Monday, 13 December 2021

జన విజ్ఞాన వేదిక రాష్ట్ర స్థాయి చెకుముకి సైన్స్ సంబరాల కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్సీ K.S. లక్ష్మణరావు గారు

జన విజ్ఞాన వేదిక రాష్ట్ర స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు వచ్చే *జనవరి 8, 9* తేదీల్లో *గుంటూరులోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్* లో నిర్వహిస్తున్నట్లుగా ఎమ్మెల్సీ కే.ఎస్. లక్ష్మణరావు గారు తెలిపారు గుంటూరులోని యు.టి.ఎఫ్. కార్యాలయంలో *చెకుముకి సైన్స్ సంబరాల కరపత్రాన్ని* శనివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మణ రావు గారు మాట్లాడుతూ విద్యార్థులలో *శాస్త్రీయ దృక్పథాన్ని, ప్రశ్నించే తత్వాన్ని* పెంపొందించడానికి గత 30 ఏళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరారు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాజశేఖర్ రాహుల్, మురళీధర్ లు మాట్లాడుతూ ఇప్పటికే పాఠశాల స్థాయిలో నిర్వహించిన పోటీల్లో *నాలుగున్నర లక్షల మంది విద్యార్థులు* పాల్గొన్నారని తెలిపారు. వారికి జిల్లా స్థాయి పోటీలు నిర్వహించి విజేతలను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్టుగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లోని *13 జిల్లాల నుండి 52 బృందాలు* ఈ చెకుముకి సంబరాల్లో పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే సంబరాలలో  *క్విజ్, శాస్త్రవేత్తల తో ముఖాముఖి, సైన్స్ ప్రయోగాలు* ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు త్రిమూర్తులు రెడ్డి, శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment