****************
ఓటుకోసమొస్తారునాయకులు
నోటుజేబిలెడతారునాయకులు
తాయిలాలు బిస్కెట్లు మందు
బాటిల్ చేతికిచ్చి-ఒక్కరాత్రితో
సీటుకుపునాదేసుకుంటారు!ఓ!
సోతంత్రం వచ్చిమనకు డెబ్బైయ్యేళ్ళు దాటిపాయె
ఇప్పటికీ సదువులేని
పెజాసోమ్యమురమనది
కానరాని జబ్బులతో
జనం సచ్చిపోతున్రు
విద్యా వైద్యం ఉచితం
కావాలని అడగండ్రి !!ఓ!!
టాక్సులేని సరుకులేదు
జి యస్ టి పేరుతో
కొంటేటాక్సు తింటేటాక్సు
టాక్సులేని బతుకులేదు
కోట్లు కోట్లు నొల్లుకొని
యాపారాల్జేసుకొని
మాబతుకులు ముంచకండి
దేశబత్తులారమీరు !!ఓం!!
కులాలొద్దు మతాలొద్దు
జనంమద్దె సిచ్చులొద్దు
పండగలు పేరుతో
డబ్బుదుబారా వద్దు
సాగునీరు తాగునీరు
రోడ్లుసక్కగేయండి
తాయిలాలు మాకువద్దు
'పని'జూపిస్తేచాలు!!ఓ!!
*******
No comments:
Post a Comment