*ప్రకృతి వనరులను దుర్వినియోగం చేయకుండా, పర్యావరణాన్ని మరియు భూభాగాన్ని కాపాడుకోవాలని జన విజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షులు దాసరి గురుస్వామి తెలిపారు*.
*నేడు కొనకనమిట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో, ప్రధానోపాధ్యాయులు రామాంజనేయులు అధ్యక్షతన, ధరిత్రి దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు రామాంజనేయులు మాట్లాడుతూ మన భూమిని మనము కాపాడుకోవాలని పచ్చదనం పెంచాలని అడవులను కాపాడుకోవాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు*.
*జన విజ్ఞాన వేదిక ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షులు దాసరి గురు స్వామి మాట్లాడుతూ నేల కాలుష్యంను తగ్గించుటకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, అతి తక్కువ మైక్రాన్లు గల పలుచని ప్లాస్టిక్ కవర్ల వాడకము తగ్గించాలని, ప్రభుత్వం ప్లాస్టిక్ కవర్ల పై నిషేధించాలని విధించాలని డిమాండ్ చేశారు. ప్లాస్టిక్ కవర్లు విచ్చలవిడిగా ఉపయోగించి బయట పడ వేయడం వల్ల భూమి పై పొరల లో ఈ ప్లాస్టిక్ కవర్లు కూరుకుపోయి వర్షం పడినప్పుడు భూమి లోపలికి నీరు వెళ్లకుండా అడ్డు పడు తున్నాయి. దీనివలన భూగర్భ జలాలు పెరిగే అవకాశం లేక నీటి కరువు ఏర్పడబోతోంది.కనుక ప్రతి ఇంటి ముందు, చెట్లను పెంచాలని, ప్రతి ఇంటికి ఇంకుడు గుంటలు ఏర్పాటు చేసుకోవాలని, నేల కాలుష్యం తగ్గించుటకు ప్రతి ఒక్కరూ పూనుకోవాలని దాసరి గురుస్వామి తెలిపారు*.
*ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు టి రామారావు, ఎం వి శ్రీనివాసులు, జట్ల రవికుమార్, బాదం రవికుమార్, యుద్ధం శ్రీనివాసులు, పద్మజ, మరియు సి ఆర్ పి సురేష్ పాల్గొన్నారు*.
No comments:
Post a Comment