ప్రయోజనకరమైన జీవజాతులు అంతరిస్తాయి.

మన దేశంలో పంజాబ్ లో పంటపొలాల్లో వాడిన పురుగుల మందులకూ అక్కడ పెరుగుతున్న కాన్సర్ వ్యాధి పీడితుల సంఖ్యకూ ఉన్న సంబంధం ఇప్పటికే అందరికీ తెలిసిందే. భటిండా నుంచి బికనేర్ కాన్సర్ ఆస్పత్రికి వెళ్లే రైలును అక్కడ ‘కాన్సర్ ఎక్స్ ప్రెస్' అని పిలుస్తున్నారు. దీనికి ‘జియో ఇంజనీరింగ్' నూ యుద్ధ పరిశ్రమనూ జోడిస్తే పరిస్థితి భయానకంగా మారిపోతుంది.

ఇది ఎంగెల్స్ ద్విశత జయంతి సంవత్సరం. మార్క్స్, ఎంగెల్స్ లు తమ కాలంలో పెట్టుబడిదారీ విధానపు ధోరణిని అర్థం చేసుకుని, పెట్టుబడిదారీ విధానం గురించి తమ అధ్యయనాలలో దాన్ని ప్రస్తావించారు. "ప్రకృతి తో వ్యవహరించేటప్పుడు, ఓడించిన విదేశీ ప్రజల పట్ల ప్రవర్తించే విజేత లాగ, ప్రకృతి నుంచి బైట నిలబడినవారిలాగ, అధికారం చలాయించలేమని ప్రతి అడుగునా మనకది గుర్తు చేస్తుంది. అందుకు భిన్నంగా, మనం మన రక్తమాంసాలతో, మెదడుతో ప్రకృతికి చెందినవాళ్లం. దాని మధ్య మనుగడ సాగించవలసిన వాళ్లం. దాని మీద మన ఆధిపత్యమంతా కేవలం మిగిలిన అన్ని జీవజాతులకన్న భిన్నంగా దాని నియమాలను అర్థం చేసుకోగలమనీ, ఆ నియమాలను సరిగ్గా అన్వయించగలమనీ మాత్రమే” అని ఎంగెల్స్ అన్నాడు.

పెట్టుబడిదారీ విధానానికి ముందు ఉన్న వర్గ వ్యవస్థలేవైనా కేవలం శ్రమను మాత్రమే దోపిడీ చేసేవి. శ్రమతో పాటు ప్రకృతిని కూడ దోపిడీ చేసే మొట్టమొదటి వర్గవ్యవస్థ పెట్టుబడిదారీ విధానం. కాని దాని దుష్ఫలితాలను మాత్రం యావత్తు మానవ జాతి అనుభవించవలసి వస్తుంది.

2011కూ 2018కీ మధ్య 172 దేశాల్లో మొత్తం 1,483 విస్తృతమైన అంటువ్యాధులు ప్రబలాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ఇందుకు కారణమైన వైరస్ లను, ప్రధానంగా ఇన్ ఫ్లుయెంజా, సార్స్, ఎం ఇ ఆర్ ఎస్, ఇబోలా, జికా, ప్లేగ్, ఎల్లో ఫివర్ వగైరాలను, అధ్యయనం చేసిన గ్లోబల్ ప్రిపేర్డ్ నెస్ మానిటరింగ్ బోర్డ్ (జిపిఎంబి), ఇవాళ్టి కరోనా లాంటి మహా విపత్తు త్వరలో బైటపడనున్నదని కచ్చితమైన హెచ్చరికను 2019 సెప్టెంబర్ లోనే ఇచ్చింది. ‘ప్రమాదంలో ప్రపంచం’ (ఎ వరల్డ్ ఎట్ రిస్క్) అనే శీర్షికతో వెలువడిన ఆ నివేదికను పరిగణనలోకి తీసుకునేవాళ్లు ఒక్కరూ లేకపోయారు.

అంతే కాదు, 2003-04లో వచ్చిన సార్స్ మహామ్మారికి ముందే శాస్త్రవేత్తలు కరోనా కుటుంబానికి చెందిన ఒక వైరస్ భవిష్యత్తులో మహా ప్రమాదకరంగా మారనున్నదని హచ్చరిక విడుదల చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాల ప్రజా ఆరోగ్య వ్యవస్థలకు మూడు సంవత్సరాల కిందనే ఒక హెచ్చరిక జారీ చేసింది. ఒకానొక వైరస్ మహా భయానకమైన మహమ్మారిని సృష్టించబోతున్నదని, అన్ని ప్రభుత్వాలు ఆ సవాలును ఎదుర్కోవడానికి సమాయత్తం కావాలని ఆ హెచ్చరిక చెప్పింది.

ఈ హెచ్చరికలను విని ఉంటే పరిశోధనా కార్యక్రమాలు చేపట్టవలసి ఉండింది. తమ ప్రజారోగ్య సేవల వ్యవస్థలను బలోపేతం చేసి భవిషత్తు అవసరాలకు సంసిద్ధం చేసి ఉండవలసింది. కాని ఆ పనులు చేయవలసిన సామ్రాజ్యవాద - పెట్టుబడిదారీ వ్యవస్థ 2007-08 సంక్షోభం తర్వాత తానే స్వయంగా ఐసియులో ఉన్నప్పుడు అది భవిష్యత్తుకు ఎలా సంసిద్ధం కాగలుగుతుంది? 90 ట్రిలియన్ డాలర్ల విలువైన ప్రపంచ పెట్టుబడిదారీ విధానం తనంతట తానే 270 ట్రిలియన్ డాలర్ల రుణభారం కింద మూలుగుతున్నప్పుడు అది ఏ జాగ్రత్తలు తీసుకోగలుగుతుంది?

ప్రపంచంలోని అనేక దేశాలలో అంతవరకూ ఎంతో కొంత ఉండిన "ప్రజా" రంగం కూడ ప్రైవేటీకరణ తుపానులో ధ్వంసమైపోయింది. ప్రతి వ్యవస్థనూ, నిర్మాణాన్నీ ప్రైవేటు రంగానికి అప్పగించారు. చాల దేశాల్లో ప్రభుత్వ వైద్య ఆరోగ్య సేవా రంగాలు ధ్వంసమైపోయాయి. అమెరికా, బ్రిటన్ లలో ప్రభుత్వ ఆరోగ్య సేవల రంగాలను ఎట్లా ధ్వంసం చేశారో మైకేల్ మూర్, జాన్ పిల్జర్ లు తీసిన డాక్యుమెంటరీలు చూస్తే అర్థమవుతుంది.

మరొక వంక, తక్షణ లాభాలు లేని రంగాలలో ప్రైవేట్ కంపెనీలు పరిశోధనలు ఎందుకు సాగిస్తాయి? ఇది స్పష్టంగా అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చూడాలి. జన్యు చికిత్స మీద పరిశోధన చేస్తున్న ఒక కంపెనీకి సంబంధించిన ఇమెయిల్స్ పొరపాటున బైటపడ్డాయి. ఆ కంపెనీలో మదుపు పెట్టిన గోల్డ్ మాన్ సాక్స్ రాసిన ఇమెయిల్ లో జన్యువులో మార్పులు చేసి అసలు అనారోగ్యమే రాకుండా చేయడానికి పరిశోధనలు జరపడం 'సుస్థిరమైన వ్యాపార తర్కం' కాదు అని మందలించారు. జబ్బు అనేది ఎప్పుడూ వస్తూ ఉండడమే ఎప్పుడూ లాభాలు తెచ్చి పెడుతుంది. అసలు జబ్బే రాకుండా చేయడమంటే లాభాలు రాకుండా చేయడమే. అంటే అది సుస్థిరమైన వ్యాపార తర్కం కాదు.

ఇంతకూ వాస్తవమేమంటే, 2020 ప్రారంభంలో అల్లకల్లోలం చేయడానికి వచ్చిన కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవలసిన ప్రపంచాన్ని అప్పటికే ముప్పై సంవత్సరాలుగా ప్రపంచీకరణ చెదలు తినేస్తున్నది. ఆ ప్రపంచపు వాస్తవ దృశ్యాన్ని గుర్తించడానికి మీరు కేవలం రెండు అంశాలు చూస్తే చాలు:

ఒకటి, ఈ భూమిని తొమ్మిది సార్లు ధ్వంసం చేయడానికి తగిన ఆయుధ సామగ్రి మన దగ్గర ఉంది గాని, అదే సమయంలో మన దగ్గర జీవితాన్ని నిలపడానికి అవసరమైన వెంటిలేటర్లు మాత్రం కావలసినన్ని లేవు. ఈ వెంటిలేటర్ల తీవ్రమైన కొరతే ఇవాళ కరోనా వల్ల జరిగే మరణాలకు ప్రధాన కారణం కానుంది.

రెండోది, ఇవాళ ప్రపంచంలోని 2,153 మంది సహస్ర కోటీశ్వరుల దగ్గర ఉన్న సంపద, 406 కోట్ల మంది దగ్గర ఉన్న సంపదతో సమానం. ఈ ప్రపంచీకరణ వ్యవస్థకు నిర్మాత అయిన అమెరికా ప్రస్తుతం అత్యంత దారుణమైన దుస్థితిని అనుభవిస్తున్నదంటే కారణం అదే. అందుకు భిన్నంగా, ఒక భిన్నమైన సామాజిక ఆర్థిక వ్యవస్థ ఉన్న క్యూబా మెరుగైన స్థితిలో ఉన్నది. క్యూబా కరోనాను అదుపులో పెట్టడం మాత్రమే కాదు, కరోనా వ్యతిరేక పోరాటంలో ప్రపంచంలోనే అగ్రశ్రేణిలో ఉండి 62 దేశాలకు తన వైద్యులను, ఔషధాలను పంపిస్తున్నది. ఇతరదేశాలకు సైన్యాన్ని, ఆయుధాలను పంపించే పని అమెరికా చేస్తుండగా, వైద్యులను, ఔషధాలను పంపించే పని క్యూబా చేస్తున్నది. రెండు భిన్నమైన సామాజిక వ్యవస్థల మధ్య తేడా ఇదే. ఒకటి మృత్యువును ఎగుమతి చేసే వ్యవస్థ, మరొకటి జీవితాన్ని ఎగుమతి చేసే వ్యవస్థ.

వాస్తవానికి, ప్రఖ్యాత రచయిత నౌమి క్లీన్ అన్నట్టు, భూకంపం, తుపాను, మహమ్మారి వంటి ఉత్పాతం వచ్చినపుడు పాలకవర్గాలు తమ భావజాలాన్ని వదులుకోవు, మరింత గట్టిగా అంటిపెట్టుకుంటాయి. అందువల్లనే ఇంతటి ఉత్పాతంలో కూడ అవి తమ వర్గ ప్రయోజనాల మీద, భవిష్యత్తు లాభాల మీద దృష్టి పోగొట్టుకోవడం లేదు. అవి ఇంతకాలమూ అణచిపెట్టుకున్న అత్యాశలు కూడ ఇటువంటి సమయంలోనే బైటపడతాయి. వాటిని తీర్చుకోవడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తాయి.

గత సంవత్సరం, 2019 ఒక గొప్ప నిరసన ప్రదర్శనల, ఉద్యమాల సంవత్సరం. చాల మంది రాజకీయ విశ్లేషకులు ఆ సంవత్సరాన్ని 1848తో, 1968తో పోల్చారు. ఆ సంవత్సరం భూగోళంమీద ఏ ఒక్క మూల కూడ భారీ ప్రజా ప్రదర్శనలు చూడకుండా లేదు. భారతదేశంలో కూడ ఈ కాలంలోనే సిఎఎ కు వ్యతిరేకంగా బ్రహ్మాండమైన ప్రదర్శనలు జరిగాయి. కరోనా సాకుతో పాలకవర్గాలు ఈ ఉద్యమాలన్నిటినీ తక్షణమే మూసివేయడంలో విజయం సాధించాయి. ప్రపంచవ్యాప్తంగా అంతటి భారీ స్థాయి ప్రజా రాజకీయ ఉద్యమాలు కరోనా సాకుతో మరణించడం, కరోనా మరణాల కన్న తక్కువదేమీ కాదు. ఇవాళ ప్రపంచమంతటా కరోనా మరణాల గురించి పత్రికలు హోరెత్తుతున్నాయి. మన దేశంలో షాహీన్ బాగ్ నిరసన ప్రదర్శనలు ఎలా ముగిసిపోయాయో ప్రతి ఒక్కరికీ తెలుసు.

ప్రపంచమంతటా మాంద్యం ముసురుకుంటున్నప్పుడు, తమ లాభాల వాటాను కాపాడుకోవడానికి కంపెనీలు తమ కార్మికులను, ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించడానికి కంకణం కట్టుకున్నాయి. కాని అవి ఆ పని చేయడానికి తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతూ ఉండింది. ఇప్పుడు కరోనా వారికి మహా అవకాశం ఇచ్చింది. ఈ కాలంలో మొత్తం ఎంతమందిని ఉద్యోగాలనుంచి తొలగించారో వాస్తవ గణాంకాలు తర్వాత బైటపడతాయి. కాని ఈలోగా మనం వాస్తవాల ఆధారంగా కొన్ని అంచనాలు వేయవచ్చు. ఒక్క అమెరికాలోనే ఒక కోటీ ఎనబై లక్షల మంది గత రెండు నెలల్లో కొత్తగా నిరుద్యోగ భృతికి దరఖాస్తు పెట్టుకున్నారు. 1929-30 నాటి మహా సంక్షోభం తర్వాత ఇంతమంది నిరుద్యోగులు కావడం ఇప్పుడే.

ఈ కరోనా మహావిపత్తు కాలంలో అనేక దేశాల ప్రభుత్వాలు ఎటువంటి నిరంకుశ పద్ధతులను అమలు చేస్తున్నాయో చూస్తే, అవి వాళ్ల పీడనా కాంక్షను వ్యక్తీకరిస్తున్నాయనిపిస్తున్నది. హంగరీతో సహా ఎన్నో దేశాలు నేరుగానే అత్యవసర పరిస్థితిని ప్రకటించాయి. మన దేశంలో కూడ, మోడీ స్పష్టంగానే 'సామాజిక అత్యవసర పరిస్థితి' గురించి మాట్లాడాడు. నిజానికి ఇది భారత్ వంటి మూడో ప్రపంచ దేశాలలో దారుణంగా ఉంది. మార్చ్ 21న, కొలంబియాలోని బొగొటా జైలులో కరోనాతో వ్యవహరించడానికి తగిన మెరుగైన పరిస్థితులు కల్పించమని అడిగిన ఖైదీల మీద పోలీసులు దాడిచేసి, కాల్పులు జరిపి 23 మంది ఖైదీలను చంపేశారు. కెన్యాలో వీథుల్లో పోలీసు కాల్పుల్లో చనిపోయిన వారి సంఖ్య కరోనాతో చనిపోయినవారి సంఖ్య కన్న ఎక్కువ. మామూలు సందర్భాల్లోనైతే ఇవి ప్రధాన వార్తలు అయి ఉండేవి. కాని కరోనా కాలంలో ఈ వార్తలకు దిక్కే లేదు.

వివిధ దేశాల ప్రభుత్వాలు, ఇంటర్నెట్ కంపెనీలు కలిసి కరోనా సాకుతో తమ దేశాలను అక్వేరియంలలాగ మార్చేశాయి. పౌరుల ప్రతి చర్యా నిఘాకు గురవుతున్నది. మామూలు సమయాల్లోనైతే ఇంత నిఘా ఉంటే తీవ్రమైన వ్యతిరేకత వచ్చేది, కాని ప్రస్తుత స్థితి ఒక "కొత్త సాధారణ స్థితి" లాగున్నది. ఇవాళ మన ముందర గూఢచారి పెట్టుబడిదారీ విధానం దాని నగ్నరూపంలో ఉన్నది. జార్జి ఆర్వెల్ రాసిన 1984 ఇవాళ ఇంకెంతమాత్రమూ ఒక నవల కాదు, ఒక కఠోర వాస్తవం. విచిత్రమైన విషయమేమంటే ఆ నవల రాసినప్పుడు, దాన్ని సినిమాగా తీసినప్పుడు సోషలిజం మీద విమర్శగా వెలువరించారు. ఇవాళ పెట్టుబడిదారీ విధానమే ఆ నవలలో, సినిమాలో చూపినదానికన్న ఘోరంగా ఉండగలనని చూపుకుంటున్నది. ఆలోచనల మీద నిఘా, ఆలోచనల మీద పోలీసులు అనే మాటలు ఇవాళ కనీసం భారతదేశంలో అక్షరాలా నిజాలయ్యాయి. నేనీ వాక్యం రాస్తున్నప్పుడే, కరోనా విషయంలో ప్రభుత్వ వైఫల్యం గురించి ఫేస్ బుక్ మీద వ్యాఖ్య రాసినందుకు ఇంఖిలాబి మజ్దూర్ కేంద్ర కు చెందిన కైలాష్ భట్ ను అరెస్టు చేశారని వార్త వస్తున్నది.

కరోనా ధనికులకూ పేదలకూ మధ్య వ్యత్యాసం చూపదని ప్రధానస్రవంతి ప్రచార సాధనాలు పదే పదే చెపుతున్నాయి. కాని అన్ని సందర్భాలలో లాగనే ఈ సందర్భంలో కూడ ప్రధానస్రవంతి ప్రచారసాధనాల మాట తప్పు. అన్ని రకాల ఆర్థిక సామాజిక విభజనలను కరోనా పూర్తిగా బలోపేతం చేస్తున్నది. మనం అమెరికాలోని అంకెలనే పరిశీలిస్తే, మరణాలలో 70 శాతం నల్లజాతి వారివి, ఆఫ్రికన్ అమెరికన్లవి. ఇప్పుడు కరోనా సమయంలో ఫోన్ ఎక్కడెక్కడికి వెళ్లిందనే దాన్ని బట్టి వారి సామాజిక చలనాన్ని చెప్పే సమాచారాన్ని ఎన్నో సంస్థలు బైటపెడుతున్నాయి. ఆ సమాచారాన్ని బట్టి అమెరికా, యూరప్ లలో దాదాపు పది శాతం జనం అసలు ఎక్కడికీ కదలడమే లేదు. అంటే వాళ్లు పూర్తిగా తమ ఇళ్లలోనే ఉంటున్నారు. అదే సమయంలో ఆర్థిక స్థాయిలో అట్టడుగు 30 శాతం జనాభాలో విపరీతమైన చలనం ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ చలనంలో ఉన్న ప్రజానీకమే కరోనాకు అతి పెద్ద బాధితులుగా ఉన్నారు. అంటే తమ జీవిక కోసం బైట తిరగక తప్పని జనం కరోనా బాధితులుగా ఉన్నారన్నమాట. వారు ఇంట్లో ఉండడం అసాధ్యం. ఈ సందర్భంలో రానా అయ్యూబ్ రాసిన 'సామాజిక దూరాన్ని పాటించడం ఒక విలాసం' అనే వ్యాసం చూడడం మంచిది. భారత దేశంలో గాని, ప్రపంచంలో ఎక్కడైనా గాని మురికివాడల్లో సామాజిక దూరం, సోషల్ డిస్టెన్సింగ్ అనేది ఒక క్రూర పరిహాసం.

వాస్తవంగా వరదనీరు అంతా తీసిన తర్వాత మాత్రమే ఆ ప్రాంతపు నిజమైన చీదర అంతా కనబడుతుంది. ఈ కరోనా వెళ్లిపోయిన తర్వాతనే మన వ్యవస్థ ఎంత దుర్మార్గమైనదో బైటపడుతుంది. అయితే వరద నీరు ఉన్నప్పుడు కూడ మీరు చూడగలిగినవి కొన్ని ఉంటాయి. స్పానిష్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇచ్చిన రహస్య ఆదేశాల ప్రకారం 60 సంవత్సరాల వయసు దాటినవాళ్లను ఐసియులలో చేర్చుకోవద్దని అన్నారు. వారికి బదులుగా యువ వ్యాధి పీడితులకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. అమెరికాలో టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ డాన్ పాట్రిక్ మరింత నిర్దాక్షిణ్యంగా ముసలివాళ్లు తమ జీవితాలను అమెరికన్ ఆర్థిక వ్యవస్థ కోసం, యువతరం కోసం త్యాగం చేయాలని అన్నాడు. వ్యాపార పత్రిక బ్లూంబర్గ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికన్ శత కోటీశ్వరుడు టాం గాలిసానో ఈ మాటనే మరింత గట్టిగా చెప్పాడు. ఆర్థిక వ్యవస్థను మూసివేయడం కన్న కొందరు వ్యక్తులు చనిపోవడం మంచిది అని ఆయన అన్నాడు. ఇంగ్లండ్ ప్రధానమంత్రి మరొక అడుగు ముందుకు వేసి జనం చచ్చిపోతేనే కరోనాకు వ్యతిరేకంగా సమూహ రోగ నిరోధకశక్తి పెరుగుతుందని అన్నాడు. కరోనాకు ఈ మాట చాల నచ్చినట్టుంది, అది వెంటనే ఆయనకే సోకింది. ఇవాళ ఆయన లండన్ లో ఒక ఆస్పత్రిలో ఐసియు లో ఉన్నాడు. ఈ మాటలన్నీ కూడ 1942 భారత్ క్షామం సమయంలో చర్చిల్ చేసిన ప్రకటనను గుర్తుకు తెస్తున్నాయి. భారతీయులు తమ జనాభాను ఎలుకల్లాగ ఇబ్బడి ముబ్బడిగా పెంచుతున్నారనీ, ఆ జనాభా ఆ క్షామంతో అదుపులోకి వస్తుందని చర్చిల్ అన్నాడు.

ఇప్పుడిక మనం భారతదేశం సంగతి చూద్దాం. ఏప్రిల్ 5న అకాలంగా వచ్చిన దీపావళిని భక్తితో చూడని వాళ్లెవరయినా ఈ దేశంలోని నామమాత్రపు ప్రజాస్వామ్యం ఇవాళ్టికి మూర్ఖస్వామ్యంగా మారిపోయిందని గుర్తించగలరు. మర్జ్ బడ్తా హి గయా జో జో దవాకి (ఎట్లెట్లా మందులు వేసుకుంటానో అట్లట్లా వ్యాధి పెరుగుతూ పోతున్నది) అని మీర్జా గాలిబ్ రాసిన కవితా వాక్యం ఇవాళ్టి భారత పాలకవర్గాలకు సరిగ్గా సరిపోతుంది.

మొదట పెద్ద నోట్ల రద్దును గుర్తు చేసుకుందాం. నల్లధనాన్ని అరికట్టడానికనే పేరుతో పెద్దనోట్ల రద్దు జరిగింది. కాని పెద్ద నోట్ల రద్దుతో నల్ల ధనమంతా తెల్ల ధనమైపోయింది. ఉన్న నోట్ల కన్న ఎక్కువ నోట్లు తిరిగివచ్చాయి. కాని నియంత చూపిన ఈ ఉన్మాదం వల్ల కోట్లాది భారతీయుల బతుకుతెరువు ధ్వంసమైపోయింది. భారత ఆర్థిక వ్యవస్థ పట్టాలు తప్పింది. అదే విధంగా మార్చ్ 24 లాక్ డౌన్ తర్వాత ఏర్పడిన పరిస్థితులు కరోనా మరింత వ్యాపించడానికి దారి తీశాయి. లక్షలాది మంది వలస కార్మికులు 'వెనుకకు లాంగ్ మార్చ్' చేయవలసిన పరిస్థితికి నెట్టబడ్డారు. ఎండలో, వానలో, దప్పికగొన్న ఈ వలస కార్మికులు కరోనాకు అత్యంత సులభంగా దొరికే ఎరలుగా మారారు. కొన్ని షెల్టర్ హోమ్స్ లో జనాన్ని ఎట్లా కుక్కేశారంటే, అవి వారి కార్మిక శిబిరాల్లో లాంటి దుస్సహమైన పరిస్థితినే కొనసాగించాయి. రహదారుల పక్కనా, గ్రామాల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో ఎన్నో పాములకూ తేళ్లకూ మండ్రగబ్బలకూ నిలయాలయ్యాయి. మరెన్నో క్వారంటైన్ కేంద్రాలు జైళ్ల కన్న హీనంగా ఏ నేరం చేయని లక్షలాది మందిని నిర్బంధించాయి. వీరందరూ కరోనాకు అందుబాటులో ఉన్న బాధితులే. ఔను, ఈ సమయంలో ఉన్నత వర్గాలు, మధ్యతరగతి వర్గాలు కచ్చితంగా సుఖంగా, భద్రంగా ఉండిపోయారు. భారతదేశంలో సామాజిక దూరం అంటే వాస్తవంగా వర్గ దూరమే. దీని అసలు ఉద్దేశం ఉన్నత, మధ్యతరగతి వర్గాలకూ, పేద వర్గాలకూ దూరాన్ని పెంచి, కరోనాను పేద వర్గాలవైపు పంపించడమే.

అలా రహదారుల మీదికి వచ్చిన కార్మికులందరూ తమ ఇంటర్వ్యూల్లో తాము కరోనా కన్న ఆకలికీ, పోలీసు లాఠీకీ ఎక్కువ భయపడతామని చెప్పారు. ఈ నిస్సహాయ కార్మికులు తమ గ్రామాలకు సంతోషంగా ఏమీ తిరిగి వెళ్లడం లేదు. వారు తిరిగి వెళుతున్న గ్రామసీమల్లో ప్రతి రోజూ 31 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇటువంటి సంక్షోభ సమయంలో కూడ ఈ రహదారుల మీది వలస కార్మికులతో పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు, వారి మీద కురిపిస్తున్న లాఠీ దెబ్బలు, వారికి శిక్షలు విధిస్తున్న తీరు, మన పాలకవర్గాల వర్గ/కుల దురభిప్రాయాలనూ, వారి పైశాచిక మనస్తత్వాన్నీ అత్యంత దారుణంగా, అసహ్యకరంగా బైటపెడ్తున్నాయి.

కరోనా సందర్భంలో ఖైదీలను విడుదల చేయమని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా 11000 మంది ఖైదీలను విడుదల చేయాలని నిర్ణయించిన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వమే లాక్ డౌన్ ను ఉల్లంఘించారనే పేరుతో, అంతకన్న ఎక్కువమందితో జైళ్లను నింపుతున్నదంటే ఈ ప్రభుత్వపు దివాళాకోరుతనానికి అంతకన్న మంచి ఉదాహరణ ఉండదు. ఈ దేశంలో ప్రభుత్వాలు ఎంత దివాళాకోరుతనంతో పనిచేస్తున్నాయో దీనితో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి భారత ప్రభుత్వానికి ఎటువంటి వ్యూహమూ లేదు, ఎటువంటి ముందస్తు ఏర్పాటూ లేదు. వారి దగ్గర అసలు నమ్మదగిన అంకెలే లేవు. కాని మోడీ ప్రభుత్వానికి ప్రతి సందర్భాన్నీ ఒక ఉత్సవంగా ఎట్లా మార్చాలో తెలుసు. చివరికి కలుపు మొక్కలకు సంస్మరణ ఉత్సవాలు కూడ జరపగలరు. అది చాల బాగా కూడ చేస్తున్నారు.

యూరపియన్ దేశాలను అనుకరిస్తూ, భారత ప్రభుత్వం ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు లేకుండా హఠాత్తుగా లాక్ డౌన్ ప్రకటించింది. చివరికి అనుకరణలోనైనా కొంత మెరుగు పరచవలసి ఉంటుంది. రాత్రి ఎనిమిది గంటలకు లాక్ డౌన్ ప్రకటించగానే, జనం విపరీతంగా దుకాణాలను చుట్టుముట్టారు. ప్రకటిత సామాజిక దూరపు నియమాలన్నిటినీ ఉల్లంఘించారు. హాస్టళ్లలోని విద్యార్థులు, యువజనులు, తాత్కాలిక కార్మికులు పెద్ద ఎత్తున బస్ స్టేషన్లకూ, రైల్వే స్టేషన్లకూ తరలి వచ్చారు. ఉన్నత మధ్యతరగతి వర్గాలను మాత్రం రక్షించి, పేద కార్మికులను కరోనా అనే సింహానికి అప్పగించడానికే ఇది జరిగిందని చెప్పవచ్చు.

భారత దేశంలో సాలీనా నాలుగు లక్షల మంది క్షయవ్యాధితో చనిపోతున్నారు. దానికి ప్రధాన కారణాలలో ఒకటి పేదరికం. ప్రస్తుత లాక్ డౌన్ ఆ పేదరికాన్ని మరింత పెంచుతుంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ తాజా నివేదిక ప్రకారం, లాక్ డౌన్ తర్వాత దేశంలో 40 కోట్లమంది మరింత పేదరికంలోకి దిగజారనున్నారు. అంటే ఈ సంవత్సరం క్షయవ్యాధితో మరణించేవారి సంఖ్య పెరగనున్నది. మరి కరోనా బారిన పడకుండా ఒకరిని రక్షించడంలో, క్షయవ్యాధితో మరణించే నలుగురిని తయారు చేయడం ఎంత సమర్థమైన వ్యూహం? ఈ కరోనా సమయంలో దాదాపు అన్ని ఆస్పత్రులలోనూ ఔట్ పేషెంట్ శాఖలను మూసేశారు. ఢిల్లీలోని ఎఐఐఎంఎస్ వంటి ఆస్పత్రి కూడ తన ఔట్ పేషంట్ విభాగాన్ని మూసేసింది. చివరికి వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న కాన్సర్ పేషంట్లకు కూడ చికిత్స చేయడం లేదు. ఢిల్లీలో కాన్సర్ వ్యాధి గ్రస్తులందరూ ఎఐఐఎంఎస్ దగ్గరా, ఇతర ఆస్పత్రుల దగ్గరా మృత్యువు కోసం ఎదురుచూస్తూ పడిఉన్నారు. ప్రైవేట్ క్లినిక్ లు నడిపే చాల మంది డాక్టర్లు తమ క్లినిక్ లు మూసేశారు. తమ సొంత భద్రత తాము చూసుకుంటున్నారు. ఎంతమంది కరోనా పేషంట్లను కాపాడే క్రమంలో మరెంతమంది ఇతర వ్యాధిగ్రస్తులను మనం చంపేస్తున్నామో లెక్కలు బహుశా ఎప్పటికీ బైటికి రాకపోవచ్చు.

మరి పాపం, భారత దేశం ఏం చేయగలుగుతుంది? గత కొన్ని దశాబ్దాలుగా మన సమయమంతా హిందూ - ముస్లిం ఘర్షణలు రెచ్చగొట్టడంలోనే సరిపోయింది. ఇక మిగిలిపోయిన మన పనిని ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ వంటి సామ్రాజ్యవాద సంస్థలో, అమెరికానో చేసిపెట్టాయి. అలా మనం నిర్వహించిన 'బహు సుందరమైన' కార్యక్రమాల ఫలితంగా ఇవాళ మనం ప్రతి 10,000 మందికి ఒక ఎంబిబిఎస్ డాక్టర్ ఉండే స్థితికి చేరుకున్నాం. అలాగే ప్రతి వెయ్యి మందికి ఆస్పత్రిలో సగం మంచం ఏర్పాటు చేశాం. ఇదేమీ హాస్యం కాదు, అత్యంత తీవ్రమైన జబ్బులు ఉన్నవారిని కూడ ఇద్దరు వ్యక్తులను ఒకే బెడ్ మీద పడుకోబెట్టడం ఎన్నో ఆస్పత్రుల్లో జరుగుతున్నది. బీహార్ లోని 18 జిల్లాల్లో ఒక్కటంటే ఒక్క వెంటిలేటర్ కూడ లేదు. ఈ పరిస్థితుల వల్ల, కేవలం ఆరోగ్య సేవల మీద ఖర్చుల వల, ప్రతి సంవత్సరం దేశంలో ఐదు కోట్ల ఐదు లక్షల మంది దారిద్ర్యరేఖ కిందికి జారిపోతున్నారు. కరోనా వంటి మహమ్మారిని ఎదుర్కోవడానికి తగిన స్థితిలో భారతదేశం ఏరకంగా చూసినా లేదు.

కాని ఇక్కడి ప్రచార సాధనాలు మాత్రం అన్నిటికీ అన్ని సమయాల్లోనూ సిద్ధంగా ఉంటాయి. ఇక కరోనాకైతే అవి సంసిద్ధంగా ఉండడం కంటే ఎక్కువ సంసిద్ధంగా ఉన్నాయి. అవి మొదట కరోనా విషయంలో చైనా మీద గురి పెట్టాయి. అమెరికా అన్న మాటనల్లా తిరిగి పలికాయి. కాని భారత ప్రభుత్వమే వెంటిలేటర్లు కావాలనీ, టెస్టింగ్ కిట్స్ కావాలనీ చైనాను అడగవలసి వచ్చేసరికి, మన ప్రచార సాధనాలు అప్పటిదాకా పాడుతున్న పాటను మధ్యలో ఆపేసి, ఎల్లప్పుడూ ఇష్టపూర్వకమైన శత్రువైన ముస్లింల మీదికి తమ గురిని తిప్పాయి. కరోనా మొత్తానికీ నిందను ముస్లింల మీద మోపడం మొదలుపెట్టాయి. సంఘ్ ఐటి సెల్స్ లాక్ డౌన్ ను సంపూర్ణంగా వినియోగించుకుని, తామే కరోనా పాత్రను పోషించడం మొదలుపెట్టాయి. ప్రజలకు తమ విషం అంటించడానికి ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవడం లేదు. సిఎఎ వ్యతిరేక ఆందోళనలో ముస్లింలు నిర్వహించిన పాత్రకు ప్రతీకారం తీసుకోవడానికి ప్రభుత్వానికి ఒక అవకాశం దొరికింది. మసీదు నుంచి బైటికి వస్తున్న ముస్లింల మీద పోలీసులు లాఠీల వర్షం కురిపిస్తున్న వీడియో, రానా అయ్యూబ్ ట్విట్టర్ మీద చూపిన వీడియో ఎవరు మరిచిపోగలరు? ఎంతమంది ముస్లింలను, లేదా ముస్లిం మొహల్లాలను కరోనా కారణంగా క్వారంటైన్ చేశారో, కేవలం వారు ముస్లింలైనందువల్లనే క్వారంటైన్ చేశారో, ఇప్పుడెవరికీ రహస్యం కాదు. మొత్తం ప్రపంచమంతా కరోనా వైరస్ జన్యు నిర్మాణం ఏమిటని అధ్యయనం చేస్తున్న సమయంలో మనం కరోనా మతమేమిటో కనిపెట్టడంలో తలమునకలై ఉన్నాం.

నిజం చెప్పాలంటే భారత దేశం వంటి పేద దేశంలో, శ్రామిక జనాభాలో 94 శాతం అసంఘటిత రంగంలోనే పనిచేస్తున్న చోట, సగం కన్న ఎక్కువ జనాభా దుర్భర దారిద్ర్యంలో మగ్గిపోతున్న చోట, సంపూర్ణ లాక్ డౌన్ సరైన నిర్ణయం కాజాలదు. ఇంకా ఇంకా ఎక్కువ పరీక్షలు జరపవలసింది. ఆ పరీక్షా ఫలితాలను బట్టి స్థానిక లాక్ డౌన్ లు, స్థానిక క్వారంటైన్ లు ఏర్పాటు చేయవలసింది. కాని వాస్తవమేమంటే, భారత దేశం ఇప్పటికి పది లక్షల మంది ప్రజలకు 137 పరీక్షలు మాత్రమే జరపగలిగింది. కనికా కపూర్ కు ఇప్పటివరకూ ఏడు సార్లు పరీక్షలు జరిగాయనేది గుర్తుంచుకుంటే, ఈ లెక్క కూడ సరికాదని, ఒకే వ్యక్తికి ఒకటి కన్న ఎక్కువ పరీక్షలు జరిగి ఉండవచ్చునని తేలుతుంది. చివరికి పాకిస్తాన్, శ్రీలంక కూడ పరీక్షల విషయంలో మనకంటె మెరుగుగా ఉన్నాయి. పాకిస్తాన్ లో పది లక్షల మందికి 262 పరీక్షలు, శ్రీలంకలో 152 పరీక్షలు జరిగాయి. ఇటలీ, జర్మనీలలోనైతే పదిలక్షల మందికి 15,000 పరీక్షల దాకా జరిగాయి.

ఇవాళ ఈ కరోనా సమయంలో, అంతకు ముందు క్రమబద్ధంగా పర్యావరణ, ఆరోగ్య, దారిద్ర్య, జల్ జంగల్ జమీన్ సమస్యలు లేవనెత్తుతుండిన, ఈ అమానవీయ వ్యవస్థలో మానవ మనుగడకు సంబంధించిన మౌలిక ప్రశ్నలు లేవనెత్తుండిన, తమకు తోచిన పద్ధతులలో పోరాటాలు జరుపుతుండిన గళాల మీద, శక్తుల మీద నిర్బంధం అమలవుతున్నది. కాని కరోనానంతర సమయంలో ఈ గళాలు మరింత ఎక్కువగా, మరింత బలంగా వినబడతాయి. పద్నాలుగో శతాబ్దిలో యూరప్ లో ప్లేగ్ అనే మహమ్మారి దాడిచేసి, నాటి యూరప్ జనాభాలో మూడో వంతును చంపేసింది. ఆ మహమ్మారి ప్రధాన ఫలితం ఏమంటే సాధారణ ప్రజానీకం చర్చ్ లో విశ్వాసం కోల్పోయారు. అదే యూరప్ లో పునరుజ్జీవనానికి అత్యంత కీలక దోహదం చేసింది. ఆ వరుసలో బూర్జువా ప్రజాస్వామిక విప్లవాలు చెలరేగాయి. ఈసారి కూడ అలా జరుగుతుందా?

ఎడువార్డో గలియనో అన్నట్టు చరిత్ర ఎప్పుడూ వీడ్కోలు అనే మాట అనదు. చరిత్ర ప్రతిసారీ, మళ్లీ కలుద్దాం అనే అంటుంది.

రాత్రి ఎంత గాఢమైన చీకటి అలముకున్నా, ఎల్లప్పుడూ అందులో ఉదయానికి సంబంధించిన ఒక ఆశారేఖ ఉంటుంది. ఈ సందర్భంలో చార్లెస్ డికెన్స్ సుప్రసిద్ధ నవల రెండు మహానగరాలు లోని బహుళార్థ బోధకమైన ప్రారంభవాక్యాలు మళ్లీ ఒకసారి చెప్పాలనిపిస్తున్నది: "అది ఒక వైభవోజ్వల మహాశకం. అది అధ్వాన్నపు వల్లకాటి కాలం. అది వివేక సంపన్న యుగం, అది మూర్ఖత్వపు సామ్రాజ్యం. అది మూఢ విశ్వాసాల కాలం, అది మహా సంశయాల కాలం. అది వెలుగులీనిన యుగం, అది మహాంధకారపు సమయం. అది ఆశల ఊట, అది నిరాశల కోట."

(మనీష్ ఆజాద్ రాజకీయ కార్యకర్త. మావోయిస్టు కార్యకర్తలు అనే ఆరోపణతో ఆయననూ ఆయన సహచరినీ అరెస్టు చేసి ఎనిమిది నెలల నిర్బంధం తర్వాత ఫిబ్రవరి 29న బెయిల్ మీద విడుదల చేశారు.)

కరోనా కట్టడి లో 'కేరళ మార్గం' దేశానికే ఆదర్శం :: పాట్రిక్ హెల్లర్


  సమానత్వభావన వారసత్వాలు, సామాజిక హక్కులు, ప్రజల విశ్వాసమే పునాదిగా కేరళ రాష్ట్రం కరోనా వైరస్ సంక్షోభాన్ని అధిగమించింది.ప్రపంచ కరోనా వైరస్ మహమ్మారి క్రూర ప్రయోగమైనప్పటికీ ,  సహజమైనది.  ప్రపంచంలో ప్రతి దేశం గణనీయంగా దాని ప్రభావానికి గురైంది.మనం గమనిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిస్పందనల స్థాయి, ఉనికిలో ఉన్న అసమానతలను తెలియజేయడమే కాక, స్పందించే ప్రభుత్వాల రాజకీయ,సంస్థాగతమైన సామర్థ్యాన్ని కూడా తెలియజేస్తుంది. భారతదేశంలో కన్నా ఇది మరే దేశంలోనూ వాస్తవం కాదు.కేంద్రప్రభుత్వం 'లాక్ డౌన్' ను ప్రకటించింది.కానీ వైరస్ వ్యాప్తి అదుపు, 'లాక్ డౌన్' ఫలితంగా ఉత్పన్నమయ్యే సంక్షేమ సమస్యలు రెండింటినీ పరిష్కరించే చర్యలు అమలు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలు. దేశంలో అనేక రాష్ట్రాలు చొరవ ప్రదర్శిస్తూ ఉన్నాయి.కానీ కేరళ రాష్ట్రం కన్నా ఎక్కువ చొరవ చూపించే రాష్ట్రమేదీ భారతదేశంలో లేదు.
  మొదటి కరోనావైరస్ కేసు కేరళ రాష్ట్రంలో నమోదై, దేశంలోనే ఎక్కువ మందికి వైరస్ సోకిన కేసులు నమోదైన మొదటి రాష్ట్రంగా  ఉన్నప్పటికీ, ప్రస్తుతం రాష్ట్రాలన్నింటితో పోలిస్తే 10 వ స్థానంలో ఉంది.వారం రోజులుగా వైరస్ సోకిన కేసుల సంఖ్య
క్షీణిస్తూ, ప్రస్తుతం ఆ సంఖ్య కోలుకున్న రోగుల సంఖ్య కన్నా తక్కువగా ఉంది.కేరళ  రాష్ట్ర ప్రజలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో లోతైన సంబంధాలు కలిగి ఉండడం, అంతర్జాతీయంగా ఏ దేశానికైనా  తేలికగా వెళ్ళగలగడం వల్ల కేరళ  ఒక అపాయకరమైన ప్రాంతం(హాట్ స్పాట్)గా గుర్తించబడింది. 
రాష్ట్ర ప్రభుత్వం వక్రరేఖను సమాంతర రేఖగా మార్చడమే కాక, కేంద్ర ప్రభుత్వం 'లాక్ డౌన్'ను  ప్రకటించడానికి ముందే 20 వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది.అంతర్జాతీయంగా, జాతీయంగా కేరళ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఎందుకు అంత గుర్తింపు వచ్చింది?
  సామాజిక అభివృద్ధిలో కేరళ రాష్ట్రం విజయం సాధిస్తుందన్న ముందస్తు సూచిక, అపరిమితమైన ఆ రాష్ట్ర సాంస్కృతిక, చారిత్రక సిద్ధాంతాల్ని, దాని భౌగోళిక ప్రత్యేకతలను గుర్తించింది.ఒక మహమ్మారిని లొంగ తీసుకొని, వేగంగా భారీఎత్తున సంరక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసిన తీరు ప్రాథమికంగా ఆ రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న సంబంధాన్ని తెలుపుతుంది.1957లో జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికల నుండి  కమ్యూనిస్ట్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాల ప్రత్యామ్నాయ పాలనల ద్వారా సామాజిక సమీకరణలు, ప్రభుత్వాల జవాబుదారీతనం ఒక బలమైన సామాజిక ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాయి.ప్రస్తుత సంక్షోభం సామాజిక ప్రజాస్వామ్యం యొక్క సాపేక్ష ప్రయోజనాల గురించి నొక్కి చెబుతుంది. 
  మొదటిది,పౌరులందరికీ విశాల ప్రాతిపదికన ప్రాథమిక సంక్షేమ సౌకర్యాలు సమకూరుస్తామన్న రాజకీయ నిబద్ధతతో కూడిన సామాజిక ఒప్పందం లేదా ఒడంబడిక పై ఆధారపడి సామాజిక ప్రజాస్వామ్యం నిర్మించబడుతుంది.కేరళలో ప్రజాదరణ పొందిన ప్రజాఉద్యమాల సంఘటనల నుండే సామాజిక ఒప్పందం ఉద్భవించింది.అవి 1930లో జరిగిన ఆలయ ప్రవేశ ఉద్యమం నుండి 1950లు మరియు1960లలో జరిగిన రైతాంగ,కూలీల ఉద్యమాలు,1980లలో పెద్ద ఎత్తున జరిగిన అక్షరాస్యతా ఉద్యమం,1990లలో కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ నాయకత్వంలో జరిగిన ప్రజా వికేంద్రీకరణ ప్రణాళికోద్యమం,ఇటీవల కాలంలో జరిగిన  లింగ , పర్యావరణ ఉద్యమాలు. ఈ ఉద్యమాలు సామాజిక పౌరసత్వమనే బలమైన భావాన్ని పెంచిపోషించడమే కాక, ప్రజా చైతన్యం కొరకు అవసరమైన న్యాయపరమైన, సంస్థాగతమైన  సామర్థ్యాన్ని పెంచే సంస్కరణలను ముందుకు నడిపించాయి.రెండవది,హక్కుఆధారిత సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వబడింది.మళ్ళీఅదే ప్రాధాన్యత, రాష్ట్ర పాలకులను నిరంతరం తమ జవాబుదారీతనాన్ని డిమాండ్ చేసే బలమైన వ్యవస్థీకృత  పౌర సమాజాన్ని తిరిగి ప్రవేశ పెట్టింది.మూడవది,  నిరంతరం ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసే వ్యవస్థీకృత పౌరసమాజం  మరియు పోటీ పార్టీ వ్యవస్థ (అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అనే దానితో నిమిత్తం లేకుండా) ప్రజాసేవా కార్యక్రమాలకు పూనుకోవాలని, సామాజిక రక్షణ చర్యల ఏర్పాట్లు నిరంతరం విస్తరించాలని, ముఖ్యంగా భారత దేశంలో బ్రహ్మాండమైన ప్రజారోగ్య వ్యవస్థను అభివృద్ధి చేయాలని కేరళ ప్రభుత్వాలను ఒత్తిడి చేశాయి.నాల్గవది,ఆ ఒత్తిడే, స్థానిక సంస్థలకు అధికారాలు ఉండాలని రెండు దశాబ్దాలకు పైగా  కేరళ రాష్ట్రం చేస్తున్న ప్రయత్నాలకు ఆజ్యం పోసింది. భారతదేశంలో కేరళ రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఉన్న వనరులు, వాటికున్న సామర్థ్యం ఏ రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు లేవు.చివరగా, ఇవన్నీ కలిసి ప్రజలను అధీనులుగా కాక , హక్కుదారులైన పౌరులుగా ఆదరించే ప్రభుత్వం అనే సాధారణ విశ్వాసాన్ని ఇచ్చే ఒక లోతైన ప్రజాస్వామ్యపు ఆస్తి గా మారుతాయి.
 వక్రరేఖను సమాంతరం చేసి, ప్రజలకు లబ్ది చేకూర్చే సంక్షేమ చర్యలను విశాల ప్రాతిపదికన చేపట్టే సామర్థ్యం కేరళకు ఎలా సాధ్యమైంది?కోవిద్-19 లాంటి మహమ్మారి సంక్షోభానికి ప్రతిస్పందించే కేరళ ప్రభుత్వం, ఆర్థిక మరియు సామాజిక వనరుల సమీకరణల పైన, మార్గదర్శకాలను అమలు చేసే అధికారుల పైన, విభిన్న రంగాలకు చెందిన అధికారులతో జరిగే సమన్వయంపైన, ముఖ్యంగా ప్రభుత్వ నియమనిబంధనలను పాటించే ప్రజలపైన ఆధారపడుతుంది. ప్రణాళికాబద్ధమైన నిర్ణయాలతో ఒక సమర్థవంతమైన ప్రతిస్పందన ప్రారంభం అవుతుంది.
  కేరళలో కరోనా వైరస్ సోకిన మొదటి కేసు నమోదు అయిన దగ్గర నుండి ముఖ్యమంత్రి పినరయి విజయన్,విభిన్నమైన విధులు నిర్వహిస్తూ, 18 టీంలను సమన్వయ పరిచే 'రాష్ట్ర ప్రతిస్పందన టీం'తో,   ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో ప్రతి రోజూ సమావేశం నిర్వహించి, నిరంతరం ప్రజలతో సంభాషించాడు.కేరళ సామాజిక ఒడంబడిక తక్కువేమీ డిమాండ్ చేయలేదు.విజయన్ ప్రత్యక్షంగా మళయాళీల పౌరసత్వ భావనకు  మనవిచేయడమే కాక, వైరస్ కు వివక్షత ఉండదని, దానిని అణచివేయాలన్న విషయాన్ని కూడా ప్రజలకు గుర్తు చేశాడు.
  రెండవది, ఇటీవల ప్రైవేటు ఆరోగ్య సేవల వృద్ధి లో పెరుగుదల ఉన్నప్పటికీ,బలమైన ప్రజల ఉనికిని కాపాడుతున్న  విశాలమైన ప్రజారోగ్య చికిత్సా విధానం ద్వారా కేరళ ప్రభుత్వం సాధ్యమైనంత వరకు లబ్దిపొందగలిగింది.ప్రజా ప్రయోజనాల లక్ష్యం తోనే ఏర్పడిందంటున్న  ప్రైవేట్  వ్యవస్థ ఆ లక్ష్యాన్ని సాధించలేదు. అమెరికాలో లాభాపేక్షతో ఏర్పడిన ఆరోగ్య వ్యవస్థ గందరగోళంలో పడింది. లాభాపేక్ష తో ఏర్పడిన అలాంటి ఆరోగ్య వ్యవస్థలు ఎదుర్కొంటున్న సమన్వయ సమస్యలను బహిర్గతం చేసే మహమ్మారి లాంటిది మరొకటి లేదు.కేరళ ప్రజారోగ్య సంరక్షణా కార్మికులు సంఘటితమై, సంఘాలు కూడా స్థాపించుకున్నారు. కేరళ ప్రభుత్వం మొదటినుండి వారి ఆరోగ్య రక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తుంది.
  మూడవది, ప్రభుత్వం అప్పటికే సిద్ధంగా ఉన్న పౌరసమాజాన్ని చైతన్య పరిచింది.వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరగడంతో, ఇంటింటికీ వెళ్లి ఇబ్బంది పడుతున్నవారిని,అవసరాలలో ఉన్న వారిని గుర్తించడానికి గాను  రెండు లక్షల మందిని రంగంలోకి దించింది.పౌరసమాజంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా వ్యాధి నివారణా, సహాయక చర్యల్లో సమర్థవంతంగా పాలుపంచుకుంది.వ్యాధి సోకిన వ్యక్తులు ఎవరెవర్ని కలిశారో గుర్తించే పని నుండి  కుదుంబశ్రీ కమ్యూనిటీ వంటశాలల ద్వారా రోజుకు మూడు లక్షల భోజనాలను ఇంటికి సరఫరా చేసే పని వరకు ప్రభుత్వ ప్రత్యక్ష జోక్యం ఉంది. కేరళలో మహిళా సాధికారత అమలు రుజువుకు 'కుదుంబశ్రీ' సేవలు మంచి ఉదాహరణ.
 నాల్గవది, రాజకీయాలు నిజాయితీగా ఉన్నప్పుడు , ఒక మంచి ప్రజారోగ్య రక్షణ వ్యవస్థ ఉంటుంది. ఇటువంటి సంక్షోభ సమయంలోనే క్షేత్రస్థాయిలో పొందాల్సిన ప్రయోజనాలు ప్రజలు పొందినప్పుడు ఆ వ్యవస్థ ప్రభావం ఏమిటో తెలుస్తుంది.ఇదే రెండు దశాబ్దాల కాలంలో స్థానిక సంస్థలకున్న అధికారాల ఫలితంగా  కేరళ రాష్ట్రం పొందిన ప్రయోజనం. వ్యాధి సోకిన ప్రాంతాల్లో వైరస్ ను అదుపులోకి తెచ్చే చర్యలపై కేంద్రీకరించడం, వైరస్ సోకిన వారిని గుర్తించడం,వలస కార్మికులకు, వృద్ధులు మొదలైన వారు ప్రత్యక్షంగా పొందాల్సిన ప్రయోజనాలు పొందేట్లు చూడడంలో పంచాయతీ, జిల్లా, మున్సిపాలిటీ స్థాయిలో తీసుకునే చర్యలను సమన్వయం చేయడంలో ప్రజల,అధికారుల పాత్ర కీలకమైనది.
  సామాజిక శరీరానికి ఈ మహమ్మారి ఒక భౌతిక పరీక్ష . ప్రజా విశ్వాసాన్ని ఇంతవరకు పరీక్షకు పెట్టలేదు.ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ప్రజల విజ్ఞప్తులకు ప్రతిస్పందనలు ఉండాలి.ప్రజలను ఇంటి వద్ద ఉండమని,పని చేయొద్దని చెప్పడం, సమాజ హితం కొరకు వారు ఇప్పుడు చేస్తున్న వ్యక్తిగత త్యాగాలు అవసరం అని నమ్మడం అంత తేలిక కాదు, మరీ ముఖ్యంగా కనిపించని ఒక శత్రువుకు అసలు వ్యతిరేకం కాదు.విశ్వాసాన్ని కొలవడం కష్టం.కానీ ఇటీవల కాలంలో బెంగళూరు కు చెందిన ఒక ప్రభుత్వేతర సంస్థ " జనాగ్రహ "తో నా సహచరులు, నేను కలిసి 'కొచ్చి'తో పాటు పది భారతదేశ నగరాలలో చేసిన సర్వే, అన్ని వర్గాల, కులాల మరియు మతాలలో ఉన్న ప్రజల్లో వారి ప్రభుత్వం పట్ల, స్థానికంగా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల పట్ల అందరి కన్నా ఎక్కువ స్థాయి విశ్వాసం ఉన్నవారు మళయాళీయులని రుజువు చేసింది. ఇది అన్నిటికన్నా శక్తివంతమైన, ఆరోగ్యకరమైన 'కేరళ సామాజిక ఒడంబడికను' సూచిస్తుంది. 
  ప్రపంచంలో ప్రతి దేశం ముఖ్యంగా భారతదేశం, వైరస్ మహమ్మారి సంక్షోభం ఫలితంగా ఏర్పడే ఆర్థిక,సంక్షేమ సమస్యలను కొన్ని సంవత్సరాల పాటు ఎదుర్కొంటుంది.ఈ క్రూరమైన, ఉహించని దెబ్బ ప్రజాస్వామిక పౌరసత్వ సవాళ్ళను బహిర్గతం చేస్తుంది.ఈ సంక్షోభ సమయాన, కొందరి పెత్తందారీ దుష్క్రత్యాలు నిలువరించలేని విధంగా ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ " సర్వ" ఆధిపత్యాన్ని ప్రదర్శించి,గవర్నర్ల అధికారాలను బలవంతంగా లాక్కొనే లక్ష్యంతో బెదిరిస్తున్నాడు. భారతీయ జనతాపార్టీ  మహమ్మారిని మతతత్వీకరణ చేయడానికి,తన విమర్శకులను మాట్లాడకుండా చేయడానికి ఈ సంక్షోభాన్ని ఒక అవకాశంగా ఉపయోగించుకుంటుంది.భారతదేశ ప్రజాస్వామ్యం సంక్షోభంలో ఉన్నప్పుడే,కేరళ రాష్ట్రం వైరస్ సంక్షోభాన్ని పట్టుదలతో, సానుభూతితో దేశంలో ఏ రాష్ట్రం సాధించని ఫలితాలతో ఎదుర్కొంటుంది.సమానత్వ భావన వారసత్వాలు, సామాజిక హక్కులు, ప్రజల విశ్వాసం తోనే ఇది సాధ్యమైంది.
(రచయిత US లో బ్రౌన్ యూనివర్సిటీ ప్రొఫెసర్)

Saturday, 25 April 2020

కోవిడ్ 19 రాజకీయార్థిక పరిచయం పార్ట్-1

కొవిడ్-19 రాజకీయార్థిక పరిచయం

మనీష్ ఆజాద్

(మిత్రుడు మనీష్ ఆజాద్ హిందీలో రాసిన ఈ అద్భుతమైన వ్యాసం ఇంగ్లిష్  అనువాదం మొన్న చూసినప్పటినుంచీ తెలుగు చేసి మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. కారణాంతరాల వల్ల ఇప్పటికి సగమే చేయగలిగాను. మిగిలిన సగం రేపు చేసి ఇక్కడే మీతో పంచుకుంటాను.)
 
హిందీ నుంచి ఇంగ్లిష్: హసన్ ప్రీత్,  తెలుగు: ఎన్ వేణుగోపాల్ 

నాజీ జర్మనీలో సోఫీ అనే మహిళనూ, ఆమె పిల్లలిద్దరినీ గ్యాస్ చాంబర్ దగ్గరికి తీసుకు వచ్చినప్పుడు, ఆమె ఏడుపులూ మొత్తుకోళ్లూ అభ్యర్థనలూ విని నాజీ సైనికులు ఆ ఇద్దరు పిల్లలలో ఒకరిని విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. కాని ఎవరిని విడుదల చేయాలో నిర్ణయం తీసుకునే అధికారం ఆమెకే ఇస్తున్నామన్నారు. ఈ కథ మీద ఆధారపడి రాసిన సోఫీస్ చాయిస్ అనే నవల 1979లో వెలువడిన తర్వాత, సోఫీస్ చాయిస్ అనేది ఇంగ్లిష్ నుడికారాల్లో ఒకటిగా మారింది. ఇవాళ కరోనా వైరస్ తో సంపూర్ణ భయోత్పాతంలో మునిగి లాక్ డౌన్ లో ఉన్న ప్రపంచాన్ని చూస్తుంటే నాకు ఆ నుడికారమే గుర్తొస్తున్నది. లాక్ డౌన్ ను కొనసాగిస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది, కోట్లాది మంది మనుషుల మనుగడే సంక్షోభంలో పడిపోతుంది. లాక్ డౌన్ ను సడలిస్తే, కరోనా వైరస్ మహావిపత్తు కోట్లాది మందిని బలిగొంటుంది. ప్రతి దేశంలోనూ ఈ సవాల్ నిలువెత్తుగా నిలిచి ఉంది. 

కాని వాస్తవమైన సమస్యేమంటే, అసలు మనం ఇక్కడికి ఎలా చేరాం? ఈ గమ్యం అనివార్యమైనదా? కరోనా తప్పనిసరిగా రావలసిందేనా? లేక, దీనివెనుక చైనా కుట్ర ఉందా, అది మొదట తన జనాన్ని తానే చంపుకొని, ఆ తర్వాత యావత్ ప్రపంచాన్ని చంపి ప్రపంచ అగ్రరాజ్యంగా మారదలచిందా? లేక చైనాను బలహీన పరచడానికి ఒలింపిక్ క్రీడల సమయంలో అమెరికానే చైనాలో ఈ వైరస్ ను ప్రవేశపెట్టిందని చైనా చెపుతున్న మాట సత్యమా? లేక మరేదైనా కారణముందా? కాస్త పరిశోధించవలసి ఉంది. 

మొట్టమొదట, స్క్రిప్స్ రిసర్చ్ ఇన్ స్టిట్యూట్ తో సహా ఎన్నో ప్రతిష్ఠాత్మక పరిశోధనా సంస్థలు కొవిడ్-19 జన్యు నిర్మాణం మీద అధ్యయనాలు చేసి, దాన్ని ఒక రసాయనశాలలో తయారు చేయడం అసాధ్యమని రుజువు చేశాయి. అంటే పరివర్తన (మ్యుటేషన్) ద్వారా సహజంగా దానంతట అదే రూపొందింది. దాని వెనుక ఏదో ఒక దేశం ఉందని అనుకోనక్కర లేదు. కరోనా కుటుంబంలో ఇది తాజా వైరస్ మాత్రమే. ఇదే కుటుంబానికి చెందిన ఎస్ ఎ ఆర్ ఎస్ (సార్స్) అనే వైరస్ 2003-04ల్లో ప్రపంచంలో ఎన్నో దేశాలను అల్లకల్లోలం చేసింది. ప్రస్తత వైరస్ ను కొవిడ్-19 సార్స్-2 అంటున్నారు. 

ఈ వైరస్ చైనాలోని వుహాన్ నగరంలో ప్రారంభమైందని అంటున్నారు. అయితే సుప్రసిద్ధ వైద్యశాస్త్ర పత్రిక లాన్సెట్ తొలి 43 కరోనా వ్యాధి పీడితులలో 13 మంది వుహాన్ నగరానికి బైటి వారేనని, వుహాన్ లో కరోనా సోకినవారితోగాని, అక్కడి ‘పచ్చి మార్కెట్’తో గాని ఎటువంటి సంబంధం లేనివారేనని రాసింది. వుహాన్ లోని పచ్చి మార్కెట్ (మన దగ్గరి చేపల బజారులలాగ, వుహాన్ లో చేపలు, మాంసం అమ్మే మార్కెట్) నుంచే ఈ వైరస్ ప్రపంచమంతా వ్యాపించిందని ప్రచార సాధనాలలో రెండో కథనం ప్రచారం లోకి వచ్చింది. ఈ కథనాన్ని కూడ స్క్రిప్స్ రిసర్చ్ ఇన్ స్టిట్యూట్ అధ్యయనం ఖండించింది. 

ఆ అధ్యయనం ప్రకారం కొవిడ్-19 జన్యు నిర్మాణం పరివర్తన చెందడానికి, రూపొందడానికి జంతువుల సంఖ్య సాంద్రత చాల ఎక్కువగా ఉండే ప్రాంతం కావాలి. అంటే జంతువుల ఉత్పత్తి పారిశ్రామిక పద్ధతులలో జరిగే చోట, వాటిని కిక్కిరిసినట్టుగా ఉంచే చోట మాత్రమే ఈ వైరస్ పుట్టడానికి అవకాశం ఉంది. కోళ్లను, సీమ పందులను మాత్రమే అటువంటి పరిస్థితుల్లో ఉత్పత్తి చేస్తారు. పందులలో రోగ నిరోధక వ్యవస్థ సాపేక్షికంగా మానవులలో ఉన్నట్టుగానే ఉంటుంది గనుక కొవిడ్-19 పందుల నుంచి మనుషులకు సంక్రమించడానికి అవకాశం ఉందని ఆ అధ్యయనంలో రాశారు. 

ఈ విషయాల మీద పని చేసే గ్రేన్ డాట్ ఆర్గ్ అనే సుప్రసిద్ధ వెబ్ సైట్ కరోనా అనే సాకుతో వుహాన్ పచ్చి మార్కెట్ ను మూసివేయడానికి జరుగుతున్న కుట్రలో భాగంగానే ఈ ప్రచారాలు సాగుతున్నాయని కూడ అంది. ఎందుకంటే ఈ పచ్చి మార్కెట్ చౌక మాంసాన్ని పేద ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నదనీ, తమ జీవిక కోసం ఈ మార్కెట్ మీద ఆధారపడుతున్న లక్షలాది మంది పేద ప్రజలు ఆ మార్కెట్ ను నడుపుతున్నారని ఆ వెబ్ సైట్ అంది. ఈ పేద ప్రజలు కొద్దికాలం కిందివరకూ తమ సొంత ‘సహకార సంఘాల’లో, కమ్యూన్ లలో ఉండేవారు. అక్కడ సోషలిజం కూలిపోయిన తర్వాత, వారి భూములు లాక్కోబడిన తర్వాత వారు పొట్ట చేత పట్టుకుని ఇటువంటి మార్కెట్లకు చేరి, వాటి మీద ఆధారపడవలసి వస్తున్నది. ఆ భూములలో ఇప్పుడు కబేళాలతో సహా భారీ మాంస పరిశ్రమలు, భారీ వ్యవసాయ-పారిశ్రామిక క్షేత్రాలు తలెత్తాయి. ఈ భారీ మాంస పరిశ్రమల ప్రయోజనాల కోసం పచ్చి మార్కెట్ ను మూసివేయాలని, తద్వారా తమ మార్కెట్ ను ఇతోధికంగా విస్తరించుకోవాలని ఆ భారీ పరిశ్రమలు ప్రయత్నిస్తున్నాయి.

గతంలో 2003-04ల్లో ఇదే కరోనా కుటుంబానికి చెందిన సార్స్ కరోనా ఎంతో మంది ప్రాణాలు తీసింది. ఈ వైరస్ జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. ఇంతకు ముందు స్వైన్ ఫ్లూ (ఎచ్1ఎన్1) కూడ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని చంపింది. ఒక్క అమెరికాలోనే 1200 మంది చనిపోయారు. అది మెక్సికోలో పుట్టిందనే అభిప్రాయంతో మొదట దాన్ని మెక్సికన్ ఫ్లూ అని పిలిచారు. సరిగ్గా ఇప్పుడు కొవిడ్-19ని కూడ చైనీస్ కరోనా అని పిలుస్తున్నారు. 

కాని ఆ తర్వాత స్వైన్ ఫ్లూ గురించి చాల వివరాలు బైటపడ్డాయి. అది పారిశ్రామిక ఉత్పత్తిలో తయారైన పందుల నుంచి మనుషులకు వ్యాపించింది. అది మెక్సికోలోని ఒక పంది మాంసం కర్మాగారంలో ప్రారంభమైంది. ఆ కర్మాగారం పేరు స్మిత్ ఫీల్డ్ ఫుడ్ కంపెనీ. అది ఒక అమెరికన్ కంపెనీ. ఆ కంపెనీ ప్రపంచంలోని అతి పెద్ద పంది మాంసపు ఉత్పత్తి, శుద్ధి కంపెనీలలో మూడో స్థానంలో ఉంది. ఆ కంపెనీకి సంబంధించిన వేరువేరు కార్ఖానాలలో సాలీనా రెండు కోట్ల ఎనబై లక్షల పందులను చంపి, హామ్, సాసేజి, బేకన్ వగైరా అనేక రూపాలలో ప్రపంచమంతటికీ సరఫరా చేస్తారు. ఈ కంపెనీ నుంచి ఆ మాంస ఉత్పత్తులను కొనుగోలు చేసే పెద్ద కంపెనీలు మెక్ డొనాల్డ్స్, కె ఎఫ్ సి వగైరాలు. అవన్నీ కూడ అమెరికన్ కంపెనీలే. ఆపిల్, పెప్సి, నైకి, జనరల్ మోటర్స్, వంటి అనేక అమెరికన్ కంపెనీలు చైనా చౌక శ్రమను దోపిడీ చేయడానికి చైనాలో తమ కర్మాగారాలు తెరిచినట్టుగానే, స్మిత్ ఫీల్డ్ ఫుడ్ కంపెనీ కూడ చైనాలో ఒక భారీ కర్మాగారాన్ని తెరిచింది. 
అలాగే ప్రపంచంలోకెల్లా ఎక్కువ పంది (సీమపంది) మాంసాన్ని ఉత్పత్తి చేసే కంపెనీల్లో ఐదవ స్థానంలో ఉన్న డానిష్ క్రౌన్ అనే డానిష్ కంపెనీ, ఏడో స్థానంలో ఉన్న జర్మనీకి చెందిన టోనీ కంపెనీ కూడ చైనాలో మాంసాన్ని ఉత్పత్తి చేసే, శుద్ధి చేసే భారీ కర్మాగారాల్ని తెరిచాయి. ఇక్కడి నుంచి ఆ మాంసం చైనా దేశీయ మార్కెట్ లోకీ, అంతర్జాతీయంగా అన్ని మార్కెట్లలోకీ సరఫరా అవుతుంది. ఈ మాంసాన్ని అతి ఎక్కువగా కొనుగోలు చేసేది మెక్ డొనాల్డ్స్, కె ఎఫ్ సి వంటి కంపెనీలు.

ఈ మాంస ఉత్పత్తి పరిశ్రమ పందెంలో చైనీయ కంపెనీల పాత్ర కూడ ఉందనేది స్పష్టమే. 2008 మాంద్యం తర్వాత, ప్రపంచంలోకెల్లా అతి పెద్ద మదుపు సంస్థ గోల్డ్ మాన్ సాక్స్ తన మదుపును అనేక రంగాలకు విస్తరించడంలో భాగంగా 300 మిలియన్ డాలర్లు ఖర్చుపెట్టి చైనాలోని పది అతి పెద్ద కోళ్ల ఫారంలను కొన్నది. దానికి తోడుగా, అదే సంస్థ చైనాలోని పంది మాంసం పరిశ్రమలో 200 మిలియన్ డాలర్లు మదుపు పెట్టింది.
వీటితోపాటు ఒ ఎస్ ఐ అనే అమెరికన్ బడా కంపెనీకి సంబంధించిన ఉదంతం ఒకటి ఇటీవల విపరీతంగా వార్తల్లోకెక్కింది. కోడి మాంసాన్ని ప్రాసెస్ చేసే ఈ కంపెనీకి చైనాలో పది భారీ కర్మాగారాలున్నాయి. ఇది తయారు చేసే మాంసం మెక్ డొనాల్డ్, కె ఎఫ్ సి వంటి కంపెనీల ద్వారా చైనాతో సహా ప్రపంచ మార్కెట్లన్నిటికీ చేరుతుంది. ఇది కుళ్లిపోయిన కోడి మాంసాన్ని ప్రాసెస్ చేసి, చైనా మార్కెట్ కు సరఫరా చేసింది. అది బైట పడడంతో చైనా ప్రభుత్వం ఈ కంపెనీ మీద భారీ జరిమానా విధించడం మాత్రమే కాక, పది మంది కంపెనీ సిబ్బందిని జైలుకు పంపింది.

ఈ సందర్భంలో ఈ వివరాలన్నీ ఎందుకు అవసరమంటే, 945 మిలియన్ డాలర్ల విలువైన ప్రపంచ మాంసం వ్యాపారంలో అమెరికాకూ, ఇతర యూరపియన్ దేశాలకూ ఉన్న భాగస్వామ్యమేమిటో, ఆ వ్యాపారంతో చైనాకు ఉన్న సంబంధమేమిటో మనం అర్థం చేసుకోవలసి ఉంది.
ఇప్పుడిక, ఈ మాంస ఉత్పత్తి ఎలా జరుగుతుందో కూడ చూద్దాం.

అప్టన్ సింక్లేర్ రాసిన సుప్రసిద్ధ నవల ‘జంగిల్’ 1906లో వచ్చింది. అమెరికన్ మాంస పరిశ్రమ ఎలా పనిచేస్తుందో అది సవివరమైన చిత్రణను ఇచ్చింది. ఆయన రాసిన ఒక వాక్యం నాకింకా గుర్తుంది. అక్కడ పందుల మృత్యుభయపు అరుపులు తప్ప ప్రతిదీ అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయంటారు సింక్లేర్. కాని నూట పదిహేనేళ్లు గడిచాక ఇవాళ పరిస్థితి ‘జంగిల్’ నవలలో వర్ణించినదానికన్న చాల ముందుకు వచ్చింది. ఇవాళ పరిశ్రమల్లో ఉత్పత్తి చేసే చెప్పుల లాగే, బట్టల లాగే, పందులు, కోళ్లు వంటి సజీవ జంతువులను కూడ అదే పద్ధతిలో ఉత్పత్తి చేస్తున్నారు. అనేక ఆంటీ బయోటిక్ మందులు, హార్మోన్లు, జెనెటిక్ ఇంజనీరింగ్ వాడి వాటిని ఉత్పత్తి చేస్తున్నారు. అందువల్ల ఇవాళ ఆ పందులు, కోళ్లు అరవడం కూడ లేదు. ఎందుకంటే వాటి జన్యువుల లోంచి అరవడం అనే లక్షణాన్ని తొలగించారు. తొందరగా ఎదగడానికీ, ఎక్కువ మాం ఇవ్వడానికీ వాటికి అన్ని రకాల మందులూ ఇస్తున్నారు. అవి ఎదగడం ఎంత ఆలస్యమైతే అంత ఎక్కువ ఖర్చవుతుంది గనుక ఆ ఖర్చును తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు. ఎక్కువ స్థలంలో ఉంచితే ఎక్కువ ఖర్చవుతుంది గనుక వాటిని ఇరుకు స్థలాలలో కిక్కిరిసేలా పెట్టి, అవి కదలడం కూడ సాధ్యం కాకుండా చేస్తున్నారు. పెట్టుబడిదారీ తర్కం ప్రకారం, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి క్రమబద్ధంగా వాటి జన్యు నిర్మాణాన్ని మారుస్తున్నారు. ఉదాహరణకు, కోడి ఈకలు తీయడం అనేది ఎక్కువ మంది శ్రామికులూ సమయమూ వెచ్చించవలసిన అదనపు అనవసర ఖర్చుగా భావించిన పరిశ్రమ ఈకలు తగ్గిపోయే శాస్త్ర అన్వేషణలు చేసి వాటి జన్యువులను మార్చింది. అదే విధంగా, కోడి కాళ్లు అమ్మినట్టుగా, కోళ్లలో, పందులలో, ఇతర జంతువులలో అనేక ప్రత్యేక అవయవాలను వేరు చేసి, విడిగా ప్యాక్ చేసి అమ్మే ప్రపంచ మార్కెట్ ఉంది గనుక, ఈ ప్రత్యేక అవయవాలు తొందరగా బరువు పుంజుకునేలా జన్యు నిర్మాణాలు మారుస్తున్నారు. మిగిలిన శరీరమంతా ఎంత బరువు ఉన్నదో, ఈ ప్రత్యేక అవయవాలు అంతే బరువుండే జన్యు నిర్మాణాలు తయారయ్యాయి. అంతే కాదు, వాటిని విడివిడిగా తూయడం, కొలవడం వంటి అదనపు శ్రమలు లేకుండా, అమ్మే జంతువులూ, పక్షులూ అన్నీ ఒకే బరువు ఉండేలా జన్యు నిర్మాణాలు మారుస్తున్నారు.

ఇలా పారిశ్రామికంగా తయారైన జంతువులు సహజ వాతావరణంలో మనుగడ సాగించజాలవు. వాటి కోసం కృత్రిమ వాతావరణం సృష్టించవలసిందే. ఉదాహరణకు, ఈకలు లేని కోడి ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రతలో మాత్రమే బతుకుతుంది. అంటే ఇక్కడ జంతువులను ఒక కృత్రిమ పద్ధతిలో తయారు చేయడం మాత్రమే కాదు, అవి బతకడానికి కృత్రిమ వాతావరణాన్ని కూడ సృష్టిస్తున్నారు. 
కాని ఈ ప్రక్రియలో ఏమవుతుందంటే ఈ జీవులకు సహజంగా ఉండే రోగ నిరోధక శక్తి, రక్షణ శక్తి అంతరించిపోతాయి. అంటే డార్విన్ చెప్పిన ‘సహజ ఎంపిక’ నియమం ఇక్కడ వర్తించకుండా పోతుంది. ‘సహజ ఎంపిక’ స్థానాన్ని ‘పెట్టుబడిదారీ ఎంపిక’ ఆక్రమిస్తుంది. ఇటువంటి పరిస్థితిలో కరోనా వంటి వైరస్ లు ఈ జంతువులకు సోకినప్పుడు, ఆ వైరస్ లు ఇబ్బడి ముబ్బడి కావడానికి (పరివర్తన చెందడానికి) సులభమవుతుంది. అంతేగాక, వేలాది జంతువులు ఒకేచోట కిక్కిరిసిన మందగా ఉన్నప్పుడు ఆ వైరస్ లు వ్యాపించడం సులభమవుతుంది. 

ఇందుకు భిన్నంగా, జంతువులు, జీవజాతులు సాపేక్షికంగా ఒకదానికొకటి దూరంగా, తమ సహజ వాతావరణాలలో, సహజ పద్ధతులలో జీవిస్తున్నపుడు వాటి రోగ నిరోధక శక్తి బలోపేతమవుతుంది. ఒక్కొక్క దానిలో వ్యక్తిగత స్థాయిలో రోగ నిరోధక శక్తి భిన్నంగా ఉంటుంది. అటువంటి స్థితిలో ఒక జంతువుకు వైరస్ సోకినప్పటికీ ఆ వైరస్ వేగంగా పెరగడానికి గాని, వ్యాపించడానికి గాని అవకాశం ఉండదు. ఒకరకంగా చెప్పాలంటే ఆ సహజ వాతావరణంలో వైరస్ దాటలేని అవరోధాలెన్నో ఉంటాయి. వైరస్ తో పోరాటంలో మెరుగ్గా ఉండే జంతువులు ‘సహజ ఎంపిక’ నియమం ద్వారా ఎంపిక అయి అవే మనుగడ సాగిస్తాయి. కాని జంతువులను పారిశ్రామికంగా, మార్కెట్ ఒత్తిళ్లకు లోబడి ఉత్పత్తి చేసినప్పుడు వైరస్ లు వ్యాపించడానికీ, వేగంగా పెరగడానికీ, పరివర్తన చెందడానికీ ‘ఎర్ర తివాచీ’ పరిచినట్టవుతుంది. ఈ పరిశ్రమలలో పనిచేసే మనుషులద్వారా వైరస్ మొత్తం సమాజానికీ వ్యాపిస్తుంది. చివరికి ఈ ప్రపంచీకరణ యుగంలో ప్రపంచమంతా వ్యాపిస్తుంది. 

ఈ జంతువుల ఉత్పత్తి పారిశ్రామిక స్థాయిలో జరుగుతున్నది గనుక, లక్షలాది మంది, ముఖ్యంగా ఈ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు వాటితో నిరంతర సంబంధంలో ఉంటారు. రోజులో 12-14 గంటలు వైరస్ ల తోనే ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో, అంత సుదీర్ఘకాలం చాల మంది ఒక్క చోటే ఉండడం వల్ల, వారిలో కూడ వైరస్ పరివర్తన చెందడానికి అవకాశాలు పెరుగుతాయి. కొవిడ్-19 వైరస్ కూ, ఇంతకు ముందరి సార్స్, ఇబోలా, స్వైన్ ఫ్లూ, జికా, ఎం ఇ ఆర్, వగైరా వైరస్ లకూ సంబంధం నేరుగా పారిశ్రామిక మాంస ఉత్పత్తితోనే ఉన్నదని ఇప్పటికే తేటతెల్లమయింది. 

జంతుశాస్త్రవేత్త రాబ్ వాలేస్ ‘బిగ్ ఫార్మ్స్ మేక్ బిగ్ ఫ్లూ’ (పెద్ద వ్యవసాయ క్షేత్రాలు భారీగా ఫ్లూను తయారు చేస్తాయి) అనే పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఆయన, “వైరస్ లు అంతకంతకూ ఎక్కువ ప్రమాదకరంగా ఎందుకు మారుతున్నాయో తెలుసుకోదలచిన వారెవరైనా వ్యవసాయాన్ని పారిశ్రామిక పద్ధతిలో చేసే నమూనాను పరిశోధించాలి. ప్రత్యేకించి పశుగణ ఉత్పత్తి పరిశ్రమను పరిశోధించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే పెట్టుబడిదారీ విధానాన్ని పరిశీలించాలి” అన్నారు. 

....మిగతా రెండవ భాగం లో