కరోనా నేపథ్యంలో ప్రజారోగ్యం :: డా||సీతారామ శాస్త్రి గారు జెవివి ప్రకాశం స్టడీ సర్కిల్ కొరకై నిర్వహించబడిన చర్చా కార్యక్రమం
[27/04, 4:26 PM] JVVMRKP@Dr.DSarat:
HEALTH లేదా ఆరోగ్యం ఆఫీషియల్ W.H.O
డెఫినేషన్:::::::::::
"A state of complete physical,mental and social well-being,NOT merely the absence of disease or infirmity."
ఓ మనిషి జబ్బులు లేకుండా ఉండటమో బలహీనంగా ఉండటం కాదు........
సంపూర్ణంగా భౌతికంగా మానసికంగా మరియు సామాజికంగా మంచి స్థితిలో ఉండటమే "ఆరోగ్యం" అని నిర్వచనం
[27/04, 4:27 PM] JVVMRKP@Dr.DSarat:
ప్రజారోగ్యం అంటే ఏమిటి?
[27/04, 4:41 PM] JVVMRKP@Dr.DSarat:
"ఆరోగ్యం అనేది సామాజిక శాస్త్రం..... రాజకీయం అంటే విస్తృత స్థాయిలో ఉన్న ఆరోగ్య శాస్త్రమే.... వైద్యం/ఆరోగ్యం అనేది సామాజిక సమస్య కాబట్టి అది సమాజం సమస్య లను ఎత్తి చూపుతూ పరిష్కారం చూపవలసిన బాధ్యత కలిగి ఉంది. దానిని సాధించే పని రాజకీయ వ్యవస్థ లకు ఉంది "...
రుడాల్ఫ్ విర్షో అనే శాస్త్రవేత్త 200 సంవత్సరాల క్రితం చెప్పిన మాట....
ఇప్పటికీ నిజమేనా?
[27/04, 4:43 PM] JVVMRKP@Dr.DSarat:
ఆరోగ్యం కూ ఆర్థిక స్థితి కీ సంబంధం ఏమిటి?
[27/04, 4:44 PM] JVVMRKP@Dr.DSarat:
ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్యం( PUBLIC PRIVATE PARTNERSHIP) ఎంత వరకూ కరెక్ట్? అందులో లోటుపాట్లు ఏమిటి?
[27/04, 4:45 PM] JVVMRKP@Dr.DSarat:
GDP కూ ఆరోగ్యం కూ మధ్య సంబంధం ఏమిటి?
[27/04, 5:06 PM] JVVMRKP@Dr.DSarat:
ఈ చర్చ ను కొరోనా మీద కాకుండా...... ఓవర్ అల్ గా ప్రజారోగ్యం -- దాని నిర్లక్ష్యం -- సవాళ్లు -పరిష్కారం లాగా చర్చ చేయమని కోరుతున్నాను
[27/04, 5:07 PM] JVVMRKP@ch.Jayaprakash Social Activist:
మిత్రులారా! కరోనా నేపథ్యంలో ప్రజారోగ్యం' పై డా"సీతారామ శాస్త్రి గారు వాయిస్ మెసేజ్ ప్రారంభ సందేశం (
[27/04, 5:20 PM] JVVMRKP@Dr.DSarat:
ప్రజారోగ్యం ఎలా నిర్లక్ష్యం చేయబడింది?
[27/04, 5:26 PM] JVVMRKP@ch.Jayaprakash Social Activist:
మిత్రులారా! కరోనా ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటినీ చుట్టుముట్టింది. అందుకని ఆయా దేశాల్లో ఉన్న ప్రజారోగ్య వ్యవస్థ ఎటువంటిది? ఇటువంటి health ఎమర్జెన్సీని ఏ దేశాలు ఏ రకంగా ఎదుర్కొన్నాయి? వాటి మంచి చెడులు డాక్టర్ సీతారామ రామశాస్త్రి గారు వివరించారు.
[27/04, 5:30 PM] +91 98498 04467: భారత దేశంలో కార్పొరేట్ వైద్యం ప్రారంభం నుంచి ప్రజా వైద్యం నిర్లక్ష్యం చేయడం ప్రారంభమైంది
[27/04, 5:31 PM] JVVMRKP@Dr.DSarat:
నిర్లక్ష్యం చేయబడిన విధానం ఇలా చూడవచ్చు.
1) ప్రభుత్వం నిధులు తగ్గించటం.
2)నిధుల కొరత చూపి ప్రయివేటు భాగస్వామ్యం చేయటం
3)చివరగా సంపూర్ణంగా ప్రయివేటు పరం చేయటం.
ఇలా ప్రయివేటు పరం కానున్న వైద్యం కేవలం లాభం వచ్చిన జబ్బులు మాత్రమే చికిత్స చేస్తున్నారు తప్ప ప్రజారోగ్యం వేదిక గా చేయదు.
[27/04, 5:32 PM] +91 98498 04467: ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్య శ్రీ తో ప్రజారోగ్య నిర్లక్ష్యం ఉచ్చ స్థాయి కీ చేరింది
[27/04, 5:35 PM] JVVMRKP@Dr.DSarat:
ఇన్సూరెన్స్ కంపెనీలు ఆరోగ్య వ్యవస్థ మీద ఎలా ప్రభావితం చేస్తున్నాయి?
మనలాంటి దేశాల్లో ఇది కరెక్టా?
[27/04, 5:37 PM] JVVMRKP@Dr.DSarat:
మనం పేపర్ లో చూసే
" కార్పొరేట్ స్థాయిలో మేమూ వైద్యం అందిస్తాము" అనే పదం కరెక్టే నా?
ఒక వ్యక్తి లేదా సంస్థ మంచి
ఆసుపత్రి ఇవ్వగలిగితే మన వ్యవస్థ ఎందుకు ఇవ్వలేకపోతున్నది?
[27/04, 5:41 PM] +91 75694 95186: నిజమే సార్ ప్రకృతి లో జీవరాశుల మధ్య నిరంతరం మనుగడ కోసం నిరంతర పోరాటం అనేది జరుగుతూనే వుంది. ఆ పోరాటంలో జయించిన జీవులే ప్రకృతి లో మనుగడ సాగించడం జరుగుతుంది.దీన్ని డార్విన్ అనే శాస్త్రవేత్త ఎంతో క్లుప్తంగా వివరించారు
[27/04, 5:47 PM] JVVMRKP@GUmamaheswari:
కరోనా నేపథ్యంలో ప్రజారోగ్యం' పై డా"సీతారామ శాస్త్రి గారు ఆడియో మెసేజ్ ల ద్వారా చక్కటి విశ్లేషణ ను అందించారు థన్యవాదాలు
[27/04, 5:47 PM] +91 98498 04467: కరెక్ట్ కాదు. ప్రభుత్వ వ్యవస్థకు ఏ వ్యవస్థ కూడా సరి కాదని ఇప్పుడు నిరూపించబడింది. మన రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా, ఆరోగ్యం నిర్లక్ష్యం చేయబడినంత ఏ రాష్ట్రంలో జరగలేదు
[27/04, 5:54 PM] JVVMRKP@ch.Jayaprakash Social Activist:
ప్రభుత్వాల దగ్గర మన ఆర్థిక వివరాలు ఆదాయ వివరాలు ఉన్నాయి గాని మన ఆరోగ్య ప్రొఫైళ్లు ఉండవు శోచనీయమైన విషయం😢
[27/04, 6:03 PM] +91 99486 62296: భారతదేశంలో ఆరోగ్యం విద్య మిగతా దేశాలతో పోల్చుకుంటే చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి కారణం ఆరోగ్యం విద్య పట్ల ప్రభుత్వాలు నిశిత దృష్టితో చూడలేకపోవడం విద్యలో ఆరోగ్యంలో హ్యూమన్ డెవలప్మెంట్ లో నార్వే మొదటి స్థానంలో ఉందిగత పది సంవత్సరాల ఇండెక్స్ తీసుకుంటే భారతదేశం 130 నుంచి 142 స్థానాల మధ్య కొట్టుమిట్టాడుతోంది దీనికి ఏకైక కారణం మూఢత్వం, ప్రభుత్వాల అసమర్థత, ప్రశ్నించే వాళ్ళు తక్కువగా ఉండటం
[27/04, 6:43 PM] Sree:
భారత దేశంలోని ప్రజారోగ్య వ్యవస్థను గురించి Dr. సీతారామ శాస్త్రి గారు 4 భాగాలలో తమ విస్తృత సందేశాన్ని చక్కగా వివరించారు. ఈ సందేశంలో ప్రజారోగ్యం అనేది సామాజిక ఆరోగ్యం తో ఏ విధంగా ముడిపడి ఉంది, అది ఏ విధంగా నిర్లక్ష్యం చేయబడుతోంది అనే విషయాన్ని విపులీక రించినందుకు వారికి మా జెవివి, మార్టూరు శాఖ తరపున ధన్య వాదములు.
[27/04, 6:52 PM] JVVMRKP@ch.Jayaprakash Social Activist:
డాక్టర్ సీతారామశాస్త్రిగారు భారతదేశ ప్రజారోగ్య వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో వివరించారు.ఆ వ్యవస్థని బలోపేతం చేయడానికి సైన్స్ కార్యకర్తలు, విద్యావంతులు కృషి చేయాల్సిన ఆవశ్యకతను తెలియపర్చారు.
🪐గత రెండు రోజులుగా డాక్టర్ గారితో అనేక పర్యాయాలు ఫోన్లో మాట్లాడుతూ అనేక విషయాలు... వారి వద్ద నుండి అయిదు(5) ఆడియో మెసేజ్ లో పొందు పరచడమైనది.ఈ ఆడియో మెసేజ్ లన్ని కలిపి మరోసారి వినండి.శాస్త్రీయంగా అనేక విషయాలు analyse చేశారు డాక్టర్ గారు.మంచి వివరణాత్మక విశ్లేషణ, సమాచారం అందించారు.
💐స్టడీ సర్కిల్ కోసం వారి విలువైన సమయాన్ని కేటాయించినందుకు డాక్టర్ సీతారామశాస్త్రి గార్కి ధన్యవాదాలు💐🙏🙏
@JVV సోషల్ మీడియా విభాగం ,ప్రకాశం జిల్లా. వారి తరపున ధన్య వాదాలు.
[27/04, 7:05 PM] JVVMRKP@ch.Jayaprakash Social Activist: ఈరోజు స్టడీ సర్కిల్ నిర్వహణ కు ప్రిన్సిపాల్/అధ్యక్షత వహించిన కుర్రా రామారావు,(JVV state) గారికి,JVV రాష్ట్రపరిశీలకులు/Advisor గా హాజరైన రాహుల్ గారికి ప్రత్యేక ధన్యవాదములు💐💐💐🙏🙏
చర్చా కార్యక్రమం ముగిసింది.
No comments:
Post a Comment